Kantara Chapter 1 Pre Release Event: రిషబ్ శెట్టి కోసం ఎన్టీఆర్... 'కాంతార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా - ఎప్పుడంటే?
NTR for Rishab Shetty: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు వాళ్లిద్దరూ ఒక్క స్టేజిపై, 'కాంతార ఏ లెజెండ్' ప్రీ రిలీజ్ వేదికపై సందడి చేయనున్నారు.

పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో 'కాంతార ఏ లెజెండ్' (Kantara Chapter 1) ఒకటి. కన్నడ కోసం తీసిన 'కాంతార' ఇతర భాషల్లో కూడా భారీ విజయం సాధించింది. దాంతో ఇప్పుడు ప్రీక్వెల్ తీశారు. ఆ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ సందడి చేయనున్నారు.
'కాంతార: ఏ లెజెండ్' ప్రీ రిలీజ్ అతిథిగా ఎన్టీఆర్!
Kantara A Legend Chapter 1 Pre Release Event Date: రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు 'కాంతార'కు ప్రీక్వెల్‌గా తన దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా 'కాంతార: ఏ లెజెండ్'. అక్టోబర్ 2న పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ వస్తున్నారు.
సెప్టెంబర్ 28న హైదరాబాద్ సిటీలో జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని దర్శక నిర్మాతలతో పాటు చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ పేర్కొంది.
Also Read: ఏఐ ఫోటోలు కాదు... ఒరిజినల్స్ ఇవిగో, షాక్ ఇచ్చిన సాయి పల్లవి
View this post on Instagram
రిషబ్ శెట్టి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మధ్య స్నేహం, అనుబంధం ఉన్నాయి. ఎన్టీఆర్ తల్లిది కర్ణాటక. అందువల్ల ఆయనకు కన్నడ వచ్చు. కన్నడ సినిమాలు చూస్తారు. ఎన్టీఆర్ అంటే రిషబ్ శెట్టికి ఇష్టం కూడా! ఆ మధ్య కుటుంబంలో కర్ణాటకలో దేవాలయాలకు ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు రిషబ్ శెట్టి ఫ్యామిలీ వెన్నంటి ఉండటంతో పాటు దగ్గరుండి అన్నీ చూసుకుంది. ఇప్పుడు రిషబ్ శెట్టి కోసం 'కాంతార ఏ లెజెండ్' ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ వస్తున్నారు.
రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్!
'కాంతార'లో రిషబ్ శెట్టి సరసన సప్తమీ గౌడ నటించారు. అయితే... ఇప్పుడు 'కాంతార ఏ లెజెండ్'లో జరిగే కథ వేరు. ఇది ప్రీక్వెల్. ఇందులో యువరాణిగా రుక్మిణీ వసంత్ నటించారు. దిల్షాన్ దేవయ్య మరొక క్యారెక్టర్ చేశారు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు.
Also Read: అమెరికాలో పవన్ కళ్యాణ్ పరువు తీశారా? ఫ్యాన్స్ చేసిందేమిటి? ఏం జరుగుతోంది?




















