Ilayaraja Biopic: 'మ్యూజిక్ మ్యాస్ట్రో' బయోపిక్ - ఇళయరాజాగా మేకోవరైన ధనుష్, ఎలా ఉన్నాడో చూడండి!
Dhanush: ఇళయరాజా బయోపిక్‌లోని హీరో ధనుష్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ధనుష్ పూర్తి మ్యూజిక్ మ్యాస్ట్రోలా మేకోవర్ అయ్యారు.
Dhanush Look From Ilayaraja Biopic: మ్యూజిక్ మ్యాస్ట్రో, లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్ (Ilayaraja Biopic) వెండితెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్ర తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ మూవీని ప్రారంభించారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇళయరాజా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ఆయనే తన బయోపిక్ ఫస్ట్‌లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి 'ఇళయరాజా: ద కింగ్ ఆఫ్ మ్యూజిక్' (Ilayaraja: The King Of Music)టైటిల్‌ని ఖరారు చేశారు. దీంతో ఈ బయోపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇటివల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ధనుష్ గెటప్‌ను రివీల్ చేయలేదు. ప్యాంటు షర్టుతో ఉన్న ధనుష్.. నడిరోడ్డుపై నిలుచుని కనిపించారు. కానీ ఆయన వెనక భాగాన్ని చూపించారు. అయితే తాజాగా ఈ చిత్రంలోని ధనుష్ లుక్ ఇదేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆయన పూర్తిగా ఇళయరాజాలో మెకోవర్ అయ్యారు. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే ఇది మూవీలోని రియల్ లుక్ కాదంటూ కొందరు. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన చిత్రమని, ఇది మూవీలో ధనుష్ లుక్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. మొత్తానికి ఇందులో ధనుష్ మాత్రం అచ్చం ఇళయరాజాలానే ఉన్నారు. కొత్తమంది అయితే ఇది ఇళయరాజానే అని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం స్పందించాల్సి ఉంది.
ఈ సినిమా ఆయనే మ్యూజిక్ అందిస్తున్నారా?
ఇళయరాజా బయోపిక్‌కు అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ధనుష్-అరుణ్ మాదేశ్వరన్ కాంబినేషన్ లో కెప్టెన్ మిల్లర్ తెరకెక్కగా మరోసారి ఇళయరాజా బయోపిక్ కోసం వీరిద్దరు మళ్లీ కలిశారు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యురీ మూవీస్ బ్యానర్లపై ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి అన్ని వివరాలు ఇచ్చిన మూవీ టీం సంగీత దర్శకుడు ఎవరనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. మొన్ని రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్‌లోనూ ఈ విషయం చెప్పలేదు. దీంతో ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ నిలిచింది.
Honoured @ilaiyaraaja sir 🙏🙏🙏 pic.twitter.com/UvMnWRuh9X
— Dhanush (@dhanushkraja) March 20, 2024
ఈ క్రమంలో తన బయోపిక్‌కు ఇళయరాజానే సంగీతం అందిస్తున్నారా? అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. లేదంటే మరొకరికి ఆ ఛాన్స్ ఇస్తారా అనే కామెంట్లు వస్తున్నాయి. అయితే, ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన ఇళయరాజాను కలిసిన విషయం తెలిసిందే. స్వయంగా ఇళయరాజానే దేవి ఇంటికి వెళ్లి ఆయన స్టూడియోను ప్రత్యేకంగా సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన డ్రీమ్ నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు దేవిశ్రీ.
Also Read: మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్ - వీడియో వైరల్