Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
ఇండస్ట్రీలో ప్రముఖులు, స్నేహితులకు సోమవారం రాత్రి రామ్ చరణ్ బర్త్ డే పార్టీ ఇచ్చారు. దానికి చాలా మంది వచ్చారు. అయితే, ఎన్టీఆర్ మాత్రం ఫొటోల్లో ఎక్కడా కనిపించలేదు. పార్టీకి ఆయన రాలేదని తెలిసింది.
![Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? Ram Charan Birthday Party Why RRR Co Actor Jr NTR Pushpa Star Allu Arjun Skipped star studded bash Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/53deb9e43816435d71e15cb40cd510a71679976574376313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'ఆర్ఆర్ఆర్' ఇంటర్వ్యూల్లో రామ్ చరణ్, తనకు మధ్య స్నేహం గురించి ఎన్టీఆర్ చెప్పిన ఓ విషయం అందర్నీ ఆకట్టుకుంది. అది ఏమిటంటే... ఎన్టీఆర్ (Jr NTR Wife Pranathi) లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు మార్చి 26న! ఆ తర్వాత రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు (Ram Charan Birthday).
మార్చి 26 రాత్రి పన్నెండు గంటల వరకు ప్రణతితో టైమ్ స్పెండ్ చేసి... ఆ రాత్రి పన్నెండు దాటిన వెంటనే రామ్ చరణ్ ఇంటికి వెళ్ళి అతడిని పిక్ చేసుకుని తామిద్దరం బయటకు వెళ్ళే వాళ్ళమని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మరి, ఈ ఏడాది అలా జరిగిందా? ఇంతకు ముందు ఆయన చెప్పినట్లు చేశారా? అని ప్రేక్షకులకు సందేహం కలిగింది. ఎందుకంటే... రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు.
చరణ్ బర్త్‌డే పార్టీలో ఎన్టీఆర్ ఎక్కడ?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంట సోమవారం రాత్రి తారా తోరణం వెలసింది. టాప్ హీరోలు, హీరోయిన్లు తమ తమ ఫ్యామిలీలతో కలిసి సందడి చేశారు. రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే సందర్భంగా ఇచ్చిన పార్టీకి ఆల్మోస్ట్ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ అటెండ్ అయ్యారు. రాజమౌళి, కీరవాణి అండ్ ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ, వెంకటేష్, విజయ్ దేవరకొండ, చరణ్ క్లోజ్ ఫ్రెండ్ రానా దగ్గుబాటి, భర్తతో కాజల్ అగర్వాల్, భార్య & అక్కతో మంచు మనోజ్ సందడి చేశారు. ఎన్టీఆర్ మాత్రం రాలేదని సమాచారం.
కొరటాల షూటింగులో ఎన్టీఆర్!
'ఆర్ఆర్ఆర్' విడుదలైన ఏడాది తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా చిత్రీకరణ చేయడం ప్రారంభించారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా ఈ మధ్య పూజతో మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రాత్రి వేళల్లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందువల్ల, ఎన్టీఆర్ రాలేదని సమాచారం అందుతోంది.
అల్లు అర్జున్ కూడా రాలేదు...
సోషల్ మీడియాలో విషెష్ చెప్పలేదు!
జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి అటెండ్ కాలేదని తెలుస్తోంది. పైగా, సోషల్ మీడియాలో విషెష్ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తారక్, బన్నీ గైర్హాజరు డిస్కషన్ టాపిక్ అవుతోంది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే... మీరిద్దరూ కలిశారా? లేదా? అని కొందరు రిప్లైలు ఇవ్వడం గమనార్హం.
Also Read : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'ను ప్రకటించినప్పుడు... తెలుగు ప్రేక్షకులలో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే... నందమూరి, కొణిదెల (మెగా) కుటుంబాలను అభిమానించే ప్రేక్షకుల మధ్య ఒక విధమైన పోటీ వాతావరణం ఉంటుంది. అందుకని... యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మల్టీస్టారర్ అంటే జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, 'ఆర్ఆర్ఆర్' విడుదల సమయంలో హీరోలు ఇద్దరి మధ్య సఖ్యత తెలుగుతో పాటు మిగతా భాషల ప్రేక్షకులకు కూడా తెలిసి వచ్చింది. అయితే, ఆస్కార్స్ కోసం అమెరికా వెళ్లినప్పటి నుంచి హీరోల మధ్య దూరం పెరిగిందని గుసగుసలు వినబడుతున్నాయి.
Also Read : తండ్రి ఫోటోతో వారసుడు - తారకరత్న మరణం తర్వాత తొలిసారి...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)