అన్వేషించండి

Mukesh Khanna: వాళ్లెవరూ ‘శక్తిమాన్’ పాత్రకు కరెక్ట్ కాదు - బాలీవుడ్ స్టార్లపై ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలు

Shaktimaan: ఇండియన్ సూపర్ హీరో అయిన ‘శక్తిమాన్’ గురించి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాలని బాలీవుడ్ మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కానీ అందులో హీరో ఎవరు అనే విషయంపై తాజాగా ముఖేష్ ఖన్నా కామెంట్స్ చేశారు.

Mukesh Khanna about Shaktimaan: హాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ఇండియన్ భాషల్లో కూడా అప్పుడప్పుడు సూపర్ హీరో సినిమాలు అనేవి చాలానే తెరకెక్కాయి. కానీ అందులో కొన్ని మాత్రమే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా సెపరేట్ మార్క్‌ను క్రియేట్ చేయగలిగాయి. ఇక ఇండియన్ సూపర్ హీరోల్లో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న పాత్రల్లో ‘శక్తిమాన్’ కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్‌ను వెండితెరపైకి తీసుకురావాలని ముఖేష్ ఖన్నా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఈ పాత్ర కోసం రణవీర్ సింగ్‌ను ఎంపిక చేసినట్టుగా గత కొన్నిరోజులుగా వార్తలు బాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. కానీ అవన్నీ నిజం కాదని ముఖేష్ ఖన్నా క్లారిటీ ఇచ్చారు.

కరెక్ట్ కాదు..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ముఖేష్ ఖన్నా పాల్గొన్నారు. అక్కడే రణవీర్ సింగ్.. ‘శక్తిమాన్’గా నటిస్తున్నాడనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇప్పటికీ ఇందులో లీడ్ రోల్ చేసే నటుడి విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఎవరినీ ఫైనల్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్.. ఇలాంటి హీరోలు ఎవరూ ‘శక్తిమాన్’ పాత్ర చేయడానికి కరెక్ట్ కాదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ హీరోలంతా ఇండస్ట్రీలో తమకంటూ ఒక మార్క్ క్రియేట్ చేశారని, అందుకే అలాంటి వారు కొత్తగా సూపర్ హీరోల సినిమాల్లో నటించినా.. ఆ పాత్రకు అంతగా గుర్తింపు ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీరియల్‌లాగా కూడా..

‘శక్తిమాన్’ సినిమా కోసం బాలీవుడ్ స్టార్లు అందరినీ పక్కన పెట్టిన ముఖేష్ ఖన్నా.. ఒక కొత్త హీరోను ఈ సినిమాతో పరిచయం చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు బయటపెట్టారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు దగ్గరయ్యేలా నటించగల కొత్త నటుడిని ‘శక్తిమాన్’ కోసం ఎంపిక చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ ఇండియన్ హీరో సూపర్ హీరో పాత్రపై సినిమా మాత్రమే కాదు.. సీరియల్ గురించి చేయాలనే ఉద్దేశ్యంతో స్టార్ ఇండియా నెట్‌వర్క్‌తో చర్చలు కూడా జరిగాయని, కానీ ఎందుకో ఆ చర్చలు ముందుకు సాగలేదని ముఖేష్ తెలిపారు. శ్రద్ధ పెట్టి చేస్తే ‘శక్తిమాన్’ కూడా హాలీవుడ్‌లోని ‘యావెంజర్స్’ రేంజ్‌లో హిట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘డాన్’ విషయంలో కూడా..

ఇక ‘శక్తిమాన్’ పాత్రను పోషించే విషయంలో రణవీర్ సింగ్ అస్సలు కరెక్ట్ కాదని ముఖేష్ ఖన్నా మాత్రమే కాదు.. మరికొందరు బాలీవుడ్ పెద్దలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఈ హీరోపై అంతగా నెగిటివిటీ ఎందుకు ఏర్పడిందో అర్థం కావడం లేదంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇప్పటికే ‘డాన్’ ఫ్రాంచైజ్‌లో షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్‌ను హీరోగా ఎంపిక చేయడంతో బాలీవుడ్ బాద్‌షా ఫ్యాన్స్ అంతా తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా షారుఖ్ లేకుండా ‘డాన్‌’ను ఊహించుకోలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తను తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తానని పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాడు రణవీర్ సింగ్.

Also Read: 'మ్యూజిక్‌ మ్యాస్ట్రో' బయోపిక్ - ఇళయరాజాగా మేకోవరైన ధనుష్‌, ఎలా ఉన్నాడో చూడండి!  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget