Sam CS: ఆడియన్స్‌కు పెట్టాల్సింది దద్దోజనం కాదు, బిర్యానీ... ప్రజెంట్ సాంగ్స్‌పై 'పుష్ప 2' మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Sam CS : తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ మాట్లాడుతూ ఈ తరం మ్యూజిక్ లో క్వాలిటీతో వస్తోంది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ 'పుష్ప 2' మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివాదంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. అయితే తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా ఇప్పటి తరం మ్యూజిక్ లో పెద్దగా క్వాలిటీ లేదంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దద్దోజనం కాదు... బిర్యానీ పెట్టాలి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనన సామ్ సీఎస్ "మనము ఆడియన్స్ కి దద్దోజనం పెడుతున్నాము. బిర్యానీ పెట్టట్లేదు... ఈ రోజుల్లో ఓన్లీ ఫాస్ట్ బీట్ సాంగ్స్ మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఆ వైబ్ కేవలం 15 నిమిషాల్లోనే మాయం అవుతుంది. ఇళయరాజా, విద్యాసాగర్ వంటి వారి వింటేజ్ సాంగ్స్ ని మనం ఇప్పటికీ ఇష్టపడుతున్నాం. ఈ రోజుల్లో మ్యూజిక్ అనేది చాలా లో క్వాలిటీతో వస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారో తెలియదు కానీ, తెగ వైరల్ అవుతున్నాయి.
"We are just feeding Curd ride to the audience and not biryani. Nowadays only fast beat songs are coming & those vibe gets over in 15 mins. We loved those vintage songs of Deva/ARR/Ilaiyaraaja/vidyasagar/U1. Now Music quality has became very low"
— AmuthaBharathi (@CinemaWithAB) February 4, 2025
- #SamCSpic.twitter.com/CpzB8S1PkO
'పుష్ప 2' మ్యూజిక్ పంచాయతీ
'పుష్ప 2' మూవీ మ్యూజిక్ డైరెక్టర్ల వివాదం కారణంగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ పేరు మార్మోగిపోయింది. ఈ మూవీ మ్యూజిక్ క్రెడిట్ మొత్తాన్ని రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కు ఇవ్వడం ఈ వివాదానికి దారి తీసింది. 'పుష్ప 2' మూవీ రిలీజ్ కి ముందు తమన్ తో పాటు సామ్ సీఎస్ ఈ మూవీకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించామని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీలో హైలెట్ పార్ట్ క్లైమాక్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారు? అనే వివాదం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
Also Read: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే
'పుష్ప 2' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారని, ఇరగదీసారని ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. కానీ మిగతా ఇద్దరు సంగీత దర్శకులు తమన్, సామ్ సీఎస్ గురించి ఆయన మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. అయితే 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన తర్వాత తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ తనకు అవకాశం ఇచ్చిన 'పుష్ప 2' నిర్మాతలు, డైరెక్టర్, ఎడిటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. అందులో తను సినిమా క్లైమాక్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశానని ఆయన చెప్పారు. దీంతో పంచాయతీ మొదలైంది.
మూవీ క్రెడిట్స్ లో మాత్రం మేకర్స్ దేవిశ్రీ ప్రసాద్ పేరును మెయిన్ గా వేశారు. సామ్ సీఎస్ పేరును అడిషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తావించారు. అయితే దీనిపై రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాగ్రౌండ్ స్కోర్ లోకి 99 శాతం తానే వర్క్ చేస్తానని కొన్ని కీలక సన్నివేశాలకు మాత్రమే దేవిశ్రీ స్కోర్ చేశారని చెప్పారు. అలాగే టి సిరీస్ యూట్యూబ్ ఛానల్ లో 'పుష్ప 2' మూవీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ ని విడుదల చేస్తూ, మొత్తం 33 నిమిషాల జ్యూక్ బాక్స్ లో ప్రతి సౌండ్ ట్రాక్ ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినట్టు క్రెడిట్ ఇచ్చారు. ఇంకేముంది ఆ వెంటనే సామ్ సీఎస్ తన పోస్టులో "పుష్ప 2 ఓఎస్టి... లోడింగ్ 99%" అని ప్రకటించడంతో వివాదం తిరిగింది. అయితే ఈ వివాదంపై ఎక్కడా దర్శకుడు లేదా నిర్మాతలు మాట్లాడకపోవడం గమనార్హం.
Also Read: పవన్, మహేష్ సినిమాలతో 100 కోట్ల నష్టం... రమేష్‌దే తప్పు - బండ్ల గణేష్ వైరల్ ట్వీట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

