అన్వేషించండి

Saif Ali Khan Attacker: ఇతనే సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది - ఫోటో రిలీజ్ చేసిన ముంబై పోలీసులు

Saif Attack: గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని ఇంట్లో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దుండగుడి ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. ఆ దుండగుడు మెట్లు దిగి పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

Pic Of Saif Ali Khan Attacker Released: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన బాంద్రా అపార్ట్‌మెంట్‌లో కత్తిపోట్లకు గురైన కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేసతున్నారు  గురువారం దాడి తర్వాత భవనం మెట్ల నుండి దాడికి పాల్పడిన వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో బయటపడ్డాయి.  బాంద్రాలోని తన 12వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లోకి ఖాన్‌పై దాడి చేసిన నిందితుడు, ఆరవ అంతస్తులోని భవనం మెట్ల నుండి బయటకు వస్తున్న సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించేందుకు వీలుగా మెట్లు నిర్మించారు. వాటి ద్వారా అతను ఇంట్లోకి చొరబడినట్లుగా గుర్తించారు.                       

ఈ మెట్ల వెనుక చాలా బ్లైండ్ స్పాట్లు ఉన్నాయి. అంటే సీసీ కెమెరాలకు కూడా అందవు. అయితే ఆరో అంతస్తులో సీసీ టీవీ కెమెరాల్లో  రికార్డ్ అయిన ఫుటేజ్‌ల నుండి పోలీసులు అతన్ని పోలీసులు గుర్తించగలిగారు. సైఫ్ ఇంట్లోకి దుండగుడు అత్యవసర అగ్నిమాపక ద్వారం ద్వారా ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.  దొంగకు అది నటుల ఇల్లు అని తెలియకపోవచ్చునని.. దొంగతనం ఉద్దేశంతోనే ఇంట్లోకి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. దుండగుడికి ఇంటి యజమాని ఎవరో తెలియదని పోలీసులు చెబుతున్నారు. అతని ఉద్దేశం బాగా ధనవంతుల ఇంట్లో దొంగతనం చేయడం కావొచ్చునని చెబుతున్నారు.           

Also Readపటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?

దుండగుగు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ముందుగా  పనిమనిషి గదిలోకి  వెళ్లాడు. దాంతో  పనిమనిషి కేకలు వేయడం ప్రారంభింది. దీంతో ఏదో జరుగుతోందని సైఫ్ అక్కడికి వచ్చాడు. అందరూ మేలుకుటున్నారని తన దొంగతనం ప్లాన్ ఫెయిలయిందని..దొరికిపోతానన్న ఉద్దేశంతో ఎదురుగా వచ్చిన సైఫ్‌పై  దాడి చేసి  పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు సైఫ్ చేసిన ప్రయత్నంలోనే ఎక్కువగా గాయాలయినట్లుగా తెలుస్తోంది.  పనిమనిషి  చేతికి స్వల్ప గాయమైంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వ్యక్తిపై BNS లోని సెక్షన్ 311, 312, 331(4), 331(6) మరియు 331(7) తో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సీసీ ఫుటేజీ లో దుండగుడు దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అతను ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

Also Rea: సైఫ్ పై హత్యాయత్నం కేసులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దర్యాప్తు - జేబులో గన్నుతో దయా నాయక్ ఎంట్రీ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News:
"అక్టోబర్‌ 2 తర్వాత హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు" చంద్రబాబు వార్నింగ్ మెసేజ్ 
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Tirupati Crime News:రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamPawan Kalyan on Tamil Movies | భారతదేశం ఏమన్నా కేకు ముక్క కోసుకోవటానికి.? | ABP DesamPawan Kalyan on his Ideology | పూటకో పార్టీతో ఉంటావనే వాళ్లకు ఇదే నా ఆన్సర్ | ABP DesamPawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News:
"అక్టోబర్‌ 2 తర్వాత హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు" చంద్రబాబు వార్నింగ్ మెసేజ్ 
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Tirupati Crime News:రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Telangana CM Revanth Reddy : కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
Telangana Assembly Sessions : తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
David Warner: నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
Embed widget