Rajkummar Rao: బిగ్ రెస్పాన్సిబిలిటీ.. టెన్షన్‌గా ఉంది - గంగూలీ బయోపిక్‌పై రాజ్ కుమార్ రావ్ రియాక్షన్
Sourav Ganguly Biopic: తాను గంగూలీ బయోపిక్‌పై నటిస్తుండడంపై బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ స్పందించారు. ఇది ఓ పెద్ద బాధ్యత అని.. కొంచెం టెన్షన్‌గా ఉందన్నారు.

Rajkummar Rao Reaction On Sourav Ganguly Biopic: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గంగూలీ రోల్‌లో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
టెన్షన్‌గా ఉంది
గంగూలీ బయోపిక్‌లో నటించడం ఓ పెద్ద బాధ్యత అని.. ఆయనలా కనిపించేందుకు టెన్షన్‌గా ఉందని రాజ్ కుమార్ రావ్ అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'దాదా ఇప్పటికే ఈ విషయం గురించి చెప్పారు. నేను ఆయన బయోపిక్‌లో నటిస్తున్నా. నాకు చాలా టెన్షన్‌గా ఉంది. గంగూలీ బయోపిక్‌లో నటించడం ఓ పెద్ద రెస్పాన్సిబిలిటీ. కానీ ఈ జర్నీ చాలా ఫన్ గా ఉంటుంది. నా భార్య పత్రలేఖ వద్ద బెంగాళీ భాషను నేర్చుకున్నా.' అని తెలిపారు.
Also Read: ఎవరీ ప్రీతి ముకుందన్? 'కన్నప్ప'లో విష్ణు మంచు జంటగా నటించిన హీరోయిన్ బ్యాగ్రౌండ్, కెరీర్ తెల్సా?
ఆయనే పర్‌ఫెక్ట్
ఈ మూవీకి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించనుండగా.. లవ్ రంజన్ నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. గంగూలీ పర్సనల్ లైఫ్‌తో పాటు క్రికెట్ కెరీర్‌ను మూవీలో చూపించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల పాటు క్రికెట్‌లో సత్తా చాటారు దాదా. 2008లో ఆటకు వీడ్కోలు పలికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.
2021 నుంచే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కాగా.. సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచీ గంగూలీ పలు సందర్భాల్లో స్పందించారు. హీరో రాజ్ కుమార్ రావే తన బయోపిక్‌లో నటించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆయనైతేనే తన రోల్‌కు సరిగ్గా సరిపోతారని చెప్పారు. రాజ్ కుమార్ రావ్ రీసెంట్‌గా 'స్త్రీ 2'తో మెప్పించగా.. ప్రముఖ బిజినెస్ మ్యాన్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'శ్రీకాంత్' బయోపిక్‌లోనూ నటించారు.
త్వరలోనే షూటింగ్
ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం అవుతుందని.. అదే ఏడాది డిసెంబరులో రిలీజ్ కావొచ్చని గంగూలీ ఇది వరకు చెప్పారు. ఇక దీనిపై మూవీ టీం అధికారికంగా స్పందించాల్సి ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
క్రికెటర్స్ బయోపిక్స్.. హిట్ అంతే..
ఇప్పటివరకూ పలువురి ఇండియన్ క్రికెటర్స్ బయోపిక్స్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి మంచి హిట్ అందుకున్నాయి. మాజీ కెప్టెన్స్ మహేంద్ర సింగ్ ధోనీ, మహ్మద్ అజహరుద్దీన్ బయోపిక్స్ ఆడియన్స్‌ను అలరించాయి. ఇప్పుడు తాజాగా గంగూలీ బయోపిక్ కూడా అంతే స్థాయిలో భారీ హిట్ అందుకుంటుందని దాదా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.





















