అన్వేషించండి

Padma Awards 2026 : ప్రతీ తెలుగు ఆడియన్‌కు దక్కిన గౌరవం - లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది... పద్మశ్రీపై తెలుగు నటుల రియాక్షన్

Rajendra Prasad : తనకు పద్మశ్రీ రావడం హాస్యాన్ని కోరుకునే ప్రతీ తెలుగు ఆడియన్‌కు దక్కిన గౌరవమని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తనకు అవార్డు ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

Rajendra Prasad Reaction On Padma Sri Award 2026 : తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్‌లను ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. ఆదివారం అవార్డులు ప్రకటించిన కేంద్రం... కళల విభాగంలో ఈ ఇద్దరు సీనియర్ నటులు చేసిన సేవలను గుర్తిస్తూ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ గౌరవంపై రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ స్పందించారు.

కామన్ ఆడియన్‌కు దక్కిన గౌరవం

కేంద్ర ప్రభుత్వం తనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం జీవితంలో మర్చిపోలేనిదని... ఇది తన పూర్వజన్మ సుకృతమని అన్నారు రాజేంద్ర ప్రసాద్. 'ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కిందని నేను అనుకోవడం లేదు. తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

అసలు నేను ఈ స్థాయిలో నిలబడటానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం మీరే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈ రోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది .​నాలాంటి ఒక  నటుడిని, మీ ఇంటి మనిషిలా ఆదరించి, 'నటకిరీటి'ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను.' అని అన్నారు.

Also Read : రిజల్ట్ ఏదైనా తప్పు నాపైనే వేసుకుంటా - కొరటాల శివకు చిరు కౌంటరిచ్చారా?

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా...

తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ హర్షం వ్యక్తం చేశారు. 'నాకు అవార్డు లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అని నా మిత్రులు, శ్రేయోభిలాషులకు చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఏపీ సీఎం చంద్రబాబు గారికి, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గారికి, చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్జతలు. అవార్డు అందుకున్న తర్వాత వివరంగా ప్రెస్‌ మీట్ పెట్టి చెబుతాను.' అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

4 దశాబ్దాలుగా...

గత 4 దశాబ్దాలుగా సినీ కళామ తల్లి సేవలో ఎన్నో చిత్రాలు చేశారు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్. 1977లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్... తొలుత తనదైన కామెడీ మూవీస్‌తో ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత స్పెషల్ పాత్రల్లోనూ మెరిశారు. తన కెరీర్‌లో 4 నందులు, 3 SIIMA అవార్డులు గెలుచుకున్నారు. ఏయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా పద్మశ్రీ వరించింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి...

మాగంటి మురళీ మోహన్‌ ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. 'జగమే మాయ' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం.

మురళీ మోహన్ కేవలం హీరోగానే కాకుండా సహాయ నటుడిగా, విలన్‌గా కూడా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచిన మురళీ మోహన్, తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సామాజిక సేవలు ఎందరికో మేలు చేకూర్చాయి. పద్మశ్రీ పురస్కారానికి ఆయన పేరు ఎప్పటి నుంచో పరిశీలనలో ఉన్నా... ఈ ఏడాది వరించింది.


About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget