Dulquer Salmaan's Salute Review - 'సెల్యూట్' రివ్యూ: హైదరాబాద్‌లో సముద్రం ఎక్కడుంది బాస్?

OTT Review - Dulquer Salmaan Malayalam Movie Salute Review In Telugu: దుల్కర్ సల్మాన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన సినిమా 'సెల్యూట్'. సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?

FOLLOW US: 

సినిమా రివ్యూ: 'సెల్యూట్'
రేటింగ్: 2/5
నటీనటులు: దుల్కర్ సల్మాన్, డయానా పెంటీ, మనోజ్ కె. జయన్ తదితరులు  
సినిమాటోగ్రఫీ: అస్లామ్ కె. పురయిల్ 
సంగీతం: జేక్స్ బిజాయ్  
నిర్మాత: దుల్కర్ సల్మాన్ 
దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్ 
విడుదల తేదీ: మార్చి 17, 2022 (సోనీ లివ్ ఓటీటీలో)

'సెల్యూట్'... దుల్కర్ సల్మాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మలయాళ సినిమా. పేరుకు మలయాళ సినిమా అయినప్పటికీ... తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ డబ్ చేశారు. 'సెల్యూట్'లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... దీనికి నిర్మాత కూడా దుల్కర్ సల్మానే. తొలుత ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... కరోనా మూడో వేవ్ కారణంగా సోనీ లివ్ ఓటీటీలో విడుదల చేశారు. దీనిపట్ల కేరళ థియేటర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దుల్కర్ సినిమాలను బంద్ చేయడంతో పాటు ఆయనపై బ్యాన్ విధించింది. ఇకపై దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాలను కేరళలోని థియేటర్లలో విడుదల చేయకూడదని నిర్ణయించింది. ప్రచార చిత్రాల కంటే... ఈ వివాదం కారణంగా 'సెల్యూట్'పై ప్రజల దృష్టి పడింది. మరి, సినిమా ఎలా (Salute Review) ఉంది?

కథ: అరవింద్ కరుణాకరన్ (దుల్కర్ సల్మాన్) ఒక ఎస్సై. సొంత అన్నయ్య, డీఎస్పీ అజిత్ కరుణాకరన్ (మనోజ్ కె. జయన్) స్ఫూర్తితో పోలీస్ అవుతాడు. అయితే... రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఒక హత్య కేసులో అమాయకుడైన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి రావడం అరవింద్‌కు నచ్చదు. లాంగ్ లీవ్ పెట్టి పోలీస్ ఉద్యోగానికి, అన్నయ్య - కుటుంబానికి దూరం అవుతాడు. అన్నయ్య కుమార్తె పెళ్లి కోసమని మళ్ళీ సొంతూరు వచ్చిన అరవింద్... పాత కేసు రీఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకు అన్నయ్య ఒప్పుకోడు. అమాయకుడికి యావజ్జీవ శిక్ష పడటానికి కారణం పోలీసులు అని తెలిస్తే... కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు అందరూ జైలుకు వెళ్ళాలి. తమ్ముడిని అడ్డుకోవడానికి అధికారాన్ని ఉపయోగిస్తాడు అన్నయ్య. అన్నదమ్ముల యుద్ధంలో ఎవరు గెలిచారు? అసలు హంతకుడు ఎవరో అరవింద్ కనుగొన్నారా? చివరకు, ఈ కథ ఏ కంచికి చేరింది? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ: ఖాకీ (పోలీస్) కథలకు, ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలకు మన దగ్గర ప్రేక్షకాదరణ బావుంటోంది. 'సింగం' లాంటి కమర్షియల్ ఫార్మాట్ పోలీస్ ఆఫీసర్లను మాత్రమే కాదు, 'ఖాకి'లో కార్తీ లాంటి హీరోలనూ ఇష్టపడుతున్నారు. 'నాంది' లాంటి సీరియస్ చిత్రాలనూ ఆదరిస్తున్నారు. 'సెల్యూట్' ప్రచార చిత్రాలు చూసినప్పుడు మంచి థ్రిల్లర్ సినిమా అనే ఫీలింగ్ కలిగింది. సినిమా ప్రారంభమైన కొంత సేపటి వరకూ అదే ఫీలింగ్ ఉంటుంది. కథ ముందుకు సాగే కొద్దీ ఆ ఫీలింగ్ తగ్గుతూ వస్తుంది. సినిమాను సాగదీస్తున్న ఫీలింగ్ మొదలవుతుంది. 

అమాయకుడిని పోలీసులు నేరస్తుడిగా చిత్రీకరిస్తే... అతడికి ఒక లాయర్ అండగా నిలిబడిన కథాంశంతో 'నాంది' రూపొందింది. కానీ, 'సెల్యూట్'లో అమాయకుడిని అరెస్ట్ చేయడం ఎస్సైకు ఇష్టం ఉండదు. పైగా, తనతో పాటు సొంత అన్నయ్య జైలుకు వెళ్లే అవకాశం ఉందని తెలిసినా వెనకడుగు వేయడు. విలన్ ఎవరో తెలియదు. మంచి డ్రామా, థ్రిల్లింగ్ అంశాలతో కథను నడిపే వీలు ఉంది. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. బహుశా... కథ విన్నప్పుడు ఈ అంశాలు నచ్చి దుల్కర్ సల్మాన్ సినిమా నిర్మించడానికి అంగీకరించారేమో! కథ ఎంత బావున్నా... కథనం నెమ్మదిగా ఉన్నప్పుడు, కథనం ఎంతకూ ముందుకు కదలనప్పుడు ఏం ప్రయోజనం? దర్శకుడు రోషన్ ఆండ్రూస్ కథనంపై దృష్టి సారించి ఉంటే బావుండేది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్, మ్యూజిక్ బావున్నాయి.

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ చక్కటి నటన కనబరిచారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన అండర్ ప్లే చేసిన తీరు, ఎమోషన్స్ పలికించిన విధానం బావుంది. దుల్కర్ అన్నయ్య గా మనోజ్ కె. జయన్ పాత్ర పరిధి మేరకు చేశారు. హీరోయిన్ డయానా పెంటీ పాత్ర ఉన్నా... లేకున్నా కథలో పెద్ద మార్పు ఏమీ ఉండదు. నటిగా ఆమె చేసింది కూడా ఏమీ లేదు. లుక్స్ పరంగా అందంగా కనిపించారు. అంతే! మిగతా నటీనటుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు, గుర్తుండే పాత్రలు లేవని చెప్పాలి.

'సెల్యూట్' గురించి చెప్పాల్సి వస్తే... ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కానీ, థ్రిల్ ఇచ్చే అంశాలు లేవు. డ్రామా ఎక్కువ ఉంది. ఒక దశలో ఆ డ్రామా ఎటు వెళుతోందో తెలియని పరిస్థితి. హీరో లాంగ్ లీవ్ పెట్టి, మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేవరకూ కథ ముందుకు కదల్లేదు. మధ్యలో సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా లేవు. మరీ నిదానంగా సాగినట్టు ఉంటుంది. అయితే... ప్రీ క్లైమాక్స్ నుంచి కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. డిఫరెంట్ క్లైమాక్స్ అందరికీ నచ్చకపోవచ్చు. 

Also Read: 'జేమ్స్‌' రివ్యూ: పవర్ స్టార్ ఆఖరి సినిమా ఎలా ఉంది?

'సెల్యూట్' సినిమా ఎలా ఉంది? అనేది పక్కన పెడితే... తెలుగు వెర్షన్ చూసిన వీక్షకులకు తెరపై చూసే విజువల్స్‌కు, చెప్పే ఊరి పేర్లకు పొంతన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, పట్టణాల పేర్లు చెప్పడం వల్ల తెలుగు సినిమా అయిపోదని డబ్బింగ్ వ్యవహారాలు చూసేవారు గుర్తిస్తే మంచిది. 'సెల్యూట్'లో హైదరాబాద్, బందరు, ఖమ్మం, కాజీపేట అంటూ డైలాగులు రాశారు. స్క్రీన్ మీద చూస్తే... కేరళ వాతావరణం కనిపిస్తుంది. ఖమ్మం, కాజీపేట అంటారు. కట్ చేస్తే... సముద్ర తీర ప్రాంతాల్లో సన్నివేశాలు ఉంటాయి. సెక్రటేరియట్ నుంచి ఉద్యోగిని తీసుకుని... బోటులో హీరో క్రైమ్ స్పాట్‌కు వెళతారు. ఈ సీన్స్ చూసినప్పుడు 'ఖమ్మం, హైదరాబాద్‌లో సముద్రం ఎక్కడ ఉంది బాస్?' అనిపిస్తుంది.

Also Read: 'మారన్' రివ్యూ: కార్తీక్, ధనుష్ కలిసి ఇలా చేశారేంటి?

Published at : 18 Mar 2022 06:13 AM (IST) Tags: ABPDesamReview Salute Movie Review Salute Movie Telugu Review Salute Movie Review in Telugu Salute Review Malayalam Movie Salute Review In Telugu Malayalam Movie Salute Review సెల్యూట్ మూవీ రివ్యూ

సంబంధిత కథనాలు

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?

F3 Movie Review  - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

టాప్ స్టోరీస్

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు,  నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!