అన్వేషించండి

Baahubali The Epic: బాహుబలి చూస్తుంటే నిద్రొచ్చిందన్న గ్రేట్ డైరెక్టర్... తలనొప్పి సినిమా అంటూ రివ్యూలు

Rajamouli: 'బాహుబలి: ది ఎపిక్' రిలీజ్ సందర్భంగా పదేళ్ల క్రితం బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన సమయంలో వచ్చిన రివ్యూలను రాజమౌళి మరోసారి గుర్తు చేసుకున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడారు.

Baahubalu The Epic Updates: బాహుబలి... తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా గర్వంగా నిలబెట్టిన సినిమా ఇది. రాత్రికి రాత్రి ప్రభాస్, రానా దగ్గుబాటి లాంటి వాళ్ళు పాన్ ఇండియా స్టార్లు అయిపోతే దర్శక ధీరుడు రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు. అయితే బాహుబలి 1, బాహుబలి 2 రిలీజ్ అయిన కొత్తల్లో సినిమా టీంకు చిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఈ విషయాలను స్వయంగా డైరెక్టర్ రాజమౌళి బాహుబలి నటులు ప్రభాస్, రానాలతో చెప్పుకొచ్చారు.

బాహుబలి 2 చూస్తూ నిద్రపోయానన్న గ్రేట్ డైరెక్టర్
'బాహుబలి 2' సినిమా  ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు తొలిసారి 1000 కోట్ల మార్క్ ను రుచి చూపించింది. విపరీతమైన అంచనాలతో 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 ఆ అంచనాలను అన్నిటిని దాటేసింది. టోటల్ గా ఇండియన్ సినిమా మేకింగ్ బాహుబలికి ముందు... తర్వాత అన్నట్టు మారిపోయింది. అయితే అంత గొప్ప సినిమాను చూస్తుంటే నిద్ర వచ్చేసింది అని ఒక గ్రేట్ అనడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఎవరో కాదు.. మన "రాజమౌళి"నే. విషయం ఏంటంటే... 'బాహుబలి 2'కి ముంబైలో బాలీవుడ్ స్టార్స్ కోసం పెద్ద ఎత్తున ప్రీమియర్లు ఏర్పాటు చేశారు. అయితే సరిగ్గా అదే సమయంలో సమయంలో బాలీవుడ్ పాత తరం స్టార్ వినోద్ ఖన్నా మరణించారు. దానితో ఆ ప్రీమియర్స్ అన్ని క్యాన్సిల్ చేసింది బాహుబలి టీమ్. కానీ ఆల్రెడీ బుక్ అయి ఉన్న థియేటర్లలో ఐదారు గురు చొప్పున ఒక్కొక్క థియేటర్లకి వెళ్లి చూసారు బాహుబలి నిర్మాణంలో పాల్గొన్న నిర్మాతలు, రాజమౌళి కుటుంబం. అయితే అప్పటిదాకా పూర్తిగా అలిసిపోయి ఉండడం, ప్రీమియర్స్ క్యాన్సిల్ కావడం, థియేటర్లలో జనం లేకుండా షో చూడడంతో  డైరెక్టర్ రాజమౌళికి నిద్ర వచ్చేసింది అట. అయితే సినిమా నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ కు మాత్రం  మూవీ విపరీతంగా నచ్చడంతో  ఆయన ఆనందంతో కేరింతలు కొట్టారట. రాజమౌళి భార్య రమకు కూడా కొన్ని సీన్లలో ఎమోషన్ సరిగ్గా పండలేదు అనిపించి థియేటర్లోనే రాజమౌళికి చెప్పారట. షో పూర్తి అయిన తర్వాత  కరణ్ జోహార్ ఇంటికి వెళ్లిన రాజమౌళి కుటుంబానికి  మరోచోట షో చూసిన  కరణ్ జోహార్, అలియా భట్, రణబీర్ కపూర్ లాంటివాళ్ళు "సినిమా అదిరిపోయింది చాలా గొప్ప సినిమా తీశారు" అంటూ పొగడడంతో అప్పటికి నమ్మకం కుదరని రాజమౌళి ఈ బాలీవుడ్ లో అంతా ఇంతేనా" అనుకుంటూ హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. అప్పటికే హైదరాబాద్లో షోలు పడడంతో తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 మేనియా  విపరీతంగా కమ్మేసుకుంది. అది చూసి అప్పటికి నమ్మకం కుదిరిందట  రాజమౌళికి. ఏదైనా అంత గొప్ప సినిమా తీసిన రాజమౌళి  తన సినిమా ప్రీమియర్ షో చూసి తనకే నిద్ర వచ్చేసింది అనడం బాహుబలి అభిమానులకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

Also Read'డీయస్ ఈరే' రివ్యూ: ప్రణవ్ మోహన్ లాల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్... భూతకాలం, భ్రమయుగం దర్శకుడి సినిమా... ఎలా ఉందంటే?

బాహుబలి 1 తలనొప్పి సినిమా...
తెలుగు రివ్యూలు  బాధ పడిన కీరవాణి భార్య

అంతకు ముందు బాహుబలి 1- ది బిగినింగ్  రిలీజ్ అయినప్పుడు కూడా ఒక విధమైన చేదు అనుభవం ఎదురయింది అన్నారు రాజమౌళి. సినిమాలో ఎండింగ్ లేకపోవడం కట్టప్ప బాహుబలిని పొడిచేయడంతో ఎండ్ అయిపోవడంతో అది తెలుగు ప్రేక్షకులు, సినీ జర్నలిస్టులకి జీర్ణించుకోవడం కష్టమైంది. అప్పటివరకు అలాంటి ముగింపు వారు చూడకపోవడమే దీనికి కారణం. అప్పుడు సినీ పీఆర్వోలు,జర్నలిస్టులు అంతా కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ మెయిన్టైన్ చేస్తున్నారు. అందులో  కీరవాణి గారి భార్య శ్రీ వల్లి నెంబర్ కూడా ఎలానో యాడ్ అయిపోయింది. ఈ విషయం ఆ గ్రూపులో ఉన్న వారికి తెలియక బాహుబలి 1 షో అవగానే 'శివుడు (ప్రభాస్) శివలింగాన్ని మోసుకుంటూ వచ్చే ఇమేజ్లో  శివలింగం బదులు జండూబామ్ సీసా పెట్టి  ఇది ఒక తలనొప్పి సినిమా' అంటూ రివ్యూలు ఇచ్చారట. అలాగే 'తీశార్లే పెద్ద గొప్ప సినిమా, ప్రొడ్యూసర్ బలి' అంటూ ట్రోల్ చేయడంతో బాధపడిన శ్రీవల్లి ఆ విషయాన్ని రాజమౌళి కి గానీ ఇతర టీమ్ కి గాని చెప్పకుండా దాచేసారట. అయితే బయట కూడా తెలుగులో టాక్  ఫస్ట్ డే సరిగ్గా రాకపోవడంతో అటు ప్రభాస్, ఇటు రాజమౌళి కూడా నిరాశలో ఉండిపోయారు. అయితే సినిమాని బాలీవుడ్ లో చూసిన  రాణా మాత్రం బాహుబలి 1 సూపర్ హిట్ అంటూ  ఫోన్లో చెబుతున్నా ఆ రాత్రి వరకూ రాజమౌళికి నమ్మకం కుదరలేదు. కానీ ఆ రాత్రి సెకండ్ షోకే టాక్  మొత్తం మారిపోయి తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఆ తరువాత మిగిలింది అంతా చరిత్రే. బాహుబలి, బళ్లాల దేవ, బిజ్జల దేవ, శివగామి, కట్టప్ప, దేవసేన లాంటి పాత్రలు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో  ఇంకానిక్ గా మారిపోయాయి. బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు అయిన సందర్భంగా  రెండు భాగాలను కలిపి కొంత ఎడిట్ చేసి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో రీ రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ సందర్భంగా ఆనాటి  అద్భుతమైన అనుభవాలను పంచుకుంటూనే  ఇలాంటి ఒకటి రెండు బ్యాడ్ మెమోరీస్ ని కూడా  రాజమౌళి, ప్రభాస్, రానాలు గుర్తు చేసుకున్నారు.

Also Read'బాహుబలి ది ఎపిక్' రివ్యూ: రెండు కాదు... ఒక్క సినిమాగా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిందంటే?

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget