Niharika Konidela : నేనేం చేసినా కామెంట్స్ వస్తూనే ఉంటాయి - అదే నా డ్రీమ్... విమర్శలపై మెగా డాటర్ రియాక్షన్
Niharika Reaction : ఎవరెన్ని కామెంట్స్ చేసినా తాను చేయాలనుకున్నదే చేస్తానని చెప్పారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు.

Niharika Konidela Reaction About Her Career Trollings : తాను విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela). రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో... ఆమె కెరీర్ ప్రారంభంలో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడారు.
'ఏం చేసినా అంటూనే ఉంటారు'
నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన టైంలో ఎన్నో విమర్శలు వచ్చినట్లు తెలిపారు నిహారిక. 'కమిటీ కుర్రోళ్లు మూవీతో 15 మంది కొత్తవాళ్లను ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడు చాలా మంది విమర్శించారు. ఇదంతా ఎందుకు చేస్తున్నావ్? తెలిసిన వారితో చేసుకోవచ్చు కదా అని అన్నారు. రాకాస చేస్తుంటే కమిటీ కుర్రోళ్ల లాంటి మంచి సినిమా చెయ్యొచ్చు కదా. అని అన్నారు. ఎందుకు మనకీ వీఎఫ్ఎక్స్ అంతా... యంగ్ యూత్ వంటి స్టోరీస్ చెయ్యొచ్చు కదా అని అన్నారు.
చిన్న చిన్న వాళ్లతో చేసుకోవచ్చు కదా. ఫ్యామిలీ వాళ్లతో ఎందుకు చేస్తున్నావ్ అని అడుగుతున్నారు. నేనేం చేసినా కామెంట్స్ చేసే వారు చేస్తూనే ఉన్నారు. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటాను. నిర్మాతగా ప్రతీ సినిమా నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను.' అంటూ చెప్పారు.
Also Read : తండ్రి బిజినెస్ చూసి కొడుకు షాక్ - ఓటీటీలోకి వచ్చేసిన 'హే బల్వంత్'... ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
'అదే నా డ్రీమ్'
కొణిదెల ఫ్యామిలీ నాకు ఎంత ముఖ్యమో తన బ్యానర్ పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యమని అన్నారు నిహారిక. 'పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీని చూస్తుంటే నాకు మదర్ ఫీలింగ్ కలుగుతుంది. నాకు వీఎఫ్ఎక్స్ గురించి ఏమీ తెలీదు. రాకాస స్టోరీ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తుంటేనే చాలా మంది చెప్పారు. 'పెద్ద పెద్ద సినిమా మేకర్సే వీఎఫ్ఎక్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. మీది చిన్న సినిమా బడ్జెట్. చాలా ఇబ్బంది పడతారు చూసుకోండి.' అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.
మాకు తెలిసినంత వరకూ 100 శాతం కష్టపడతాం. ఓ మంచి సినిమా తీశాం. జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రమోట్ చేశాం. ఇంటింటికీ వెళ్లి సినిమా చూపించడానికి రెడీ. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో భాగమైన అందరికీ సొంతిల్లు, కారు ఉండాలి. వాళ్లు ఫ్యామిలీస్‌తో ట్రిప్స్‌కు వెళ్తూనే ఉండాలి.' అని అన్నారు.
రాకాస (Rakasa) మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించగా... సంగీత్ శోభన్ (Sangeeth Sobhan) సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అమన్, అన్నపూర్ణ, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, జబర్దస్త్ రోహిణి, వాసు ఇంటూరి, నైంటీస్ ఫేం రోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించారు. ఏప్రిల్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
Also Read : ఓటీటీలోకి రాధిక హిట్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















