అన్వేషించండి

Allu Arjun Atlee Movie: అల్లు అర్జున్, అట్లీ మూవీకి డిఫరెంట్ టైటిల్ - అంత మంది హీరోయిన్లా?, అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..

AA22XA6 Movie: అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్‌పై తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీ రెండు టైటిల్స్ ప్రచారంలో ఉండగా.. బన్నీ క్రేజ్‌కు అనుగుణంగా ఆయన చెప్పిన టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం.

Allu Arjun Atlee Movie Title Buzz Gone Viral: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ హైప్ మామూలుగా లేదు. ఈ మూవీ నుంచి ఏ చిన్న రూమర్, ఎలాంటి బజ్ వచ్చినా క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా.. ఈ మూవీ టైటిల్‌పై ఆసక్తి నెలకొంది. 

టైటిల్ అదేనా..

సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌లో భారీ స్థాయిలో తెరకెక్కబోతోన్న ఈ మూవీ టైటిల్ ఏంటనే దానిపై అందరిలోనూ ఇంట్రెస్ట్ నెలకొంది. దీనిపై ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది. 'ఐకాన్', 'సూపర్ హీరో' అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్‌ అల్లు అర్జున్‌తో ఓ సినిమా ప్లాన్ చేయగా కొన్ని కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈ మూవీకి 'ఐకాన్' అనే టైటిల్ అనుకున్నారట. అట్లీ సినిమాకు ఆ టైటిల్ అయితే బాగుంటుందని బన్నీ చెప్పగా.. దీనికి ఆయన సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Also Read: చిరంజీవి ‘కొదమసింహం’, వెంకటేష్ ‘సైంధవ్’ TO ప్రభాస్ ‘కల్కి 2898 AD’, నాని ‘సరిపోదా శనివారం’ వరకు - ఈ ఆదివారం (మే 25) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..

బన్నీతో హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని ప్లాన్ చేస్తుండగా.. దాదాపు ఐదుగురు హీరోయిన్లను తీసుకోవాలని అట్లీ భావిస్తున్నారట. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెతో పాటు అనన్య పాండే, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్‌లను తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

డ్యూయెల్ కాదు.. ట్రిపుల్ రోల్..

ఈ సినిమాలో మొన్నటి వరకూ బన్నీ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారనే టాక్ వినిపించగా.. తాజాగా ట్రిపుల్ రోల్ చేస్తారనే రూమర్ వినిపిస్తోంది. ఒకటి పాజిటివ్, మరొకటి నెగిటివ్, ఇంకొకటి పూర్తిగా యానిమేటెడ్‌గా ఉంటుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లోనే ఇదో అరుదైన ఫీట్ అనే చెప్పాలి.

షూటింగ్ ప్రారంభం

దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించనుండగా ఇటీవలే బన్నీతో అట్లీ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా.. ఆగస్టులోనే షూటింగ్ ప్రారంభించాలని అట్లీ ప్లాన్ చేస్తున్నారట. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. వీఎఫ్ఎక్స్‌తో హై ఆక్టేన్ ఫీచర్ ఫిల్మ్‌గా ఉండబోతోందని ఇదివరకే ప్రకటించారు. ఇందుకోసం ఓ అంతర్జాతీయ కంపెనీని కూడా సంప్రదించారు. 

న్యూ లుక్‌లో బన్నీ

'పుష్ప 2' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఈ మూవీ కోసం బన్నీ డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. మూడు వేర్వేరు ప్రపంచాల్లో జరిగిన కథగా అట్లీ దీన్ని రూపొందించనున్నట్లు తెలుస్తుండగా.. దాని కోసం కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు, రోల్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను టీం వెల్లడించే ఛాన్స్ ఉంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Namitha New Look : అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
Mahaprabhu Jagannath Release Date : మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget