అన్వేషించండి

Idupu Kayitham: సిగ్గుతో తల దించుకోవాలి... ఇడుపు కాయితాన్ని జాతీయ సమస్యగా మారుస్తారా? టైటిల్ కాంట్రవర్సీపై నరేష్

Naresh VK On Idupu Kayitham Controversy: 'ఇడుపు కాయితం' టైటిల్ కాంట్రవర్సీను జాతీయ సమస్యగా మార్చేశారని సీనియర్ హీరో, నటుడు నరేష్ విజయకృష్ణ అన్నారు. ఈ వివాదంపై ఆయన స్పందించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'ఇడుపు కాయితం' టైటిల్ అర్థంపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది.
  • రాష్ట్ర స్థాయిలో రాజకీయ విమర్శలకు టైటిల్ వివాదం దారితీసింది.
  • నరేష్ తెలుగు మాండలికాలను గౌరవించాలని, వివాదం ముగించాలని కోరారు.

Naresh VK Video About Idupu Kayitham Title Controversy: ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో 'బన్నీ' వాస్, సుకుమార్ సతీమణి తబిత నిర్మిస్తున్న 'ఇడుపు కాయితం' ఇటీవల పూజతో ప్రారంభమైంది. అయితే... ఆ టైటిల్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. నెటిజన్స్ కొందరు టైటిల్ అర్థం కాలేదని, సబ్ టైటిల్స్ వేస్తారా? అంటూ నెగటివ్‌గా స్పందించడంతో వివాదం పెద్దది అయ్యింది. దానిపై సీనియర్ హీరో, నటుడు నరేష్ విజయకృష్ణ స్పందించారు.

ఇడుపు కాయితాన్ని జాతీయ సమస్యగా మార్చేశారు! 
'ఇడుపు కాయితం' టైటిల్ అర్థం కాలేదని, సబ్ టైటిల్స్ వేసి విడుదల చేస్తే ఆంధ్ర ప్రాంత ప్రజలు హ్యాపీగా ఫీలవుతామని ఓ నెటిజన్ చేసిన ట్వీట్, 'ఆంధ్ర వర్సెస్ తెలంగాణ'గా సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దారి తీసింది. ఆఖరికి, కేసీఆర్ కుమార్తె - టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యక్తిగత విమర్శలు ఈ వివాదాన్ని వాడుకున్నారు. 'ఇడుపు కాయితం' అంటే ఏమిటో అర్థం కాకపోతే పవన్ కళ్యాణ్‌ను అడగాలని పర్సనల్ లైఫ్ టార్గెట్ చేశారు కవిత. పవన్ మూడు పెళ్లిళ్లు - విడాకులపై ఆమె వ్యంగ్యంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఓ టైటిల్‌ను సామాన్య ప్రజలు లేదా కొందరు నెటిజన్లు 'జాతీయ సమస్య'గా మార్చడంపై నరేష్ విజయకృష్ణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

''తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర.. ఏ ప్రాంతపు మాండలికం అయినా సరే తెలుగు భాషలోని గొప్పదనానికి నిదర్శనం. మనకి మనం మన సొంత భాష, మాండలీకాలను అవమానపరుచుకోవడం అంటే... తెలుగువాడిగా సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం'' అని నరేష్ విజయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మన భాషను మనం గౌరవించుకోవాలి తప్ప... ఇలా విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

Also ReadSambarala Yeti Gattu - సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

కరుప్పు, కాంతార సినిమాలను చూశారుగా
సినిమాను సినిమాగానే చూడాలని నరేష్ విజయకృష్ణ పేర్కొన్నారు. తమిళ, కన్నడ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూస్తున్న విజయన్ని ఆయన గుర్తు చేశారు. ''మన ప్రేక్షకులకు 'కరుప్పు', 'కాంతార' టైటిళ్లకు అర్థాలు తెలియకపోయినా ఆదరించారు. ఘన విజయం అందించారు. అలాంటప్పుడు మన తెలుగు భాషలోని ఒక పదాన్ని టైటిల్‌గా పెడితే వివాదం చేయడం సమంజసం కాదు. సినిమాను సినిమాగా చూడాలి'' అని నరేష్ విజయకృష్ణ కోరారు.

Also ReadMaa Inti Bangaram Collections Day 9: సమంత దూకుడుకు సాటేది... తొమ్మిదో రోజూ బంగారం కలెక్షన్స్ సూపరే

తెలుగు భాషా సంఘం చొరవ తీసుకోవాలి!
'ఇడుపు కాయితం' టైటిల్ వివాదానికి వెంటనే ముగింపు పలకాలని నరేష్ విజయకృష్ణ విన్నవించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ వివాదంపై తెలుగు భాషా సంఘం చొరవ తీసుకుని చర్చించాలి. ప్రభుత్వాలతో పాటు మీడియా, నెటిజన్లు అందరూ కలిసి ఇకనైనా ఈ వివాదానికి ముగింపు పలకాలి. మన సొంత భాషను మనమే నరుక్కుంటే అది మనకే నష్టం'' అని హెచ్చరించారు. తెలుగు భాషను కాపాడుకుందామని, భాషతో పాటు మాండలికాలను కించపరిచే ధోరణికి ముగింపు పలకాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు నరేష్.

Also Read: Haiwaan Release Date -'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్

Frequently Asked Questions

'ఇడుపు కాయితం' టైటిల్ వివాదానికి ప్రధాన కారణం ఏమిటి?

'ఇడుపు కాయితం' అనే టైటిల్ అర్థం కాలేదని, దీనికి సబ్ టైటిల్స్ కావాలని నెటిజన్లు స్పందించడంతో ఈ వివాదం మొదలైంది. ఇది ఆంద్ర-తెలంగాణ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

'ఇడుపు కాయితం' టైటిల్ వివాదంపై నరేష్ విజయకృష్ణ అభిప్రాయం ఏమిటి?

ప్రాంతీయ మాండలికాలు తెలుగు భాష గొప్పతనానికి నిదర్శనమని నరేష్ పేర్కొన్నారు. మన భాషను మనం అవమానించుకోవడం సిగ్గుచేటని, సినిమాను సినిమాగానే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ టైటిల్ వివాదం రాజకీయంగా ఎలా మారింది?

కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈ వివాదాన్ని వాడుకొని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ఆమె వ్యంగ్యంగా ప్రస్తావించారు.

ఈ వివాదాన్ని ముగించడానికి నరేష్ విజయకృష్ణ ఏ పరిష్కారాన్ని సూచించారు?

తెలుగు భాషా సంఘం ఈ వివాదంపై చొరవ తీసుకుని చర్చించాలని నరేష్ కోరారు. ప్రభుత్వాలు, మీడియా, నెటిజన్లు కలిసి ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget