Prince Movie Release Date: 'ప్రిన్స్'గా థియేటర్లలోకి శివ కార్తికేయన్ రాక ఎప్పుడంటే?
Sivakarthikeyan's Prince Movie Release Date: శివ కార్తికేయన్ కథానాయకుడిగా 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది.
తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. 'సీమ రాజా', 'రెమో', 'డాక్టర్', 'డాన్' సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే... ఇప్పుడు 'జాతి రత్నాలు' ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో తెలుగు - తమిళ బైలింగ్వల్ సినిమా 'ప్రిన్స్' చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడు విడుదల విషయం వెల్లడించారు.
Prince For Diwali: 'ప్రిన్స్' సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు నేడు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. విడుదల విషయాన్ని వెరైటీగా అనౌన్స్ చేశారు.
''ఆఫ్గనిస్తాన్, కజికిస్థాన్, ఉజ్బేకిస్థాన్, అంటార్కిటికాలో విడుదల చేయాలనుకున్నా... ఆఫ్గనిస్తాన్‌లో థియేటర్లు లేవు... కజికిస్థాన్‌లో డిస్ట్రిబ్యూటర్లు లేరు... ఉజ్బేకిస్థాన్‌లో మార్కెట్ లేదు. అందుకని, తెలుగు - తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం'' అంటూ శివ కార్తికేయన్, కేవీ అనుదీప్, సత్యరాజ్, హీరోయిన్ మరియా ఒక వీడియో విడుదల చేశారు.
Also Read: శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామి. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.
Also Read : స్విస్, ఫ్రాన్స్ to గ్రీస్ - ప్రగ్యా జైస్వాల్ టూర్ ఫొటోస్, వీడియోస్ చూశారా?
View this post on Instagram