అన్వేషించండి

Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్

Supriya Yarlagadda : డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ సుప్రియను సితార అధినేత నాగవంశీ ఫన్ ర్యాగింగ్ చేశారు. ప్రొడ్యూసర్స్ కష్టాలు బాగా తెలిశాయంటూ సరదాగా ఆట పట్టించారు.

Naga Vamsi Fun Teases Producer Supriya Yarlagadda : యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ డెకాయిట్ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మూవీ టీంతో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

స్టేజ్‌పై ఏకంగా ఆరుగురు స్టార్ ప్రొడ్యూసర్స్ సందడి చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి, స్వప్న దత్, అభిషేక్ అగర్వాల్ వంటి దిగ్గజాలు డెకాయిట్ ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డను సరదాగా ఆటపట్టించారు.

'మాకు క్లాస్ పీకేవారు'

సినిమా ఎక్కువ రోజులు తీస్తున్నామని సుప్రియ ఎప్పుడూ తమకు క్లాస్ పీకేవారని... ఇప్పుడు రెండేళ్లు కష్టపడి డెకాయిట్ కంప్లీట్ చేశారని సరదాగా కామెంట్ చేశారు నిర్మాత నాగవంశీ. 'సినిమాలు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రోజులు తీస్తున్నారని సుప్రియ అనేవారు. ఇప్పుడు ఆమె రెండేళ్లు సినిమా తీసి ఎన్ని కష్టాలు పడ్డారో చూద్దామని అందరం వచ్చాం. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్‌లా ఆమెను కామెంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. డెకాయిట్ మూవీ కోసం 147 డేస్ వర్క్ చేశారు.

ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు లేదని ఆమెను ఆట పట్టించడానికే వచ్చాం. ప్రొడ్యూసర్ కష్టాలేంటో శేష్ గారు చూపించినందుకు నేను థాంక్స్ చెబుతున్నా. హీరోల్ని నెత్తిన ఎక్కించుకుంటున్నారని మాకు క్లాస్ పీకేవారు. మీరు రెండేళ్లు ఆవిడను హింస పెట్టి ప్రొడ్యూసర్ కష్టాలేంటో చూపించారు. ఫస్ట్ టైం బయట హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇంతకు ముందు కేవలం తన ఫ్యామిలీ హీరోలతోనే మూవీస్ తీసిన సుప్రియకు ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. డెకాయిట్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. మరింత మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి మాలాగే సుప్రియ కష్టపడాలి.' అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌కు నిర్మాత సురేష్ బాబు పగలబడి నవ్వారు.

Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్‌కు బ్రేక్! - ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా...

ప్రొడ్యూసర్ కష్టాలు ప్రాక్టికల్‌గా అర్థం చేసుకున్నందుకు చాలా థాంక్స్ అంటూ మైత్రీ రవి అన్నారు. 'ఓ క్వాలిటీ సినిమా కోసం అడివి శేష్ ఎక్కడా కాంప్రమైజ్ కారు అనేది జగమెరిగిన సత్యం. ఈ మూవీలో మృణాల్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి క్వాలిటీ సినిమా తీయాలంటే కచ్చితంగా అన్ని రోజులు టైం పడుతుంది. మా ప్రొడ్యూసర్స్ మీటింగ్స్‌లో అన్ని రోజులు ఎందుకు అనే వారు. ఇప్పుడు మా బాధలు  మీకు అర్థమయ్యాయి. మీరు కూడా మా జానర్‌లోకి వచ్చేశారు. ఇక్కడితో ఆగకుండా మరిన్ని సక్సెస్‌లు సాధించాలి.' అని చెప్పారు.

సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహించగా... అడివి శేష్, మృణాల్‌లతో పాటు ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల, సునీల్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Crime Thriller Movies OTT : ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget