News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Jailer Showcase : పులిలా విరుచుకుపడిన రజనీకాంత్ - మాస్, హీరోయిజంతో అదరగొట్టిన 'జైలర్' ట్రైలర్

Rajinikanth Jailer Trailer : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'జైలర్' ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. అది ఎలా ఉందో చూడండి.

FOLLOW US: 
Share:

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'జైలర్' (Jailer Movie). ఆయన టైటిల్ రోల్ చేశారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. నయనతార 'కో కో కోకిల', శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్', తమిళ స్టార్ హీరో విజయ్‌ 'బీస్ట్' సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. రజనీకి 169వ చిత్రమిది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. 

రజనీకాంత్ 'జైలర్' షో కేస్...
మాస్ & సూపర్ స్టార్ హీరోయిజం
Jailer Showcase Review : 'జైలర్' షోకేస్ చూస్తే... రజనీని మొదట భయస్తుడిగా చూపించారు. ఆ తర్వాత ఆయన పులిలా విరుచుకుపడ్డారు. కత్తులు, గన్నులు... ఒక్కటేమిటి? ఆయన విధ్వంసానికి అన్నీ ఉపయోగపడ్డాయి. 'ఒక దశ తర్వాత నేను మాట్లాడను. కొడతాను' అని చెప్పే డైలాగ్ హైలైట్. మాస్ అండ్ హీరోయిజం రెండిటినీ చాలా చక్కగా చూపించారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. రజని భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపించారు. అయితే... తమన్నా ట్రైలర్ లో కనిపించలేదు. 

Also Read  ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' - ఈసారి సంక్రాంతి మామూలుగా ఉండదు!

తమన్నా 'కావాలయ్యా...'
పాటకు రెస్పాన్స్ అదిరిందయ్యా!
'వా నువ్ కావాలయ్యా' పాట (Kaavaalaa Song)ను రెండు వారాల కృతం విడుదల చేశారు. శిల్పా రావుతో కలిసి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఆ పాటను ఆలపించారు. ఆ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో చాలా మంది తమన్నా వేసిన స్టెప్స్ వేసి రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. భాషలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది. సినిమాకు ఆ సాంగ్ సూపర్ బజ్ తీసుకు వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

Also Read  మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు

ఆగస్టు 10న థియేటర్లలోకి 'జైలర్'
Jailer Movie Release Date : ఆగస్టు 10న 'జైలర్' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 

'జైలర్' సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, హిందీ నటుడు జాకీ ష్రాఫ్,  కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్‌ కుమార్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా రమ్య కృష్ణ, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మారిముత్తు, రిత్విక్, శరవణన్, అరంతంగి నిషా, మహానంది శంకర్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్, కూర్పు : ఆర్. నిర్మల్, కళ : డాక్టర్ కిరణ్, యాక్షన్: స్టన్ శివ.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 02 Aug 2023 06:11 PM (IST) Tags: Tamannaah Bhatia Rajinikanth Nelson Dilipkumar Jailer Showcase Jailer Trailer Review Jailer Showcase Review

ఇవి కూడా చూడండి

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్

Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత