Naga Vamsi: సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!
సింగిల్ స్క్రీన్స్ గురించి ఇటీవల డిస్కషన్ జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నష్టాలు ఎదుర్కొంటున్నారని విమర్శలు వచ్చాయి. ఈ అంశంలో ఏసియన్ సునీల్ మీద నాగవంశీ కౌంటర్లు వేశారు.

సింగిల్ స్క్రీన్లు బతకాలని, పర్సెంటేజీల విధానం కొనసాగించాలని అంటూ టాలీవుడ్‌లో కొంత మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారు. ఇంకొంత మంది వారికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. అయితే ఈ క్రమంలో దిల్ రాజు, ఏసియన్ సునీల్, శిరీష్, సురేష్ బాబు, నాగవంశీ, యూవీ వంటి వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. తాజాగా నాగవంశీ అయితే ఏసియన్ సునీల్‌కు గట్టిగా కౌంటర్లు ఇచ్చినట్టు అనిపిస్తుంది.
'కింగ్‌డమ్' ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నాగవంశీ ఈ సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్సుల వివాదం మీద స్పందించారు. ఏసియన్ సునీల్ మీద నాగవంశీ నేరుగానే సెటైర్లు వేశారు. ''మల్టీప్లెక్సులు కంటిన్యూగా కడుతుంది ఆయనే... మళ్లీ సింగిల్ స్క్రీన్ల కోసం పోరాడుతుందీ ఆయనే... జనాలు సింగిల్ స్క్రీన్లకు రావడం లేదు... మల్టీప్లెక్సులకు మొగ్గు చూపుతున్నారని తెలుసుకునే కదా ఆయన మల్టీప్లెక్సుల్ని కడుతూనే ఉన్నారం''టూ నాగవంశీ కౌంటర్లు వేశారు.
Also Read: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా
సింగిల్ స్క్రీన్లను సరిగ్గా మెయింటైన్ చేయక పోవడంతోనే జనాలు అక్కడికి వెళ్లడం లేదు.. బాగా మెయింటైన్ చేస్తున్న సింగిల్ స్క్రీన్లు అద్భుతంగా నడుస్తున్నాయని నాగవంశీ తెలిపారు. ముందు సింగిల్ స్క్రీన్ మెయింటైన్స్ మీద దృష్టి పెట్టండంటూ నాగవంశీ కౌంటర్లు వేశారు.
Daily sales of #Kingdom on BMS
— ABP Desam (@ABPDesam) July 28, 2025
Sunday: 29.39K#VijayDeverakonda #BhagyashriBorse #KingdomOnJuly31st pic.twitter.com/l90WLLwccr
నాగవంశీ నిర్మించిన 'కింగ్‌డమ్' ఈ గురువారమే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఎప్పుడో రావాల్సిన ఈ మూవీ పలు మార్లు వాయిదాలు పడుతూ ఈ జూలై 31న ప్రేక్షకుల ముందుకు అయితే రాబోతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో అంచనాలు అయితే పెంచేసింది చిత్ర యూనిట్. మరి ఈ మూవీతో విజయ్, నాగవంశీ, గౌతమ్ తిన్ననూరికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
Also Read: టాలీవుడ్‌లోకి మరో వారసురాలు... నిర్మాతగా మురళీ మోహన్ కుమార్తె... ప్రియాంక ఎంట్రీ





















