Sai Pallavi Original Swimsuit Photo: ఏఐ ఫోటోలు కాదు... ఒరిజినల్స్ ఇవిగో, షాక్ ఇచ్చిన సాయి పల్లవి
Sai Pallavi Bikini News: సాయి పల్లవి బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేక్షకుల్లో చర్చకు దారి తీశాయి. అది సాయి పల్లవి దృష్టి వరకు వెళ్లినట్టు ఉంది. అందరికీ షాక్ ఇచ్చేలా ఆమె పోస్ట్ చేశారు.

Sai Pallavi Bikini News Real Or Fake: బికినీలో సాయి పల్లవి ఫోటోలు తెలుగుతో పాటు తమిళ, హిందీ ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సినిమాల్లో మాత్రమే కాదు... బయటకు కూడా ఎప్పుడూ హుందాగా, పద్ధతైన దుస్తులు ధరించే సాయి పల్లవిని ఒక్కసారిగా బికినీలో చూసి జనాలు షాక్ తిన్నారు. బికినీలో సాయి పల్లవి ఫోటోలు వైరల్ అయ్యాయి. అవి రియల్ ఫోటోలా? లేదంటే ఫేకా? అని సెర్చ్ చేసిన జనాలు ఉన్నారు. ఆ విషయం సాయి పల్లవి దృష్టి వరకు వెళ్లినట్టు ఉంది. దాంతో అందరికీ షాక్ ఇచ్చేలా ఆవిడ ఒక పోస్ట్ చేశారు.
ఏఐతో జనరేట్ చేసిన ఫోటోలు కాదు...
ఒరిజినల్ ఫోటోలు షేర్ చేసిన సాయి పల్లవి!
సాయి పల్లవి బికినీ ఫోటోలు ఒరిజినల్ కాదు... ఏఐ సాయంతో జనరేట్ చేసినవి. ప్రస్తుతం సాయి పల్లవి ఫ్యామిలీ విదేశాల్లో ఉంది. అక్కడ బీచ్ ఏరియాలో షికారు చేశారు. వాటర్ గేమ్స్ ఆడారు. స్విమ్మింగ్ చేశారు. ఫారిన్ ట్రిప్ ఫోటోలను సాయి పల్లవి చెల్లెలు పూజా కణ్ణన్ ఆల్మోస్ట్ వారం కిందట సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏఐ సాయంతో సాయి పల్లవి బికినీలో ఫోటోలు దిగినట్టు క్రియేట్ చేశారు. అదీ సంగతి!

ఏఐతో బికినీ ఫోటోలు క్రియేట్ చేసి, ఆ ఫేక్ పిక్స్ కొందరు వైరల్ చేయడంతో... తాను ధరించిన ఫుల్ డ్రస్ కనిపించేలా దిగిన ఫోటోతో పాటు స్విమ్మింగ్ ఫూల్ మూమెంట్స్, ఇతర టూర్ విశేషాలు తెలిసేలా సాయి పల్లవి ఒక వీడియో షేర్ చేశారు. దానికి ''పైన ఫోటోలు రియల్ ఇమేజెస్. ఏఐ జనరేటెడ్ కాదు'' అని క్యాప్షన్ ఇచ్చారు. అదీ సంగతి.
Also Read: అమెరికాలో పవన్ కళ్యాణ్ పరువు తీశారా? ఫ్యాన్స్ చేసిందేమిటి? ఏం జరుగుతోంది?
నువ్వేంటో మాకు తెలుసు... కంగారు పడొద్దు!
'ఏఐ జనరేటెడ్ ఫోటోలు కాదు... రియల్'' అంటూ సాయి పల్లవి చేసిన పోస్ట్ కింద ఆవిడకు ధైర్యం చెబుతూ కొందరు అభిమానులు కామెంట్లు చేశారు. ''నువ్వు ఏంటో మాకు తెలుసు. నీతోనే, నీ వెంటే మేం ఉన్నాం'' అని ఫ్యాన్స్ పేర్కొన్నారు.
View this post on Instagram
Sai Pallavi Upcoming Movies: ప్రస్తుతం సాయి పల్లవి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన 'మేరే రహో' అని ఓ సినిమా చేస్తున్నారు. రణబీర్ కపూర్ సరసన 'రామాయణ'లో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు.





















