Preity Zinta: ప్రీతి జింటా గొప్ప మనసు - ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం
Indian Army: బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇండియన్ ఆర్మీ కోసం రూ.1.10 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని అందించారు.

Preity Zinta Huge Donation To Indian Army: బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధిలోని జింటా వాటా నుంచి రూ.1.10 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.
వారి సాధికారత కోసం..
జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్, ప్రాంతీయ అధ్యక్షుడు శప్తా శక్తి, ఆర్మీ కుటుంబాలు హాజరైన సందర్భంగా ఈ మొత్తాన్ని అందజేశారు. 'సాయుధ బలగాల కుటుంబాలకు అండగా నిలవడం మన బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలకు తగు మూల్యం ఎప్పటికీ తిరిగి చెల్లించలేం. కానీ, మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి సపోర్ట్ ఇద్దాం.' అని పేర్కొన్నారు. సైనిక వీరుల నారీమణుల సాధికారతకు, వారి పిల్లల చదువు కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు తెలిపారు.
దీంతో ప్రీతి జింటాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హిందీతో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు ప్రీతి జింటా. ప్రస్తుతం మూవీస్ తగ్గినా.. బిజినెస్‌లతో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ కో ఓనర్‍గా ఉన్నారు. ఐపీఎల్‌లో తన జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా అందరికీ సపోర్ట్ ఇస్తూ తెగ సందడి చేస్తుంటారు ప్రీతి. దీంతో అంతా ఆమెను ఎంతో ఇష్టపడతారు. తాజాగా.. సైనిక కుటుంబాలకు విరాళం ప్రకటించడంతో అందరి మనసులు గెలుచుకున్నారు.
Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీకి డిఫరెంట్ టైటిల్ - అంత మంది హీరోయిన్లా?, అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..





















