News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

Shaitan Web Series First Look : దర్శకుడు మహి వి. రాఘవ్ ఒక్కసారిగా గేరు మార్చారు. కామెడీ నుంచి క్రైమ్ వైపు మళ్ళారు. ఆయన కొత్త వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ విడుదలైంది. 

FOLLOW US: 
Share:

తెలుగు ఓటీటీలో 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ ఒక సంచలనం. వీక్షకులు మళ్ళీ మళ్ళీ చూసిన సిరీస్ ఇది. నిజానికి, ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్, సినిమాల్లో ఈ స్థాయి విజయం సాధించినది మరొకటి లేదు. దీనికి దర్శకుడు మహి వి. రాఘవ్ (Mahi V Raghav) క్రియేటర్ అండ్ ప్రొడ్యూసర్. ఏప్రిల్ నెలాఖరున ఆ సిరీస్ విడుదలైంది. ఇప్పుడు జూన్ 15న మహి వి. రాఘవ్ తీసిన మరో వెబ్ సిరీస్ వస్తోంది. 

సైతాన్... కామెడీ కాదు, క్రైమ్!
మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'సైతాన్' (Shaitan Web Series). జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'సేవ్ ద టైగర్' విడుదలైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీలో ఈ సిరీస్ సైతం విడుదల కానుంది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'సైతాన్'లో ఎవరెవరు ఉన్నారు?
'సేవ్ ద టైగర్స్'లో లాయర్ రేఖ (చైతన్య కృష్ణ భార్య) పాత్రలో నటించిన దేవయాని శర్మ ఉన్నారు కదా! ఫస్ట్ లుక్ చూస్తే... ఆవిడ కనిపించరు. మలయాళ నటి, తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్న షెల్లీ నబు కుమార్, నటుడు రిషి కూడా ఉన్నారు. కమల్ హాసన్ 'విక్రమ్' సహా పలు తమిళ సినిమాల్లో నటించిన జాఫర్ సాధిక్ సైతం ఉన్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'లో అఖిల్ అక్కినేని స్నేహితురాలిగా, 'మా ఊరి పొలిమేర'లో కథానాయికగా, 'విరూపాక్ష'లో కమల్ కామరాజు భార్య పాత్రలో నటించిన తెలుగమ్మాయి కామాక్షీ భాస్కర్ల ఓ పాత్ర చేసినట్టు తెలిసింది. 

పోలీసును ఎందుకు చంపేశారు?
'సైతాన్' ఫస్ట్ లుక్ చూస్తే... రిషి, దేవయాని, షెల్లీ, జాఫర్ కలిసి ఓ పోలీసును హత్య చేసినట్టు అర్థం అవుతోంది. ఎందుకు చంపారు? అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. ''మీరు నేరం అని దేనిని అయితే అంటున్నారో... వాళ్ళు దానిని మనుగడ కోసం చేసిన పనిగా చెబుతున్నారు'' అని మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. క్రైమ్ జానర్ ప్రాజెక్ట్ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. 

ఒక్కసారి గేరు మార్చిన మహి!
'సేవ్ ద టైగర్స్'లో ప్రతి ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలను కథగా మలిచి మహి వి. రాఘవ్ కొత్తగా చూపించారు. ఆయన ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. తెలుగులో హారర్ కామెడీలు కుప్పలు తెప్పలుగా వస్తున్న రోజుల్లో 'ఆనందో బ్రహ్మ' తీశారు. అందులో ఓ కొత్తదనం ఉంటుంది... మనుషులను చూసి దెయ్యాలు భయపడితే? కాన్సెప్ట్ తీసుకుని మహి వి. రాఘవ్ నవ్వించారు. అయితే, ఇప్పటి వరకు ఆయన తీసినవి కామెడీ అండ్ ఎమోషనల్ కథలే. 'సైతాన్'లో కూడా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట! అయితే... క్రైమ్ నేపథ్యంలో మహి వి. రాఘవ్ ఎలా తీశారో చూడాలి.

Also Read : ఎన్టీఆర్ గాంధీగా మారిన వేళ - నెహ్రూ ఆశ్చర్యపోయిన సభ

త్వరలో మహి వి. రాఘవ్ నుంచి ఓ సినిమా రాబోతోంది. 'యాత్ర' సినిమాకు కొనసాగింపుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథతో 'యాత్ర 2' చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఆ సినిమాలో జగన్ పాత్రకు తమిళ హీరో జీవా పేరు పరిశీలనలో ఉందట. 

Also Read : 'ఆదిపురుష్' తెలుగు థియేట్రికల్ రైట్స్ రేటు యమా ఘాటు - ఇది భారీ డీల్ రామా!

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Published at : 30 May 2023 08:51 AM (IST) Tags: Disney Plus Hotstar Mahi V Raghav Shaitan Web Series Shaitan First Look Deviyani Sharma Jaffer Sadiq

ఇవి కూడా చూడండి

Miss Shetty Mr Polishetty OTT : ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

Miss Shetty Mr Polishetty OTT : ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?

RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?

DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

టాప్ స్టోరీస్

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన  రౌస్ అవెన్యూ కోర్ట్ !

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!