By: ABP Desam | Updated at : 23 Jun 2023 09:50 AM (IST)
జేమ్స్ కామెరూన్(Photo Credit: James Cameron/Instagram)
ప్రపంచంలో టాప్ దర్శకులలో ఒకరు జేమ్స్ కామెరాన్. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన చిత్రాలు కేవలం మూడే అయినా, అంత అద్భుతమైన మూవీస్ తీసిన వారు మరొకరులేరని చెప్పుకోవచ్చు. ‘టైటానిక్’ లాంటి చిత్రంతో ప్రపంచ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ షిప్ ఎలా సముద్ర గర్భంలో కలిసిపోయిందో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో టైటానిక్ ఓడ మునిగిన ప్రదేశాన్ని 33 సార్లు సందర్శించారు. 1995లో తొలిసారి ఓ రష్యన్ సబ్‌మెరైన్‌లో ప్రయాణించి టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని వీడియో తీశారు. ఇందుకోసం ఉత్తర అట్లాంటిక్ ఉపరితలం నుంచి సముద్రగర్భంలో ఏకంగా 13 వేల అడుగుల లోతుకు వెళ్లారు.
పేలిపోయిన టైటాన్, ఐదుగురు అన్వేషకులు మృతి!
తాజాగా టైటానిక్ షిప్ సందర్శన కోసం వెళ్లిన ‘టాటాన్’ ప్రమాదానికి గురైంది. అధిక పీడనం కారణంగా టైటాన్ పేలిపోయినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్‌స్ ప్రకటించారు. అందులో ఉన్న ఐదుగురు అన్వేషకులు మరణించినట్లు వెల్లడించారు. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి టైటాన్ శకలాలను గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో టైటానిక్ మునిగిపోయిన ప్రదేశాన్ని పలుమార్లు సందర్శించిన జేమ్స్ కామెరూన్ గతంలో పంచుకున్న విషయాల గురించి మళ్లీ చర్చలు జరుగుతున్నాయి.
భూమ్మీద ఉన్న అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఒకటి- జేమ్స్ కామెరూన్
టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రదేశంలో భూమ్మీద ఉన్న అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఒకటిగా జేమ్స్ కామెరాన్ అభిప్రాయపడ్డారు. “ఈ భూమి మీద ఉన్న అత్యంత క్రూరమైన ప్రదేశాలలో టైటానికి షిప్ మునిగిపోయిన ప్రదేశం ఒకటి. నాకు మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడాలని ఎక్కువ కోరిక ఉండేది. అందుకే టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రదేశాన్ని చూడాలి అనుకున్నాను. అనుకున్నట్లుగానే అక్కడికి పలుమార్లు వెళ్లి పరిశీలించాను. అదే సమయంలో సముద్రగర్భంలో జరిగే ఘటనల ఆధారంగా ‘ఎక్స్‌పెడిషన్: బిస్‌మర్క్’, ‘ఘోస్ట్స్ ఆఫ్ ది అబేస్ అండ్ ఏలియన్స్ ఆఫ్ ది డీప్’ అనే డ్యాకుమెంటరీలను రూపొందించాను” అని వెల్లడించారు.
‘టైటానిక్’ సినిమా తీయడం వెనుకున్న ఉద్దేశం ఏంటంటే?
అటు ప్రపంచ వ్యాప్తంగా చారిత్రాత్మక విజయం అందుకున్న ‘టైటానిక్’ సినిమా తీయడం వెనుకున్న ఉద్దేశాన్ని కూడా జేమ్స్ కామెరాన్ వివరించారు. “షిప్ మునిపోయిన ప్రాంతాన్ని చూడాలనే కోరికతోనే ‘టైటానిక్’ సినిమాను తెరకెక్కించాను. ప్రత్యేకంగా దాన్ని సినిమాగా తీయాలనే ఉద్దేశం నాకు లేదు. అప్పట్లో సబ్ మెరైన్ లో సముద్ర గర్భంలో ప్రయాణించాను. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్ ప్రమాదం అనేది చాలా పెద్దది. ఒక డైవర్ గా ఆ సినిమాను అద్భుతంగా చూపించాలి అనుకున్నాను. అందుకే చాలాసార్లు ఆ షిప్ మునిగిపోయిన ప్రదేశానికి వెళ్లి చూశాను. సినిమా నిర్మాణం అనేది నా దృష్టిలో సాహసయాత్ర లాంటిదే. ఇలాంటి సినిమాల నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తుంటాను” అని వెల్లడించారు.
Read Also: విజయ్ వర్మలో నాకు నచ్చనిది అదొక్కటే, ఆసక్తికర విషయం చెప్పిన మిల్కీబ్యూటీ
అత్యంత లోతైన సముద్ర ప్రాంత అడుగు భాగానికి ఒంటరిగా వెళ్లిన కామెరాన్
వాస్తవానికి సముద్రగర్భంలో సాహసయాత్రలు చేయడంలో జేమ్స్ కామెరాన్ ను గొప్ప చరిత్ర ఉంది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం ప్రపంచంలో ఎవరూ చేయని సాహసం చేశారు. అత్యంత లోతైన సముద్ర ప్రాంతం పసిఫిక్ సముద్రంలోని మెరైనా ట్రెంచ్ అడుగు భాగానికి ఒక్కరే వెళ్లారు. ఈ యాత్ర సమయంలో ప్రపంచలోనే అత్యంత సుదూర ప్రాంతానికి వెళ్తున్నందుకు గర్వంగా ఫీలయ్యాను. ఆ సమయంలో ఈ భూగ్రహం మీద తానొక్కడినే ఉన్నట్లు ఫీలయ్యానన్నారు. అక్కడ మనుషులు ఎవరూ ఉండరని, ఏదైనా జరిగితే కాపాడేందుకు కూడా ఎవరూ వచ్చే అవకాశం లేదని చెప్పారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మృణాల్
Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?
Rocky Aur Rani Ki Prem Kahaani: రణవీర్ సింగ్ ‘రీల్’ ఇంట్లో హత్య - ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ రాంధావ ప్యారడైజ్లో దుర్ఘటన
TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?
Lokesh Kanagaraj Fight Club : ఫైట్క్లబ్తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్గా మాత్రం కాదు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం
Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు
/body>