అన్వేషించండి

Prithviraj Sukumaran: ‘సలార్’ కోసం ఫస్ట్ టైమ్ అలా - పృథ్విరాజ్ సుకుమారన్ నిర్ణయానికి సలాం కొట్టాల్సిందే

Salaar Movie: ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘సలార్’ విడుదలకు సిద్ధమవుతుండగా.. అందులో కీలక పాత్ర పోషించిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఒక ఫ్రెష్ అప్డేట్‌ను విడుదల చేశారు.

పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ సినిమాల్లో స్పీడ్ తగ్గింది. కనీసం ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం కూడా కష్టంగా మారింది. కానీ ఈ ఏడాది మాత్రం ఎలాగైనా మూడు సినిమాలు విడుదల చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. చివరికి ముందుగా అనుకున్నట్టుగా మూడు సినిమాలు సమయానికి సిద్ధం అవ్వలేదు. అందుకే రెండు చిత్రాలతోనే ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ‘ఆదిపురుష్’తో వచ్చి ఫ్లాప్ అందుకున్న ప్రభాస్.. ‘సలార్’తో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా.. ఇందులో కీలక పాత్ర చేసిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఫ్యాన్స్‌కు ఒక ఫ్రెష్ అప్డేట్ అందించాడు.

పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీ..
డిసెంబర్ 22న ‘సలార్ పార్ట్ 1’ విడుదలకు సిద్ధమవుతోంది. కానీ విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా మూవీ టీమ్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడం లేదు. ట్రైలర్‌ను విడుదల చేసినా కూడా ఆ ట్రైలర్ గురించి మాట్లాడడానికి మాత్రం మేకర్స్ ఎవరూ ముందుకు రాలేదు. దానికి కారణం ‘సలార్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరగడమే అని ప్రేక్షకుల సందేహం. ఇప్పటికీ ‘సలార్’కు సంబంధించిన చాలా పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని సమాచారం. అందుకే డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కావాలంటే మూవీ టీమ్ అంతా విరామం లేకుండా పనిచేయాల్సిందే. ఇంతలోనే ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనుల గురించి పృథ్విరాజ్ సుకుమార్ ఒక అప్డేట్ ఇచ్చారు.

పృథ్విరాజ్ సుకుమారన్ అప్డేట్..
‘సలార్’కు తాను డబ్బింగ్ చెప్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు పృథ్విరాజ్. ‘సలార్ ఫైనల్ డబ్బింగ్ కరెక్షన్ పూర్తయ్యాయి. నేను ఎన్నో ఏళ్లుగా వేర్వేరు భాషల్లో నటించిన వేర్వేరు పాత్రలకు డబ్బింగ్ చెప్పే అదృష్టం నాకు దక్కింది. కొన్ని పాత్రలకు వేర్వేరు భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పుకున్నాను. కానీ ఒకే పాత్రకు, ఒకే సినిమాకు అయిదు భాషల్లో డబ్బింగ్ చెప్పడం నాకు ఇదే మొదటిసారి. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం. ఇలాంటి సినిమాకు ఇలా చేయాల్సిందే. 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో దేవ, వరధ మిమ్మల్ని కలుస్తారు’ అంటూ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం డబ్బింగ్ పనులు నడుస్తున్నాయని అర్థమవుతోంది.

ఫ్యాన్స్ ఎదురుచూపులు..
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ప్రభాస్ సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవుతుండడంతో ‘సలార్’లాంటి కమర్షియల్ సినిమా మాత్రమే తనను మళ్లీ ఫామ్‌లోకి తీసుకొస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే మూవీ నుండి విడుదలయిన టీజర్, ట్రైలర్ చూస్తుంటే.. ఇది ప్రభాస్ లాంటి కటౌట్‌కు సరిపోయే సినిమా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటించింది. వీరితో పాటు జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు, బాబీ సింహ.. ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ‘సలార్’ ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Also Read: ప్రభాస్ 'స్పిరిట్'లో ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రి? ఇదిగో క్యారిటీ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget