అన్వేషించండి

Saif Ali Khan: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?

Saif Ali Khan Family Background: ఈ రోజు తెల్లవారు జాముకు కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ ది.. రాజ కుటుంబం అనే విషయం తెలిసిందే. ఆయన పటౌడీ సామ్రాజ్యానికి పదవ నవాబ్. అలాగే..

Saif Ali Khan Family and Legacy: సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వెన్నుముకపై కత్తి పోటు తగలడంతో సర్జరీ చేసి కత్తిని తొలగించినట్టు తాజాగా వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రమాదం తప్పిందన్నారు. కాగా బాలీవుడ్  నటుడైన సైఫ్ అలీఖాన్ ది హైప్రోఫైల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అనే విషయం తెలిసిందే. ఆయనది నవాబుల కుటుంబ నేపథ్యం. తాత మొత్తాలు రాజులు, తండ్రి టీమిండియా క్రికెటర్, తల్లి కూడా సెలబ్రిటీ, భార్య స్టార్ హీరోయిన్. ఆయన కూడా స్టార్ నటుడు. అంతేకాదు ఈ రాజ కుటుంబంలో పదవ వారసుడు, పదవ నవాబ్.

రాజకుటుంబ వారసత్వం ఉన్న సైఫ్ ఆస్తులు రూ.1200 కోట్లు పై చీలుకే అని ముంబై మీడియా పేర్కొంది. పటౌడీ రాజకుటుంబానికి చెందిన సైఫ్ కి గురుగ్రామ్ లో పటౌడీ ప్యాలెస్ ఉంది. దానిని పేరు గురుగ్రామ్ ఇబ్రహీం కోఠీ చిహ్నంగా పిలుస్తారు. 1935 లో సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానం నవాబులు ఈ ప్యాలెస్ కట్టించారు. సైఫ్  తాత నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్ తన భార్య బేగమ్ ఆప్ భోపాల్ కు కానుకగా ఇచ్చేందుకు ఈ పటౌడీ ప్యాలెస్ ని సుందర భవనంగా కట్టించారట. దాదాపు 10 ఎకరాల విస్తిర్ణంలో నిర్మించారు. దీనిలో ఏడు పడక గదులున్నాయట. ఈ పటౌడీ ప్యాలెస్ విలువ సుమారు రూ. 800 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ప్యాలెస్ లో వీర్ జారా, ఈట్ ప్రే లవ్ వంటి సినిమాల షూటింగ్ జరిగింది. 

తల్లి, తండ్రి ఇద్దరు సెలబ్రిటీలే...

సైఫ్ తండ్రి పేరు మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఈయన టీమిండియా మాజీ ఆటగాడు. కొన్నాళ్లు ఆయన టీమిండియా జట్టుకు నాయకత్వం కూడా వహించారు. 21 సంవత్సరాల వయసులోనే భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఆయన అసాధారణ ఫీల్డింగ్ తో 'టైగర్ పటౌడీ' అనే బిరుదు పొందారు. ఆయన గతంలో వించెస్టర్ కాలేజీకి ఆడాడు, ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి స్కూల్ రికార్డుకు ఎక్కారు. టీమిండియాకు కెప్టెన్ గా వహించిన అతి వయస్కుడిగా ఆయనపై పేరు రికార్డు ఉంది. 2004 వరకు జింబాబ్వే ఆటగాడు టాటెండా తైబు ఈ రికార్డును క్లెయిమ్ చేసే వరకు అతను ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే టెస్ట్ కెప్టెన్‌గా ఈ రికార్డు ఆయన పేరుపై ఉంది. ఇక ఆయన తల్లి షర్మిలా ఠాగోర్. ఆమె బాలీవుడ్ నటి. హిందీలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఆమెను సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కొడుకు సైఫ్ అలీఖాన్, ఇద్దరు కూతుళ్లు జన్మించారు. తండ్రి మీద ఉన్న ప్రేమతో సైఫ్, ఆయన భార్య కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కలకత్తా అనే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియం లీగ్ జట్టును కోనుగోలు చేశారు. 2024లో మార్చిలో జరిగిన లీగ్ వారి జట్టు విజయం సాధించి చాంపిన్ గా నిలిచింది.

Also Read: టీడీపీ, జనసేనకు బుల్లి రాజు ప్రచారం... ఏపీ ఎన్నికల్లో వెంకీ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల ఏం చేశాడో చూశారా?

వ్యాపార సామ్రాజ్యం

సైఫ్ తన కుటుంబ వారసత్వంగా పటౌడీ పేరుతో దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించారు. ఆ తర్వాత పర్య్వూమ్స్, ఫుట్ వేర్, హోమ్ డెకార్ వంటి రంగాలకు దానిని విస్తరించారు. మొదట 2022లో బెంగళూరులో ప్రారంభించి ఆ తర్వాత ముంబై, గోవాలకు ఔట్ లెట్స్ తెరిచారు. ప్రస్తుతం సైఫ్ తన భార్య కరీనా కపూర్ తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్ లోని విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం సైఫ్ ఉంటున్న ఇంటి విలువ రూ. 55 కోట్లు అని అంచనా. అలాగే స్వీట్జర్లాండ్ లో గాస్టాడ్ ప్రాంతంలో వీరికి విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. దానికి విలువ రూ. 33 కోట్లు. ఇక సైఫ్ కార్ల కలెక్షన్స్ కి వస్తే బెంజ్ ఎస్  క్లాస్ కు చెందిన ఎస్350డీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడీ క్యూ7, జీప్ రాంగ్లర్ వంటివి ఉన్నాయి. అయితే సైఫ్ అలీఖాన్ మొదట అమృతా సింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. 1991లో వీరి వివాహం జరుగగా.. 2004లో వీరి విడాకులు తీుసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు సంతానం. విడాకుల తర్వాత 2012లో కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికీ తైమూర్, జేహ్ ఇద్దరు మగ పిల్లలు. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని, ఒక్కో యాడ్ కోసం రూ. 1 లేదా 2 కోట్లు తీసుకుంటున్నారని టాక్.

Also Read:డేంజర్ జోన్‌లో పూజా హెగ్డే టాలీవుడ్ కెరీర్... మూడేళ్ళ గ్యాప్, చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు, ఎందుకిలా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Embed widget