Taraka Ratna Son : తండ్రి ఫోటోతో వారసుడు - తారకరత్న మరణం తర్వాత తొలిసారి...
తారకరత్న మరణం తర్వాత తొలిసారి ఆయన కుమారుడి ఫోటోను అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు.
![Taraka Ratna Son : తండ్రి ఫోటోతో వారసుడు - తారకరత్న మరణం తర్వాత తొలిసారి... Taraka Ratna son poses with father photo and says, I wanna be like my dad when I grow up Taraka Ratna Son : తండ్రి ఫోటోతో వారసుడు - తారకరత్న మరణం తర్వాత తొలిసారి...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/a3f128637c746b38598627aad9e2e24b1679973355736313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) భౌతికంగా ప్రజల మధ్య లేరు. అయితే, ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రజలతో ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి అయితే పిల్లల్లో తన భర్తను చూసుకుంటున్నారు. తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పేరు నిష్క. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఎంట్రీ ఇచ్చారు. నిష్క తర్వాత కవలలు జన్మించారు. ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. తండ్రి మరణం తర్వాత తొలిసారి తారక రత్న వారసుడి ఫోటోను అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు.
పెద్దైన తర్వాత తండ్రిలా...
అబ్బాయి ఫోటోలను అలేఖ్యా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో షేర్ చేశారు. అందులో తండ్రి ఫోటోతో వారసుడు ఉన్నారు. పెద్దైన తర్వాత తండ్రిలా కావాలని అబ్బాయి అంటున్నట్లు అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. అదీ సంగతి!
తారక రత్న (Taraka Ratna Family) జ్ఞాపకాల నుంచి బయటకు రావడం ఆయన కుటుంబ సభ్యులకు భారంగా ఉంది. ఆయనతో గడిపిన చివరి క్షణాల గురించి భార్య అలేఖ్యా రెడ్డి, పెద్దమ్మాయి నిష్క సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
హిందూపూర్ వెళ్ళడానికి ముందు...
తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిష్క (Taraka Ratna Daughter Nishka) తర్వాత కవలలు (అబ్బాయి, అమ్మాయి) జన్మించారు. ఇప్పుడు తారక రత్న పెద్దమ్మాయి నిష్క సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేశారు. తాజాగా తండ్రితో గేమింగ్ ఆడుతున్న వీడియో షేర్ చేశారు.
Also Read : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?
View this post on Instagram
''హిందూపూర్ వెళ్ళడానికి ముందు రోజు సాయంత్రం ఓబు (ఇంట్లో తారక రత్నను ముద్దుగా పిలిచే పేరు)తో... గేమింగ్'' అంటూ ఈ వీడియోను నిష్క అకౌంట్ నుంచి షేర్ చేశారు. యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి ముందు రాజకీయ కార్యక్రమాల్లో తారకరత్న చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో కొన్నిసార్లు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికైన హిందూపూర్ కూడా వెళ్లారు.
తండ్రి తారక రత్నతో దిగిన ఫోటోను నిష్క పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె తొలి పోస్ట్ అదే. ఆ ఫోటోకి క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ రెండు లవ్ ఎమోజీలను యాడ్ చేశారు. ఆ తర్వాత తారక రత్న, అలేఖ్యా రెడ్డి ఫోటో పోస్ట్ చేశారు. ''మై పేరెంట్స్! వీళ్ళే నా బలం, నా ప్రేమ'' అని నిష్క పేర్కొన్నారు. ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీలో అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు.
Also Read : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
తారక రత్న ఫిబ్రవరి 18న మరణించారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న అలేఖ్యా రెడ్డి, ఆ తర్వాత నుంచి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణను దేవుడిగా వర్ణించారు. హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలో తారక రత్న పేరు మీద ఓ బ్లాక్ ఓపెన్ చేయడంతో ఆయనది బంగారు మనసు అని పేర్కొన్నారు. దానికి కొన్ని రోజుల ముందు తమ దంపతులపై వివక్ష చూపించారని పేర్కొన్నారు.
''మనం కలిశాం, మనం మంచి స్నేహితులు అయ్యాం, మనం డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాం... మన బంధం గురించి అప్పట్లో నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పటికీ... మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావ్. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి నువ్వు యుద్ధం చేయడం స్టార్ట్ చేశావ్'' అని తమ ప్రయాణం ప్రారంభమైన తొలినాళ్లలో సంగతులు చెప్పుకొచ్చారు. తారక రత్న, తాను పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి తమకు కష్టాలు మొదలు అయ్యాయని అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. తమపై వివక్ష చూపించారని, అయినా తాము బతికామని, సంతోషంగా ఉన్నామని ఆమె వివరించారు. పెద్దమ్మాయి నిష్కమ్మ జన్మించిన తర్వాత తమ ఆనందం రెట్టింపు అయ్యిందని తెలిపారు. అయితే, ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. 2019లో కవలలు జన్మించడం తమకు సర్‌ప్రైజ్ అన్నారు. తారక రత్న ఎప్పుడూ పెద్ద కుటుంబం కావాలని కోరుకునే వారని, ఇప్పుడు తనను మిస్ అవుతున్నామని అలేఖ్యా రెడ్డి తెలిపారు. తారక రత్న గుండెల్లో బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని, బాలకృష్ణ ఒక్కరే తమకు అండగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)