News
News
X

Oscars 2023: Oscars 2023: అందుకే కీరవాణి స్పీచ్‌కు బదులు ఆ పాట పాడారు - ఇంతకీ ఆయన చెప్పిన ‘కార్పెంటర్స్’ ఎవరు?

‘ఆస్కార్స్’లో కీరవాణి చెప్పిన ‘కార్పెంటర్స్’ సాంగ్స్ గురించి మీకు తెలుసా? స్పీచ్‌కు బదులు ఆ సాంగ్‌ను ఎంచుకోవడానికి కారణం ఇదే.

FOLLOW US: 
Share:

‘RRR’ మూవీలో ఎంఎం కీరవాణి స్వరపరిచిన ‘‘నాటు నాటు’’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడమే కాదు.. ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సాధించేసింది. ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో సంగీత దర్శకుడు కీరవాణి.. తాను కార్పెంటర్స్ పాటలు వింటూ పెరిగానని, ఇప్పుడు ఆస్కార్స్ అందుకొనే స్థాయికి వచ్చానని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన ఒక పాట కూడా పాడి వినిపించారు. అయితే, అది ఆయన స్వరపరిచినది కాదు.. కార్పెంట్సర్స్‌లోని ‘‘టాప్ ఆఫ్ ది వరల్డ్’’లో అనే ఫేమస్ సాంగ్. దాన్నే ఆయన ఆస్కార్ వేదికపై రిక్రియేట్ చేసి వినిపించారు. అందుకే, ఆ పాట వినగానే.. హాలీవుడ్ సెలబ్రిటీలంతో సంతోషంతో కేరింతలు కొట్టారు. కిరవాణిని అభినందించారు. మొత్తానికి వేదికపై కూడా మంచి మార్కులు కొట్టేశారు కీరవాణి. 

70వ దశకంలో భలే ఫేమస్

క్యారెన్, రిచర్డ్ కార్పెంటర్ అనే అన్నా చెల్లెళ్లు క్రియేట్ చేసిందే ఈ కార్పెంటర్స్. రిచర్డ్ ఆర్కెస్ట్రా స్కిల్స్‌కు క్యారెన్ వాయిస్ తోడైంది. ఇంకేముంది, కొద్ది రోజుల్లోనే వారు తమ పాటలతో శ్రోతలను మంత్రముగ్దులను చేశారు. అవి రేడియోల్లో కూడా ప్రసారం కావడంతో ‘కార్పెంటర్స్’కు బోలెడంత క్రేజ్ వచ్చింది. ‘కార్పెంటర్స్’ నుంచి వచ్చిన పాటల్లో ‘‘టాప్ ఆఫ్ ది వరల్డ్’ ట్యూన్ బాగా ఫేమస్ అయ్యింది. ఆ పాట ఇప్పటికీ అక్కడ ప్రతి ఇంట్లో మార్మోగుతూనే ఉంటుంది. అందుకే, కీరవాణి.. స్పీచ్‌కు బదులుగా, ఆ పాటను ఎంపిక చేసుకున్నారు. అక్కడి ప్రజల మనసు దోచుకున్నారు. ఆర్ఆర్ఆర్ ద్వారా రాజమౌళి ఎంతోమంది భారతీయులను గర్వడపడేలా చేశారంటూ కీరవాణి వెల్లడించారు.

బెస్ట్ ఒరిజనల్ సాంగ్’ కేటగిరిలో ‘‘నాటు నాటు’’కు అవార్డు

బెస్ట్ ఒరిజినల్ సాంగ్' (ఉత్తమ పాట) విభాగంలో 'నాటు నాటు'కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, ఆ మాటకు వస్తే తొలి భారతీయ సినిమా పాటగా 'నాటు నాటు...' చరిత్ర సృష్టించింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. లెజెండరీ దర్శకుడు సత్యజిత్ రేకు గౌరవ ఆస్కార్ ఇచ్చారు. ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన 'జయహో' పాటకు ఆస్కార్ వచ్చింది. అయితే, అది ఇండియన్ సినిమాలో పాట కాదు. హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన ఇంగ్లీష్ సినిమా 'స్లమ్ డాగ్ మిలినియర్'లోది.

'నాటు నాటు...' పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఎంఎం కీరవాణి స్వరపరచిన గీతమిది. ఈ పాటలో ఎన్టీఆర్ లిరిక్స్ కీరవాణి తనయుడు కాల భైరవ పాడగా... రామ్ చరణ్ లిరిక్స్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా 'నాటు నాటు...' పాటకు అభిమాని. అమెరికాలో రాజమౌళిని కలిసిన ఆయన ఆ విషయం చెప్పడంతో 'దేవుడికి నాటు నాటు నచ్చింది' అని సంతోషం వ్యక్తం చేశారు. 

Published at : 13 Mar 2023 03:39 PM (IST) Tags: Naatu Naatu Song 2023 Oscars 2023 Keeravani Song Best Original Song in Oscars

సంబంధిత కథనాలు

అప్పట్లోనే టూపీస్ బికినీ - అప్పుడు ఎంతో కష్టపడ్డాం, మాధవికి రాధ ప్రశంసలు

అప్పట్లోనే టూపీస్ బికినీ - అప్పుడు ఎంతో కష్టపడ్డాం, మాధవికి రాధ ప్రశంసలు

ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన

ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుంచి బిగ్ అప్డేట్, ఉగాదికి ఫస్ట్ సింగిల్ సాంగ్

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుంచి బిగ్ అప్డేట్, ఉగాదికి ఫస్ట్ సింగిల్ సాంగ్

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా