NTR Brother In Law Movie First Look: 'శ్రీశ్రీశ్రీ రాజా వారు' - ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ లుక్ వచ్చింది! చూశారా?
Sri Sri Sri Rajavaaru Movie Update - Narne Nithiin First Look: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'శ్రీశ్రీశ్రీ రాజా వారు'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Narne Nithiin Debut Movie Sri Sri Sri Rajavaaru First Look: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నితిన్ కథానాయకుడిగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'శ్రీ శ్రీ శ్రీ రాజా వారు' టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'శతమానం భవతి' తీసిన సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నితిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జాతరలో స్టైల్‌గా సిగరెట్ వెలిగిస్తున్న నార్నే నితిన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఆయన మాసీగా కనిపించారు.
"నార్నే నితిన్ హీరోగా నేను చేస్తున్న కొత్త చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'. మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదం కోరుకుంటున్నాను" అని సతీష్ వేగేశ్న పేర్కొన్నారు.
నార్నే నితిన్ పూర్తి పేరు... నితిన్ చంద్ర. అయన ఎన్టీఆర్ సతీమణి ప్రణతికి స్వయానా సోదరుడు. నటనలో శిక్షణ తీసుకుని 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాదే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై రామారావు చింతపల్లి, ఎం.ఎస్. రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమణి పాటలు అందిస్తుండగా... కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: 'స్టాండప్ రాహుల్' రివ్యూ: రాజ్ తరుణ్ సినిమా నిలబడిందా? కిందకు పడిందా?
View this post on Instagram