Kannappa: ట్రోలర్స్‌కు 'కన్నప్ప' మూవీ టీం స్ట్రాంగ్ వార్నింగ్ - అలా చేస్తే యాక్షన్ తీసుకుంటాం
Manchu Vishnu: మంచు విష్ణు 'కన్నప్ప' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీం సోషల్ మీడియా వేదికగా సినీ విమర్శకులకు కీలక సూచన చేసింది.

Kannappa Movie Team Strong Warning: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య మరో 2 రోజుల్లో సినిమా థియేటర్లలోకి వస్తుండగా.. తాజాగా మూవీ టీం సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మూవీ గురించి కానీ.. ప్రొడ్యూసర్స్, వాటాదారుల పరువుకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి సాంగ్స్, ట్రైలర్, లుక్స్ రిలీజ్ కాగా భారీ హైప్ క్రియేట్ చేశాయి. అంతే రేంజ్‌లో డైలాగ్స్, లుక్స్‌పై ట్రోల్స్, మీమ్స్ కూడా సాగాయి. 'శివయ్యా..' అంటూ సాగే డైలాగ్ నుంచి ఇటీవల హార్డ్ డిస్క్ మిస్ అయిన ఘటనను కూడా కొందరు సోషల్ మీడియా వేదికగా మీమ్స్ ట్రోల్ చేశారు. వీటిపై పలు సందర్భాల్లో స్వయంగా మంచు విష్ణునే స్పందించారు. ఇక తమ మనోభావాలు దెబ్బతీశారంటూ మూవీని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చిన బ్రాహ్మణ సంఘాలకు కూడా టీం క్లారిటీ ఇచ్చింది.
ఫస్ట్ మూవీ చూడండి
మూవీ రివ్యూస్ రాసే వారు క్రిటిక్స్ అంతా కూడా ఫస్ట్ మూవీ చూసి పూర్తిగా అర్థం చేసుకుని ఆ తర్వాత స్పందించాలంటూ 'కన్నప్ప' టీం తెలిపింది. '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించిన 'కన్నప్ప' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటుల అపార కృషి, భారీ బడ్జెట్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో మూవీ రూపొందింది. అన్నీ రకాల చట్టపరమైన అనుమతులతో ఆడియన్స్ ముందుకు వస్తుంది. విమర్శకులందరూ ఫస్ట్ ఈ చిత్రాన్ని వీక్షించి.. అందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని ఎలాంటి పక్షపాతాలకు లొంగకుండా రివ్యూస్, తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాం.</p
Public Caution Notice 🚨
— 24 Frames Factory (@24FramesFactory) June 25, 2025
Our film #Kannappa releases globally on June 27, 2025 with full lawful clearances. Misuse, distortion, or defamatory acts against the film or its stakeholders will be legally challenged.#Kannappa27thJune #KannappaMovie #HarHarMahadevॐ@themohanbabu… pic.twitter.com/j2bvuXOe6Z
>
భారత రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛను మేము గౌరవిస్తున్నప్పటికీ.. 'కన్నప్ప'ను కించపరిచేలా వ్యవహరిస్తే మాత్రం అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు, మంచు విష్ణు ఇమేజ్‌కు, ప్రచార హక్కులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు వారికి రక్షణ కల్పిస్తుందనే విషయం గుర్తుంచుకోండి. వారి ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తే లీగల్‌గా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సివిల్, క్రిమినల్, సైబర్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.' అని టీం పేర్కొంది.
24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు 'కన్నప్ప' మూవీని నిర్మిస్తుండగా.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో శివ భక్తుడు తిన్నడిగా నటిస్తున్నారు. ఆయన సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ కాగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహాభారతం సీరియల్ ఫేం ముకేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.





















