అన్వేషించండి

Peddi Collections Day 15: రెండో వారం తర్వాత రోజుకు రెండు కోట్లు... రామ్ చరణ్ 'పెద్ది' 15 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Peddi Box Office Collection Day 15: రామ్ చరణ్ 'పెద్ది'కి రెండు వారాల తర్వాత బాక్సాఫీస్ బరిలో పరిస్థితి ఎలా ఉంది? 15వ రోజు సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'పెద్ది' సినిమా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹322.65 కోట్లు వసూలు చేసింది.
  • 15వ రోజు ₹2 కోట్ల నెట్; ఇండియాలో ₹228 కోట్లు చేరుకుంది.
  • తెలుగులో పెద్ద హిట్‌గా నిలిచినా, బ్రేక్ ఈవెన్ ₹500 కోట్లు.
  • ప్రేక్షకులను ఆకర్షించడానికి ఐదు నిమిషాల కొత్త సన్నివేశాలు చేర్చారు.

Ram Charan Peddi 15 Days Collections: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' థియేటర్లలో విడుదలై 14 రోజులు దాటింది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ... విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టింది. బాక్సాఫీస్ బరిలో తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలైన 15వ రోజు సినిమా ఎంత కలెక్ట్ చేసింది? మూడో గురువారం వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...

రెండు వారాల తర్వాత రోజుకు రెండు కోట్లు!
Peddi 15th Day Collection: రెండు వారాల తర్వాత కూడా రోజుకు రెండు కోట్లు కలెక్ట్ చేస్తోంది రామ్ చరణ్ 'పెద్ది'. గురువారం కూడా సినిమా వసూళ్లు బావున్నాయి. ముందు రోజుతో కంపేర్ చేస్తే... కొంచెం తగ్గినప్పటికీ మూడో వారంలో రెండు కోట్లు రావడం గొప్ప అని చెప్పాలి. 15వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే...

  • ఇండియాలో 15వ రోజున 'పెద్ది' సినిమా నెట్ కలెక్షన్లు రూ. 2 కోట్లు. అంతకు ముందు రోజు కలెక్షన్లతో (2.45 కోట్ల)తో పోలిస్తే... 18.4 శాతం తగ్గాయి.
  • ఇప్పటి వరకు ఇండియాలో రామ్ చరణ్ 'పెద్ది' టోటల్ నెట్ కలెక్షన్లు (15 రోజుల్లో) రూ. 228 కోట్లు. గ్రాస్ విషయానికి వస్తే... రూ. 270.05 కోట్లు.
  • ఓవర్సీస్ మార్కెట్టులోనూ 'పెద్ది' ఇంకా కలెక్షన్లు రాబడుతోంది. 15వ రోజు 15 లక్షల గ్రాస్ రాబట్టింది. దాంతో ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ఓవర్సీస్ గ్రాస్ రూ. 52.60 కోట్లకు చేరుకుంది.
  • ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ చూస్తే... 15 రోజుల్లో రూ. 322.65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందీ సినిమా.

Also Read: Maa Inti Bangaram Twitter Review - 'మా ఇంటి బంగారం' ట్విట్టర్ రివ్యూ: సమంత సినిమా హిట్టేనా... అమెరికా ప్రీమియర్స్‌ రిపోర్ట్స్, సోషల్ మీడియా టాక్ ఎలా ఉందంటే?

రెండో వారంలోనూ తెలుగులో తగ్గని జోరు
Ram Charan Peddi 15th Day Telugu Version Net Collection: రామ్ చరణ్ 'పెద్ది'కి విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. రెండో వారంలోనూ తెలుగులో జోరు తగ్గలేదు. 'పెద్ది' తెలుగు వెర్షన్ 15వ రోజు రూ. 1.63 కోట్ల నెట్ కలెక్ట్ చేయగా... హిందీలో 30 లక్షలు, కన్నడలో 5 లక్షలు, తమిళంలో 2 లక్షలు వసూలు చేసింది.

Also ReadVanda Devullu Review - 'వంద దేవుళ్ళు' రివ్యూ: అమ్మకు మళ్ళీ పెళ్లి... 'బిచ్చగాడు' కాంబినేషన్‌లో లేటెస్ట్ సినిమా - ఎలా ఉందంటే?

ఈ ఏడాది భారీ వసూళ్లు సాధించిన సూర్య 'కరుప్పు', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్లను బీట్ చేసి బిగ్గెస్ట్ టాలీవుడ్ గ్రాసర్‌గా నిలిచింది 'పెద్ది'. అయితే... 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదని ట్రేడ్ వర్గాల టాక్. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు సుమారు ఐదు నిమిషాల నిడివి గల కొత్త సన్నివేశాలను యాడ్ చేశారు. మరి రీ ఎడిటెడ్ వెర్షన్ ప్రేక్షకులను ఏమేరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.

Also ReadSave The Tigers 3 Review - 'సేవ్ ద టైగర్స్ 3' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో లేటెస్ట్ వెబ్ సిరీస్

Frequently Asked Questions

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

'పెద్ది' సినిమా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 322.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

'పెద్ది' సినిమా 15వ రోజున ఇండియాలో ఎంత నెట్ కలెక్షన్లు సాధించింది?

'పెద్ది' సినిమా 15వ రోజున ఇండియాలో రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే వసూళ్లు కొంచెం తగ్గినప్పటికీ, మూడో వారంలో ఇది మంచి కలెక్షనే.

'పెద్ది' సినిమా ఏ రికార్డును అధిగమించి, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఎంత అవసరం?

'పెద్ది' సినిమా సూర్య 'కరుప్పు', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్లను బీట్ చేసి బిగ్గెస్ట్ టాలీవుడ్ గ్రాసర్‌గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ. 500 కోట్లు సాధించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget