Raj Tarun: హీరోయిన్‌తో రాజ్ తరుణ్ ప్రియురాలు వాగ్వాదం - ఆడియో రికార్డింగ్ లీక్, ఎవరీ మాల్వీ మల్హోత్రా?
Raj Tarun: రాజ్ తరుణ్.. తనతో సహ జీవనం చేసి మోసం చేసి వదిలేశాడంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. మధ్యలో మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ పేరును ఉపయోగించడంతో అసలు తను ఎవరు అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు
Raj Tarun News: ఇటీవల యంగ్ హీరో రాజ్ తరుణ్.. తనను మోసం చేశాడంటూ ఒక అమ్మాయి పోలీసులను ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. లావణ్య అనే యువతి.. హీరో రాజ్ తరుణ్‌తో తాను 11 ఏళ్ల నుంచి కలిసుంటున్నానని, ఇప్పుడు ఓ హీరోయిన్ కోసం తనను వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సంచలనంగా మారింది. లావణ్య చేసిన ఆరోపణలు రాజ్ తరుణ్ ఖండించాడు. కానీ లావణ్య మాత్రం తాను చెప్తుంది నిజం అని నిరూపించడం కోసం హీరోయిన్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణను లీక్ చేసింది. అవతల మాట్లాడుతున్న హీరోయిన్.. మాల్వీ మల్హోత్రా అని ఆమె పేర్కొంది. అయితే, అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.
నమ్మించి మోసం..
తను రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నారని, 11 ఏళ్లగా ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నామని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ తనను గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడని షాకింగ్ ఆరోపణలు చేసింది లావణ్య. అంతా బాగానే ఉన్నా గత కొన్నిరోజులుగా తన కో స్టార్‌తో సంబంధం పెట్టుకొని, ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలతో రాజ్ తరుణ్‌పై కేసు పెట్టడానికి పోలీసులను ఆశ్రయించింది లావణ్య. రాజ్ తరుణ్.. తనను వెంటపడొద్దని, చంపి శవం మాయం చేస్తానని బెదిరిస్తున్నాడంటూ షాకింగ్ ఆరోపణలు చేసింది. ఆపై రాజ్ తరుణ్ కోస్టార్‌తో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణను బయటపెట్టింది లావణ్య.
కాళ్లు పట్టుకుంటాను..
‘‘నీతో రిలేషన్ మొదలుపెట్టిన తర్వాత రాజ్ తరుణ్ నన్ను దూరం పెడుతున్నాడు’’ అని ఫోన్‌లో చెప్పుకొచ్చింది లావణ్య. ‘‘నువ్వు చెప్పినట్టే అతడు వింటున్నాడు. కావాలంటే రాజ్ తరుణ్‌ను వదిలేయడం కోసం నీ కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధమే’’ అని ఫోన్లో తెలిపింది. అయినా ఆమె వినకపోవడంతో నీలాంటి అమ్మాయిలు కెరీర్‌లో ఎదగలేరు అంటూ వాదనకు దిగింది. ఈ ఆడియో సంభాషణను లావణ్య స్వయంగా బయటపెట్టింది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి ‘తిరగబడరాసామీ’ అనే మూవీలో నటించారు. ఏవీఎస్ రవికుమార్ చౌదరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
బుల్లితెర నటిగా ఎంట్రీ..
లావణ్య కేసు తర్వాత మాల్వీ మల్హోత్రా పేరు మారుమోగిపోతోంది. అసలు ఈ అమ్మాయి ఎవరు అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. 2017లో హిందీ బుల్లితెరపై ప్రచారమయిన ‘ఉడాన్’ అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్‌లో ప్రారంభించింది మాల్వీ. ఆ తర్వాత ‘హోటల్ మిలాన్’ అనే మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది. మలయాళంలో విడుదలయిన ‘అభ్యూహం’లో కూడా హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ‘తిరగబడరసామీ’తో తెలుగులో డెబ్యూ చేయనుంది. అయితే రాజ్ తరుణ్‌తో అఫైర్ అంటూ ఇంత పెద్ద కాంట్రవర్సీ జరుగుతున్నా దీనిపై స్పందించడానికి మాల్వీ మల్హోత్రా ముందుకు రాలేదు. రాజ్ తరుణ్ మాత్రం.. మాల్వీతో అఫైర్ అనే వార్తలను ఖండిస్తున్నాడు.
Also Read: లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు