News
News
X

NBK107 Update : బాలకృష్ణ ఒక్కసారి డిసైడ్ అయ్యాక తిరుగుంటుందా?

నట సింహం నందమూరి బాలకృష్ణ అతి త్వరలో తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

FOLLOW US: 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద సినిమాల షూటింగులు జరగడం లేదు. నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం కారణంగా కొన్ని రోజుల నుంచి తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక షూటింగులు ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడుతోందని టాక్.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ నెల 24 నుంచి ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి, టాలీవుడ్ బంద్ కారణంగా షెడ్యూల్ వాయిదా వేస్తే ఎలా ఉంటుందని దర్శక -నిర్మాతల మధ్య చర్చ జరిగిందట. ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ స్టార్ట్ చేయాలని బాలకృష్ణ చెప్పడంతో ఆగస్టు 24న టర్కీ వెళ్లాలని డిసైడ్ అయ్యారట. అక్టోబర్ మొదటి వారం వరకూ అక్కడే షూటింగ్ జరుగుతుందని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

బాలకృష్ణ షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అవ్వడంతో బంద్‌కు పిలుపు ఇచ్చిన నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. నేడు నిర్మాతలు సమావేశం కానున్నారు. బంద్ మీద మరొకసారి డిస్కషన్ చేయనున్నారు.

బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలో శ్రుతీ హాసన్ (Shruti Hassan) కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ హీరోయిన్ హానీ రోజ్ కూడా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. మోడల్ కమ్ హీరోయిన్, 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

చిరు సినిమా వెనక్కి?
బాలకృష్ణ 107వ సినిమాతో పాటు చిరంజీవి 154 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడు సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తుండటంతో చిరు సినిమా వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని, సంక్రాంతి బరి నుంచి మెగా154 తప్పుకోవచ్చని ఇండస్ట్రీ గుసగుస.

మూడు టైటిల్స్‌లో బాలకృష్ణ ఓటు దేనికి?
NBK107 చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'జై బాలయ్య', 'అన్న గారు', 'రెడ్డి గారు' టైటిల్స్ (NBK107 Title) పరిశీలనలో ఉన్నాయట. ఈ మూడింటిలో బాలకృష్ణ దేనికి ఓటు వేస్తే... దాన్ని అధికారికంగా వెల్లడించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని టాక్. నందమూరి అభిమానులకు 'అన్నగారు' టైటిల్ బాగా నచ్చింది. బాలకృష్ణ తండ్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావును తెలుగు ప్రజలు ముద్దుగా 'అన్నగారు' అని పిలుస్తారు. అందుకని, అభిమానులు ఆ టైటిల్ ఖరారు చేయాలని కోరుకుంటున్నారు.  

Also Read : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై NBK 107 తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Published at : 17 Aug 2022 08:54 AM (IST) Tags: Nandamuri Balakrishna Gopichand Malineni Shruti Hassan NBK107 update Balakrishna Turkey

సంబంధిత కథనాలు

జోరు వాన, అందమైన లోకేషన్లలో ‘కృష్ణ వింద విహారి’ షూటింగ్, ఆకట్టుకుంటున్న షెర్లీ సేతియా Vlog

జోరు వాన, అందమైన లోకేషన్లలో ‘కృష్ణ వింద విహారి’ షూటింగ్, ఆకట్టుకుంటున్న షెర్లీ సేతియా Vlog

Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?

Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?

Godfather First Review : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్

Godfather First Review : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Dooralaina Theeralaina: 'ది ఘోస్ట్' - రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ అదిరిందిగా!

Dooralaina Theeralaina: 'ది ఘోస్ట్' - రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ అదిరిందిగా!

టాప్ స్టోరీస్

FIR On Srikalahasti CI : చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

FIR On Srikalahasti CI :  చిక్కుల్లో  శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !