అన్వేషించండి

Mrunal Thakur: ధనుష్‌తో పెళ్ళి... అదీ ప్రేమికుల రోజున... ఇదీ మృణాల్ ఠాకూర్ రియాక్షన్ - ఆమె ఏం చెప్పిందంటే?

Mrunal Thakur On Dhanush Wedding Rumors: ధనుష్ తో తన ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించింది. పెళ్లి పుకార్లపై ఆమె రియాక్షన్ ఏమిటి? తాజా ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే?

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమ వ్యవహారం కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)తో ఆమె ప్రేమలో ఉందనే ప్రచారం చాలా బలంగా జరిగింది. అంతే కాదు... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి చేసుకుంటున్నారని ముహూర్తం కూడా ఖరారు చేశారు కొందరు. ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది సరసన నటించిన 'దో దివానే షహర్ మే' సినిమా ప్రమోషన్లలో మృణాల్ ఠాకూర్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ధనుష్‌తో ప్రేమ, ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లపై ఆమె స్పందించారు. Galatta Plusతో మాట్లాడుతూ పుకార్లకు స్పష్టత ఇచ్చారు.

ఏం చెప్పలేదు... కానీ నేను చెప్పినట్టు రాశారు - మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్‌ను పెళ్లి పుకార్ల గురించి ప్రశ్నించగా... ''నేనా? పెళ్లి చేసుకుంటున్నానా? లేదు. నాకు అయితే ఫిబ్రవరి 14న ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకుంటున్నట్లు అనిపించింది. నిజంగా వాళ్ళకు ఈ ఫిబ్రవరి 14న ఏప్రిల్ ఫూల్ డే. ఈ పుకార్లు ఎవరు ప్రారంభించారో నాకు తెలియదు. కానీ, నన్ను కోట్ చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. కానీ మృణాల్ చెప్పిందని వారు రాస్తున్నారు, అంటున్నారు. 'వావ్, ఇదేమిటి?' అనుకున్నాను'' అని 'సీతారామం' హీరోయిన్ తెలిపింది. పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో ప్రేమలో ఉన్నట్టూ ఖరారు చేయలేదు. మృణాల్ చెబుతున్నంత సేపూ సిద్ధాంత్ చతుర్వేది నవ్వు ఆపుకోలేకపోయాడు. సోషల్ మీడియాలో మృణాల్ వీడియో వైరల్ అవుతోంది.

Also Read: Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?

ధనుష్‌తో మృణాల్ ప్రేమ పుకార్లకు పునాది ఎక్కడ పడిందంటే?

ఇప్పటి వరకు అటు ధనుష్ గానీ, ఇటు మృణాల్ ఠాకూర్ గానీ ప్రేమ పుకార్లపై నేరుగా స్పందించింది లేదు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో కూడా ధనుష్ పేరు ఎవరూ తీయలేదు. కానీ, అక్కడ మాట్లాడినది ధనుష్ గురించి అని అందరికీ తెలుసు. అసలు ధనుష్ - మృణాల్ ఠాకూర్ ప్రేమ పుకార్లు ఎక్కడ మొదలు అయ్యాయి? అనే వివరాల్లోకి వెళితే... ధనుష్ నటించిన 'తేరే ఇష్క్ మే' సినిమా పార్టీకి హాజరైనప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి తొలుత పుకార్లు వచ్చాయి. ఆ పార్టీలో దిగిన మృణాల్, ధనుష్‌ల ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌కు ధనుష్ హాజరయ్యారు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత వారి ప్రేమ వ్యవహారం గురించి పుకార్లు మరింత పెరిగాయి.

Also ReadPeddi Overseas Rights: 'గేమ్ ఛేంజర్' vs 'పెద్ది'... డిజాస్టర్ తర్వాత ఓవర్సీస్‌లో రామ్ చరణ్ క్రేజ్ ఎలాగుంది?

మృణాల్, ధనుష్‌లు ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్నారనే 2026 ప్రారంభంలో పుకార్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ పుకార్లను మృణాల్ ఖండించింది. వృత్తిపరంగా మృణాల్‌కు 'జవానీ తో ఇష్క్ హోనా హై', 'పూజా మేరీ జాన్', 'డెకాయిట్' సినిమాలు ఉన్నాయి.

Also Readఓటీటీ లవర్స్‌కు అదిరిపోద్దీ వారం... బ్లాక్‌బస్టర్ హిట్స్ & ఒరిజినల్ ఫిలిమ్స్... ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు, ఈ వారం సందడి చేసే సినిమాలు & వెబ్ సిరీస్‌ల లిస్ట్

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget