OG Vs HHVM: ఓజీ vs వీరమల్లు... పవర్ స్టార్‌తో పవన్ కళ్యాణ్‌కే పోటీ... బిజినెస్‌లో ఇంత డిఫరెన్స్ ఏంటి సామి!
OG Pre Release Business Vs HHVM: పవన్ కెరీర్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది 'ఓజీ'. ఫ్యాన్స్ కోరుకునే సినిమా చేస్తే ఈ రేంజ్ బిజినెస్సా? అని వీరమల్లుతో కంపేర్ చేస్తూ ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతోంది.

OG Movie vs Hari Hara Veera Mallu Pre Release Business Comparison: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ నంబర్స్ నమోదు చేసింది 'ఓజీ'. ఫ్యాన్స్ కోరుకునే సినిమాను ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఈ రేంజ్ బిజినెస్ ఏమిటి? ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతోంది. అందుకు రీజన్ పవన్ లాస్ట్ సినిమా బిజినెస్. 'ఓజీ', 'హరిహర వీరమల్లు' మధ్య బిజినెస్ పరంగా డిఫరెన్స్ చాలా ఉంది మరి.
వీరమల్లు కంటే 'ఓజీ'కి ఎక్కువ...
క్రేజ్ ఒక్కటే కాదు, బిజినెస్ కూడా!
'హరిహర వీరమల్లు' విడుదలకు వారం ముందు వరకు నైజాం డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తారు? అనే అంశంలో సందిగ్ధత నెలకొంది. డిస్కషన్స్ తర్వాత మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాక్ ఎండ్ నుంచి కొంత అమౌంట్ సర్దుబాటు చేసిందని టాక్. 'ఓజీ'కి అటువంటి ఇబ్బంది లేదు. ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్ని రోజుల కిందట అమ్మేశారు. వీరమల్లు కంటే ఓజీ సినిమాకు ముందు నుంచి హైప్ ఎక్కువ ఉంది.
పవన్ కళ్యాణ్ ఇష్టపడే మాఫియా & గ్యాంగ్‌స్టర్ జానర్ సినిమా కావడం, 'సాహో' వంటి పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ తీసిన సుజీత్ దర్శకుడు కావడం, పైగా అతను పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ కావడం వల్ల 'ఓజీ'కి ముందు నుంచి హైప్ ఉంది. ఇప్పుడు బిజినెస్ పరంగానూ 'ఓజీ' రికార్డులు క్రియేట్ చేసింది. ఒక్క క్రేజ్ విషయంలోనే కాదు... బిజినెస్ పరంగానూ వీరమల్లు కంటే ఎక్కువ నంబర్స్ నమోదు చేసింది.
'ఓజీ' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 172 కోట్లు అయితే... 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ బిజినెస్ 126 కోట్లు మాత్రమే. నైజాంలో వీరమల్లును తీసుకోవడానికి 'దిల్' రాజు వెనకడుగు వేశారు. ఆ సినిమా నైజాం రైట్స్ రూ. 37 కోట్లకు వెళ్లాయి. అదే 'దిల్' రాజు ఇప్పుడు 'ఓజీ' రైట్స్ తీసుకున్నారు. అది కూడా రూ. 54 కోట్లకు. ఒక్క నైజాం మాత్రమే కాదు... ప్రతి ఏరియాలోనూ రెండు సినిమాల బిజినెస్ మధ్య చాలా డిఫరెన్స్ ఉంది.
Also Read: నాగార్జున వందో సినిమా దర్శకుడితో... OG Heroine ప్రియాంక సినిమా... థియేటర్లకు కాదు, ఎందుకో తెలుసా?
రాయలసీమ (సీడెడ్) 'ఓజీ' రైట్స్ రూ. 22 కోట్లు అయితే... వీరమల్లు రైట్స్ రూ. 16.50 కోట్లు మాత్రమే. ఉత్తరాంధ్రలో 'ఓజీ' రైట్స్ రూ. 20 కోట్లు అయితే వీరమల్లు రైట్స్ రూ. 12 కోట్లు. ఇక తూర్పు గోదావరిలో రూ. 12 (ఓజీ) - 9.50 (వీరమల్లు), పశ్చిమ గోదావరిలో రూ. 9 (ఓజీ) - 7 కోట్లు (వీరమల్లు), గుంటూరు రూ. 12.50 (ఓజీ) - 9.50 (వీరమల్లు), కృష్ణ రూ. 9.50 (ఓజీ) - 7.60 (వీరమల్లు), నెల్లూరు రూ. 6 (ఓజీ) - 4.40 (వీరమల్లు) కోట్లకు అమ్ముడు అయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్టులో 'ఓజీ' రైట్స్ రూ. 17.50 కోట్లు కాగా... వీరమల్లు రైట్స్ రూ. 10 కోట్లు మాత్రమే. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం వీరాభిమాని సుజీత్ సినిమా చేస్తే ఈ రేంజ్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. పవన్ కళ్యాణ్ లాస్ట్ ఐదు సినిమాలు చూసినా సరే... 'ఓజీ' హయ్యస్ట్ బిజినెస్ చేసింది. మిగతా సినిమాలకు అందనంత స్థాయిలో ఉంది.
పవన్ కళ్యాణ్ 25వ సినిమా 'అజ్ఞాతవాసి' అప్పట్లో రూ. 123.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దానికి ముందు 'కాటమరాయుడు' రూ. 84.50 కోట్లు, దాని తర్వాత 'వకీల్ సాబ్' రూ. 89.35, 'భీమ్లా నాయక్' రూ. 106.75, 'బ్రో' రూ. 97.50 కోట్లు బిజినెస్ చేశాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 'ఓజీ', బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ నమోదు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ ఏడాది 'ఓజీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 172 కోట్లు అయితే... 'హరిహర వీరమల్లు' రూ. 126 కోట్ల బిజినెస్ చేశాయి.
Also Read: పవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?





















