అన్వేషించండి

Raj Tarun Comments: లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు

Raj Tarun Comments on Girlfriend: ప్రియురాలు ఆరోపణలపై హీరో రాజ్‌ తరుణ్‌ స్పందించాడు. ఆమెతో రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనన్నాడు. కానీ లావణ్య చెప్పవన్ని అబద్ధాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Raj Tarun React on Girlfriend Allegations: రాజ్‌ తరుణ్‌ తనని మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనని రాజ్‌ తరుణ్‌ మోసం చేశాడంటూ ఆమె నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. దీంతో ప్రియురాలు ఆరోపణలపై తాజాగా రాజ్‌ తరుణ్‌ స్పందించాడు. తాజాగా మీడియాలో ముందుకు వచ్చిన రాజ్‌ తరుణ్‌.. లావణ్య చెబుతున్నవన్ని అబద్ధాలు అని చెప్పాడు. "లావణ్యతో తాను రిలేషన్‌లో ఉన్నమాట నిజమే. 2014 నుంచి మేం రిలేషన్‌లో ఉన్నాం. ఇద్దరం ఒకటే రూంలోనే ఉన్నాం. కానీ నేనేప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. ఆమెతో నాకు ఎలాంటి శారీరక సంబంధం లేదు.

లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది. అతడి పేరు మస్తాన్‌ సాయి. అతడితో రిలేషన్ కోసం ఆమె నన్ను టార్చర్‌ పెట్టింది. ఆ వేధింపులు తట్టుకోలేక రూం నుంచి బయటకు వచ్చాను. ఆమెను అక్కడే ఉండమన్నాను. కానీ, నేను బయటకు రావడంతో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ మస్తాన్‌తో కలిసి ఉంది. అందువల్లే మా మధ్య బంధం చెడింది. కానీ నాకు లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎప్పుడు లేదు. ఆమె మా కుటుంబ సభ్యులకు కూడా పరిచయమే. కానీ తనకున్న ఉన్న డ్రగ్స్‌ అలవాటు, మరో వ్యక్తి ఎఫైర్ వల్ల నేను ఆమెకు దూరంగా ఉన్నాను. అందుకే ఇప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. ఆమె చెప్పేవన్ని అబద్ధాలు. ఈ కేసులో తనకు కొంచం సపోర్టు చేయండి. ఈ విషయమై నేను లీగల్‌గా ముందుకు వెళతాను" అంటూ రాజ్‌ తరుణ్‌ చెప్పాడు. 

అలాగే "లావణ్య గతంలో మస్తాన్‌ తనని పెళ్లి చేసుకోవాలంటూ గుంటూరు పోలీసులు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు కూడా చేసింది. ఆ కేసుకు సంబంధించి ఎఫైర్‌ కాపీ కూడా నా దగ్గరు ఉంది. మస్తాన్‌తో లావణ్యకు శారీరక సంబంధం కూడా ఉంది. అందుకే నేను ఆమెకు దూరంగా ఉంటున్నా. దాంతో లావణ్య నాపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఆమెను నమ్మకండి. దయచేసి ఈ విషయంలో నాకు సపోర్టు చేయండి. నా లీగల్‌ లాయర్‌ ద్వారానే నేను లావణ్యను అప్రోచ్ అవుతాను. అప్పటి వరకు ఆమెకు నేను ఎలాంటి సమాధానం ఇవ్వదలుచుకోలేదు" అంటూ రాజ్‌ తరుణ్‌ వివరణ ఇచ్చాడు. 

కాగా రాజ్‌ తరుణ్‌ హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్‌ పెట్టుకుని తనని మోసం చేశాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు రాజ్‌ తరుణ్‌, అతడి కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసులు రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహరం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఇక అతడి సినిమాల విషయానికి వస్తే చివరిగా నా సామిరంగ్‌ చిత్రంలో నటించిన రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం ‘తిరగబడరసామీ’ అనే మూవీ చేస్తున్నాడు. ఏఎస్‌ రవికుమార దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Also Read: రాజ్‌ తరుణ్‌కి అమ్మాయిల పిచ్చి - అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే, ప్రియురాలు డిమాండ్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
IPL 2025 RR vs RCB: జైస్వాల్ హాఫ్ సెంచరీ, రాణించిన జురెల్- ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్
జైస్వాల్ హాఫ్ సెంచరీ, రాణించిన జురెల్- ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
SS Rajamouli: ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Travis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
IPL 2025 RR vs RCB: జైస్వాల్ హాఫ్ సెంచరీ, రాణించిన జురెల్- ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్
జైస్వాల్ హాఫ్ సెంచరీ, రాణించిన జురెల్- ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
SS Rajamouli: ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
Bhu Bharati Act: భూభార‌తి చట్టం, పోర్ట‌ల్ 14న‌ జాతికి అంకితం, ధ‌ర‌ణి భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
Bhu Bharati Act: భూభార‌తి చట్టం, పోర్ట‌ల్ 14న‌ జాతికి అంకితం, ధ‌ర‌ణి భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
Anakapalli News: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ఎనిమిది మంది మృతి- అనకాపల్లి జిల్లాలో ఘటన
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ఎనిమిది మంది మృతి- అనకాపల్లి జిల్లాలో ఘటన
Manchu Lakshmi: మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పండి- మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పండి- మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Embed widget