![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Oscars 2024: ఆస్కార్స్‌లో భారతీయులకు నిరాశ - మనకు ఒక్క అవార్డూ రాలేదు
To Kill A Tiger missed Oscar Awards 2024: ఆస్కార్స్ 2024లో భారతీయులకు నిరాశ ఎదురైంది. ఈసారి మనకు ఒక్క అవార్డు కూడా రాలేదు.
![Oscars 2024: ఆస్కార్స్‌లో భారతీయులకు నిరాశ - మనకు ఒక్క అవార్డూ రాలేదు Oscars 2024 No luck for Indians this year concludes with zero wins Oscars 2024: ఆస్కార్స్‌లో భారతీయులకు నిరాశ - మనకు ఒక్క అవార్డూ రాలేదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/a57d8bca4cb2478460ada95d5d23398b1710138577226313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారతీయులకు ఆస్కార్ 2023 ఎప్పటికీ గుర్తు ఉంటుంది. యావత్ భారత దేశంతో పాటు ప్రపంచ డ్యాన్స్ ప్రేమికులు అందరితో ఒక్కసారి అయినా 'నాటు నాటు' స్టెప్ వేయించిన ఘనత మన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాకు దక్కింది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్న దృశ్యాలు... ఆస్కార్ వేదికపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పెర్ఫార్మన్స్... రెడ్ కార్పెట్ మీద ఎన్టీఆర్, రామ్ చరణ్ సందడి... మన ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' పాటకు గత ఏడాది ఆస్కార్ రావడంతో ఈ ఏడాది ఏదో ఒక భారతీయ సినిమా నామినేషన్ వరకు వెళుతుందని ప్రేక్షకుల మనసులో చిన్న ఆశ ఏర్పడింది. అయితే, ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ... నామినేషన్స్‌లో ఒక్క ఇండియన్ ఫిల్మ్ కూడా తుది దశలో చోటు దక్కించుకోలేదు. వాళ్లకు ఊరట ఇస్తూ భారతీయ సంతతికి చెందిన దర్శకురాలు నిషా పహుజా (Nisha Pahuja) తీసిన 'టు కిల్ ఏ టైగర్' డాక్యుమెంటరీ నామినేషన్ సొంతం చేసుకుంది.
ఝార్ఖండ్ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలంటూ...
To Kill A Tiger Oscar Movie: 'టు కిల్ ఏ టైగర్' డాక్యుమెంటరీ తీసిన నిషా పహుజా కెనడియన్. ఆమె భారత సంతతికి చెందిన మహిళ. భారత దేశంలో జరిగిన ఘటన ఆధారంగా తీశారు.
ఝార్ఖండ్ (To Kill A Tiger Story)లో అత్యాచారానికి గురైన పదమూడు సంవత్సరాల బాలికకు న్యాయం జరగాలని తండ్రి చేసిన పోరాటమే 'టు కిల్ ఏ టైగర్' కథ. దీనికి ఆస్కార్ తుది నామినేషన్లలో చోటు దక్కినప్పటికీ... అవార్డు మాత్రం రాలేదు. కానీ, ప్రేక్షకుల మనసులు కదిలించింది. ఎంతో మందిలో ఆలోచన కలిగించింది.
'టు కిల్ ఏ టైగర్'కు ఆస్కార్స్ 2024లో గట్టి పోటీ ఎదురైంది. ఉక్రెయిన్ మీద రష్యా చేసిన దాడులు, ఆ యుద్ధం నేపథ్యంలో ఫిల్మ్ మేకర్, ఫోటో జర్నలిస్ట్ మిస్టిస్లావ్ చెర్నోవ్ తీసిన '20 డేస్ ఇన్ మారియో పోల్'కి ఆస్కార్ వచ్చింది.
మరోసారి ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్
Oscars 2024 RRR: అవార్డుల విషయంలో భారతీయులకు ఒక్కటి రాలేదు. కానీ, భారతీయులు అందరూ సంతోషం వ్యక్తం చేసిన రెండు సంఘటనలు ఈ ఏడాది ఆస్కార్ వేదికపై చోటు చేసుకున్నాయి. ఒకటి... బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనౌన్స్ చేసేటప్పుడు 'నాటు నాటు' సాంగ్ విజువల్స్ ప్లే చేశారు. ఆ తర్వాత స్టంట్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూపించారు.
Also Read: అయ్యయ్యో, పడిపోయిందే - ఆస్కార్ రెడ్ కార్పెట్ షోలో పడిపోయిన నటి, ఫొటోలు వైరల్
జీ అవార్డ్స్ వేడుకలో కృతి సనన్.!#zeecineawards2024 #CineAwards #TeluguNews #KritiSanon pic.twitter.com/CKv7mU1KBH
— ABP Desam (@ABPDesam) March 11, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)