Premalu Movie: మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ ‘ప్రేమలు’కు భలే క్రేజ్ - రైట్స్ కోసం తెలుగు నిర్మాతల మధ్య పోటీ, డబ్బింగా? రీమేకా?
Premalu Movie: మలయాళ సినిమాలకు మూవీ లవర్స్‌లో ఉన్న క్రేజే వేరు. భాష రాకపోయినా సబ్ టైటిల్స్‌తో మ్యానేజ్ చేస్తూ ఏ మలయాళ చిత్రాన్ని అయినా చూసేస్తారు. అలాగే ‘ప్రేమలు’ను కూడా చూసి బ్లాక్‌బస్టర్ చేశారు.
Premalu Movie: ఒక సినిమా హిట్ అవ్వాలంటే భాషతో సంబంధం లేదని ఇప్పటికే ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లలో మలయాళ సినిమాలకు విపరీతమైన మార్కెట్ పెరిగింది. ఓటీటీలో విడుదలయిన చాలావరకు మలయాళ చిత్రాలను సబ్ టైటిల్స్‌తోనే ఒరిజినల్ భాషలోనే చూడడానికి ఇష్టపడుతున్నారు మూవీ లవర్స్. అందుకే ఒక మలయాళం సినిమా తెలుగులో డబ్ కూడా అవ్వకుండా నేరుగా మలయాళంలోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యి సూపర్ డూపర్ టాక్‌ను అందుకుంటోంది. అదే ‘ప్రేమలు’. ప్రస్తుతం ఈ మలయాళ సినిమా తెలుగు నిర్మాతలను సందేహంలో పడేస్తోంది.
హైదరాబాద్‌లో షూటింగ్..
‘తన్నీర్ మథన్ దినంగల్’, ‘సూపర్ శరణ్య’లాంటి యూత్‌ఫుల్ సినిమాలతో మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దర్శకుడు గిరీష్ ఏడీ. ఇప్పుడు ‘ప్రేమలు’లాంటి మరో యూత్‌ఫుల్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరిగింది. ఛార్మినార్, ట్యాంక్ బండ్ లాంటి లొకేషన్స్ అన్నీ ‘ప్రేమలు’లో ఉన్నాయి. దీంతో హైదరాబాద్ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు అనే ఉద్దేశ్యంతో డబ్ చేయకుండా నేరుగా మలయాళంలోనే సబ్ టైటిల్స్‌తో ఈ సినిమాను విడుదల చేశారు మేకర్స్. అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి ‘ప్రేమలు’కు పాజిటీవ్ టాక్ లభిస్తోంది. కానీ మలయాళ చిత్రాలు చూడడం అలవాటు లేనివారు మాత్రం ఈ మూవీని తెలుగులో చూడడానికి ఆశపడుతున్నారు.
చర్చలు మొదలు..
ప్రస్తుతం ‘ప్రేమలు’ కోసం తెలుగు నిర్మాతలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే ‘ప్రేమలు’ నిర్మాతలు ఫాహద్ ఫాజిల్, దిలీష్ పోటేన్, శ్యామ్ పుష్కరన్‌తో మన తెలుగు నిర్మాతలు చర్చలు మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా హక్కుల కోసం క్యూ కడుతున్న ప్రొడ్యూసర్స్‌కు కొత్త డౌట్ మొదలయ్యింది. ‘ప్రేమలు’ను రీమేక్ చేయాలా? లేదా డబ్ చేయాలా? అని. అయితే ఈ సందేహానికి సమాధానంగా ఈ సినిమాను డబ్ చేస్తేనే మేలు అని ఇండస్ట్రీ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ ఈ మూవీని రీమేక్ చేయాలనుకుంటే కథను సూట్ అయ్యే నటీనటులను వెతికి, షూటింగ్ చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. అప్పటికే ‘ప్రేమలు’పై క్రియేట్ అయిన హైప్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే..
ప్రస్తుతం ‘ప్రేమలు’ పేరు అంతటా ట్రెండ్ అవుతోంది. అందుకే వీలైనంత త్వరగా దీనిని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తే తెలుగు నిర్మాతలకు కూడా లాభాలు వస్తాయని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ పొందుతున్న ‘ప్రేమలు’లో హీరోహీరోయిన్లుగా నస్లీన్, మమితా నటించారు. దీరితో పాటు శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీమ్, మథ్యూ థామస్, సంగీత్ ప్రదీప్.. ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా అంతా హైదరాబాద్‌లోనే చిత్రీకరించారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యింది. హీరోహీరోయిన్ల క్యూట్ కెమిస్ట్రీకి కూడా యూత్ అంతా ఫిదా అవుతున్నారు.
Also Read: బడ్జెట్ సమస్యలు, సినిమా ఆగిపోయిందంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్