By: ABP Desam | Updated at : 30 May 2023 11:28 AM (IST)
హృతిక్ రోషన్, 'ఆదిపురుష్'లో ప్రభాస్, అక్షయ్ కుమార్
శ్రీ రామ చంద్రుని పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. రామ చంద్రునిగా ప్రభాస్ ఆహార్యం బావుందని అభిమానులు చెబుతున్నారు. అయితే, శ్రీ రామునికి మీసాలు ఏమిటి? అని ప్రశ్నించిన వ్యక్తులు కొందరు ఉన్నారు. ఆ విమర్శలు పక్కన పెడితే... రామునిగా ప్రభాస్ కంటే హిందీ హీరోలు బెటరా? అంటే 'అవును' అంటోంది కృత్రిమ మేథస్సు.
హృతిక్, అక్షయ్ అయితే...
ఛాట్ జీపీటీ... ఇటీవల పాపులర్ అయిన సైట్! 'ఆదిపురుష్'లో రాఘవుని పాత్రకు బాగా సూట్ అయ్యే బాలీవుడ్ నటుల పేర్లు సూచించామని ఛాట్ జీపీటీని అడిగితే 'దర్శకుడి విజన్, ఇతర అంశాలు కాస్టింగ్ విషయంలో ప్రభావం చూపిస్తాయి' అని చెబుతూనే... 'హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్' పేర్లు సూచించింది.
ఆల్రెడీ హిస్టారికల్ అండ్ మైథలాజికల్ క్యారెక్టర్లు చేసిన అనుభవం హృతిక్ రోషన్ (Hrithik Roshan)కు ఉందని, ఆయన చరిస్మాటిక్ స్క్రీన్ ప్రజెన్స్ & నటన శ్రీ రాముని పాత్రకు బావుంటుందని ఛాట్ జీపీటీ పేర్కొంది. శ్రీ రాముని పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీ అక్షయ్ కుమార్ తీసుకొస్తారని పేర్కొంది. ఆయనకు క్రమశిక్షణ కూడా ఉందని చెప్పింది.
భావోద్వేగాలను ఆయుష్మాన్ ఖురానా చక్కగా పలికిస్తారని, విలక్షణ పాత్రలు చేసి పేరు తెచ్చుకున్న ఆయన ఇంట్రెస్టింగ్ ఛాయస్ అంటోంది. ఆఖరి ఆప్షన్ కింద విక్కీ కౌశల్ పేరు సూచించింది. దాంతో హిందీలో కొత్త చర్చ మొదలైంది.
విమర్శలు పక్కన పెడితే... 'ఆదిపురుష్'లో రెండు పాటలు విడుదల అయ్యాయి. అవి సినిమాపై అంచనాలు పెంచాయి. టీజర్ విడుదలైనప్పటితో పోలిస్తే... ఆ నెగిటివిటీ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు.
Also Read : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
పీపుల్స్ మీడియా చేతికి 'ఆదిపురుష్'
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను రూ. 170 కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగులో జరిగిన భారీ థియేట్రికల్ రైట్స్ డీల్స్ చూస్తే... 'ఆర్ఆర్ఆర్' రెండు రాష్ట్రాల హక్కులు సుమారు 226 కోట్లకు విక్రయించారు. 'బాహుబలి 2' అయితే రూ. 120 కోట్లకు. 'సాహో' రూ. 124 కోట్లకు విక్రయించారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్థానం 'ఆదిపురుష్'ది అని చెప్పవచ్చు.
Also Read : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!
'ఆదిపురుష్' సినిమాలో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ తెలియజేసింది. జూన్ 6వ తేదీ సాయంత్రం భారీ ఎత్తున భక్తులు, ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో వేడుకగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
/body>