అన్వేషించండి

Baahubali The Epic Review Telugu - 'బాహుబలి ది ఎపిక్' రివ్యూ: రెండు కాదు... ఒక్క సినిమాగా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిందంటే?

Baahubali The Epic Review In Telugu: 'బాహుబలి' రెండు భాగాలను 'బాహుబలి ది ఎపిక్' పేరుతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందంటే?

భారతీయ బాక్సాఫీస్ చరిత్రను 'బాహుబలి'కి ముందు, 'బాహుబలి 2' తర్వాత అని మార్చిన ఘనత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సొంతం. ఇప్పుడు ఆ రెండు సినిమాలనూ 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ప్రేక్షకులకు ముందుకు తీసుకు వచ్చారు. అక్టోబర్ 30న పెయిడ్ ప్రీమియర్ షోలతో సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రెండు భాగాలను ఒక్కటిగా చూడటం ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది?

కథ (Baahubali The Epic Story): ప్రేక్షకులు అందరికీ తెలిసిన కథే... మాహిష్మతి మహారాజు కావాలని కలలు కన్న భల్లాలదేవుడు (రానా దగ్గుబాటి) కుట్రలు, కుతంత్రాలు చేసి... అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)ని చంపమని మాహిష్మతి కట్టుబానిస కట్టప్ప (సత్యరాజ్)ని కన్నతల్లి, రాజమాత శివగామి (రమ్యకృష్ణ) ఆదేశించేలా చేస్తాడు.

బాహుబలి మరణం తర్వాత కొడుకు చేసిన కుట్రలు శివగామికి తెలుస్తాయి. తల్లిని చంపడానికి సైతం భల్లాలదేవ వెనుకాడడు. అయితే ఆమె తప్పించుకుంటుంది. దేవసేన (అనుష్క శెట్టి)ని బందీగా చేస్తాడు భల్లాలదేవ. తన కుమారుడు మహేంద్ర బాహుబలి (ప్రభాస్) వచ్చి తల్లిని ఎలా విడిపించాడు? తండ్రి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? చివరకు భల్లాలదేవను ఎలా చంపాడు? అనేది సినిమా. 

విశ్లేషణ (Baahubali The Epic Review Telugu): 'బాహుబలి'... జీవితం ఒక్కసారి జరిగే అద్భుతం. అది అందులో జరిగిన నటీనటులు కావచ్చు, వెండితెరపై చూసే ప్రేక్షకులకు కావచ్చు. అయితే ఆ అద్భుతాన్ని రెండు భాగాలుగా విడుదల చేసి డబుల్ హై ఇచ్చారు రాజమౌళి. బాక్సాఫీస్ దగ్గర రెండో సినిమాను మిగతా సినిమాలకు అందనంత ఎత్తులో కూర్చోబెట్టారు. అటువంటి రెండు భాగాలను కలిపి ఒక్కటిగా చేసి విడుదల చేస్తున్నారంటే... ఏయే సన్నివేశాలకు కత్తెర వేస్తారో? ఏయే సన్నివేశాలను మళ్ళీ చూపిస్తారో? అని ఆసక్తి. ఆ సినిమా నిడివి 3.45 గంటలు అనేసరికి అంతసేపు థియేటర్లలో కూర్చోబెట్టగలరా? అని మరొక సందేహం.

'బాహుబలి: ది ఎపిక్' అభిమానులకు కన్నుల పండుగ. అటు ప్రభాస్ - రానా - అనుష్క - రమ్యకృష్ణ అభిమానులు కావచ్చు... ఇటు రాజమౌళి ఫ్యాన్స్ అవ్వచ్చు... మళ్ళీ వెండితెరపై ఆ అద్భుతాన్ని చూడటం రోమాంచితంగా ఉంటుంది. అయితే సామాన్య ప్రేక్షకుల నుంచి నిడివి విషయంలో విమర్శ వినబడుతుంది. ఫస్టాఫ్ రెండు గంటలు ఉంది. అందులో తమన్నా ప్రేమకథకు - పచ్చబొట్టు పాటకు కత్తెర వేశారు. అక్కడ ఏం జరిగిందో రాజమౌళి తన గొంతులో క్లుప్తంగా చెప్పారు. మరొక సందర్భంలో రవిశంకర్ గొంతులో బాహు, బల్లా కథను తేల్చేశారు. అక్కడ కత్తెర వేసిన విధానం బావుంది. బాహుబలి చూసిన ప్రేక్షకులకు కథ తెలుసు గనుక 'ఓహో... ఈ సీన్ తీసేశారు. ఇలా ముందుకు దూకారు' అని సరిపెట్టుకుంటారు. కొత్త చూసే వాళ్లకు, సామాన్య ప్రేక్షకులకు ఫస్టాఫ్ నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ మాత్రం చకచకా సాగింది. రెండో భాగాన్ని థియేటర్లలో చూసినప్పుడు ఎటువంటి గూస్ బంప్స్ అయితే కలిగాయో... మళ్ళీ ఇప్పుడు సేమ్ గూస్ బంప్స్ 'బాహుబలి: ది ఎపిక్' ఇవ్వడం గ్యారెంటీ.

Also Read: బైసన్ రివ్యూ: కబడ్డీ, కుల వివక్ష నేపథ్యంలో విక్రమ్ కుమారుడి సినిమా - హిట్టా? ఫట్టా?

'బాహుబలి' రెండు భాగాలకు అయినా... 'బాహుబలి: ది ఎపిక్'కు అయినా ప్రాణం పోసింది ఎంఎం కీరవాణి అని మరోసారి బల్లగుద్ది మరీ చెప్పాలి. హీరోయిజం ఫీల్ అయ్యేలా చేసింది ఆయన పాటలు, నేపథ్య సంగీతం. ఇప్పటికే వందలసార్లు చూసిన 'ఆడదాన్ని మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల' అని చెప్పే సన్నివేశం మరోసారి సేమ్ హై ఇస్తుంది. కట్టప్ప సాయంతో మాహిష్మతి వ్యతిరేకులను కట్టప్ప మట్టుబెట్టే సన్నివేశానికి క్లుప్తంగా చెప్పడం బాలేదు. కొన్న సీన్స్‌, డైలాగ్స్‌ను క్లుప్తంగా చెప్పడం ఆయా సన్నివేశాల అభిమానులను డిజప్పాయింట్ చేస్తుంది. టెక్నికల్ పరంగా 'బాహుబలి: ది ఎపిక్'లో రాజమౌళి అండ్ టీమ్ చేసిన కృషి కనబడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మాహిష్మతిని కాస్త కొత్తగా చూపించారు. కొన్ని షాట్స్ యాడ్ చేశారు. అలాగే కొన్ని సన్నివేశాల్లో కూడా!

'బాహుబలి: ది ఎపిక్' గురించి చెప్పాలంటే... ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు - 300 రూపాయలకు 3.45 గంటల రీ రిలీజ్ ఎక్స్‌పీరియన్స్‌. నిజమే... నిడివి కాస్త ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. అయితే... అది ఫస్టాఫ్ వరకే! సెకండాఫ్ మొదలు అయ్యాక చూపు తిప్పుకోనివ్వలేదు రాజమౌళి. ఇందులో కొత్త కథ లేదు. రాజమౌళి కొత్తగా స్క్కీన్ ప్లేతో మేజిక్ చేసింది లేదు. కానీ ఎమోషనల్ అండ్ యాక్షన్ హై ఇస్తుంది. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్... బాహుబలిగా ప్రభాస్ హీరోయిజం, అనుష్కగా దేవసేన అద్భుతమైన అభినయం - అందం, రానా విలనిజం, ముఖ్యంగా కీరవాణి సంగీతం ఎక్స్‌పీరియన్స్‌ చేయడం కోసం ఎటువంటి ఆలోచలను పెట్టుకోకుండా వెళ్లొచ్చు. 

Also Read'డ్యూడ్' రివ్యూ: ప్రదీప్ రంగనాథన్‌ హ్యాట్రిక్ కొడతాడా? 'ప్రేమలు' బ్యూటీతో చేసిన రొమాంటిక్ కామెడీ ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Kumbh Mela Mona Lisa: మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ -   తెలుగు సినిమాల్లో ఎంట్రీ
మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ - తెలుగు సినిమాల్లో ఎంట్రీ
Balakrishna: ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
అబ్బాయిలకో న్యాయం?  అమ్మాయిలకో న్యాయమా?
3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Kumbh Mela Mona Lisa: మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ -   తెలుగు సినిమాల్లో ఎంట్రీ
మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ - తెలుగు సినిమాల్లో ఎంట్రీ
Balakrishna: ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
Trump defeat: పది నెలల్లోనే ట్రంప్‌ను తిరస్కరించిన అమెరికా -  స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్ల భారీ విజయం
పది నెలల్లోనే ట్రంప్‌ను తిరస్కరించిన అమెరికా - స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్ల భారీ విజయం
Chikiri Chikiri Song: చికిరి చికిరి... ట్రెండింగ్‌లో రామ్ చరణ్ హుక్ స్టెప్... చిరు, పవన్ కూడా సేమ్ స్టెప్పేస్తే?
చికిరి చికిరి... ట్రెండింగ్‌లో రామ్ చరణ్ హుక్ స్టెప్... చిరు, పవన్ కూడా సేమ్ స్టెప్పేస్తే?
IRCTC Tour Package: దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Embed widget