OG Movie Preview: పవన్ కళ్యాణ్ 'ఓజీ' ప్రివ్యూ
OG Movie Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ మాఫియా డ్రామా 'ఓజీ'. సెన్సార్ నుంచి స్టోరీ వరకు, ఇంకా ఇతరత్రా వివరాలు ప్రివ్యూలో చూడండి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'సాహో' వంటి పాన్ ఇండియా సినిమా తీసిన సుజీత్ దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (OG Movie). గ్లింప్స్, ట్రైలర్ మాత్రమే కాదు... తమన్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమా సెన్సార్, రన్ టైమ్ నుంచి స్టోరీ వరకు... ఇతరత్రా వివరాలు 'ఓజీ' ప్రివ్యూలో చూడండి.
వయలెన్స్ వల్ల 'ఓజీ'కి 'ఏ'!
OG Censor Certificate: పవన్ కళ్యాణ్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'ఏ' సర్టిఫికెట్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకోవాలి. అయితే యు లేదంటే యు / ఏ వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ... 'ఓజీ'కి 'ఏ' సర్టిఫికెట్ వచ్చింది. అందుకు రీజన్ సినిమాలో యాక్షన్ సీన్లు, వయలెన్స్ రీజన్ అని టాక్. యాక్షన్ సీక్వెన్సులో హింస కంటే తలలు నరికే సన్నివేశాలు, రక్తపాతం వల్ల 'ఏ' సర్టిఫికెట్ వచ్చిందని టాక్. కొన్ని సన్నివేశాలు తొలగితే 'యు / ఏ' ఇస్తామని సెన్సార్ సూచించినా దర్శకుడు సుజీత్ ఆయా సన్నివేశాలకు కత్తెర వేయడానికి అంగీకరించలేదట. అందుకే 'ఏ' వచ్చింది.
'ఓజీ'కి రన్ టైమ్ బిగ్గెస్ట్ ప్లస్!
OG Runtime: 'ఓజీ' సినిమాకు రన్ టైమ్ బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. ఇటీవల స్టార్ హీరోస్ సినిమాలు కొన్ని మూడు గంటల నిడివితో వచ్చాయి. కానీ, 'ఓజీ' మాత్రం రెండున్నర గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంకా చెప్పాలంటే... ఈ సినిమా రన్ టైమ్ రెండు గంటల 34 నిమిషాలు మాత్రమే. యాక్షన్ సీన్స్ వల్ల స్పీడుగా సినిమా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
'ఓజీ' కథ ఏమిటి? ఏముంటుంది?
OG Movie Story Line: దర్శకుడు సుజీత్ 'ఓజీ' కథను రహస్యంగా ఉంచాలని గానీ, థియేటర్లలో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని గానీ అనుకోలేదు. ట్రైలర్ చూస్తే సినిమా కథ ఏమిటి? అనేది ఒక ఐడియా వస్తుంది. ముంబై మహా నగరంలో ఓ డాన్ ఉంటాడు. అతడి పేరు ఓమీ (ఇమ్రాన్ హష్మీ). ముంబైలోని సత్య దాదా (ప్రకాష్ రాజ్)ను అంతం చేయాలని అనుకుంటాడు. వాళ్ళను ఎదిరించి నిలబడటానికి ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) ముంబై వస్తాడు. ఓమీని ఓజాస్ గంభీర ఎలా ఎదిరించాడు? ఏం చేశాడు? అనేది సినిమా. తమన్ మ్యూజిక్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్.
Also Read: ఓజీ vs వీరమల్లు... పవర్ స్టార్‌తో పవన్ కళ్యాణ్‌కే పోటీ... బిజినెస్‌లో ఇంత డిఫరెన్స్ ఏంటి సామి!
యాక్షన్ డ్రామా తీసిన అనుభవం సుజీత్ (OG Director Sujeeth)కు ఉంది. 'ఓజీ'కి ముందు తీసిన 'సాహో'లో యాక్షన్ సీన్లు ఎలా తీశారో ప్రేక్షకులు చూశారు. పైగా పవన్ కళ్యాణ్ అంటే దర్శకుడికి అమితమైన ప్రేమ. అభిమానిగా అభిమానులు కోరుకునే సినిమా తీసి ఉంటాడని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'ఓజీ'కి విపరీతమైన హైప్ నెలకొన్న నేపథ్యంలో సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సరే రికార్డ్ కలెక్షన్స్ సాధించడం గ్యారెంటీ. పెయిడ్ ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో 'ఓజీ' రికార్డులు తిరగ రాయడానికి రెడీ అయ్యింది.
Also Read
: పవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?





















