అన్వేషించండి

OTT Releases This Week: ఓటీటీ లవర్స్‌కు అదిరిపోద్దీ వారం... బ్లాక్‌బస్టర్ హిట్స్ & ఒరిజినల్ ఫిలిమ్స్... ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే

OTT Releases Telugu Movies This Week: ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు... ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ చూడండి. సంక్రాంతి హిట్స్ నుంచి ఒరిజినల్ సినిమాల వరకు... ఏమున్నాయంటే?

థియేటర్లలో సంక్రాంతి సినిమాలు చూడటం మిస్ అయ్యారా? డోంట్ వర్రీ... ఈ వారం ఓటీటీ వేదికల్లోకి వస్తున్నాయి. ప్రైమ్ వీడియోలో శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి', జియో హాట్ స్టార్‌లో 'ది రాజా సాబ్' స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం మరో రెండు సంక్రాంతి హిట్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. మరొక సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి రానుంది. అసలు ఈ వారం ఓటీటీల్లో ఏయే సినిమాలు సందడి చేయనున్నాయో తెలుసుకోండి.

ఫిబ్రవరి 11న 'జీ5'లో చిరంజీవి సినిమా
Mana Shankara Vara Prasad Garu OTT Release Date: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ బరిలో 375 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. నయనతార కథానాయికగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రమిది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 'జీ5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ - ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Also ReadGovinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నవీన్ పోలిశెట్టి సినిమా
Anaganaga Oka Raju OTT Release Date: నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అనగనగా ఒక రాజు'. ఆయనకు జంటగా మీనాక్షి చౌదరి, కీలక పాత్రలో రావు రమేష్ నటించారు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Also ReadParasakthi Review Telugu - పరాశక్తి రివ్యూ: జీ5 ఓటీటీలో శివకార్తికేయన్ సినిమా... తెలుగు ప్రేక్షకులకు ఈ తమిళ సినిమా నచ్చుతుందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

ఈటీవీ విన్ ఓటీటీలో శివాజీ సినిమా ప్రీమియర్
Sampradayini Suppini Suddapoosani OTT Premiere Date: ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ '90స్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'తో శివాజీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఓ విధంగా ఆయన రీ ఎంట్రీ కూడా అది! అందులో 'సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని' పాట సూపర్ హిట్. ఇప్పుడు దాన్ని టైటిల్‌గా తీసుకుని శివాజీ సినిమా చేశారు. ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మించారు. ఆయనకు జంటగా హిట్ పెయిర్ లయ నటించారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రీమియర్ కానుందీ ఒరిజినల్ సినిమా. 

Also Read: Ayesha Khan: పీరియడ్స్‌లో 'ధురంధర్' సాంగ్ షూట్... 'షరారత్' చేసేటప్పుడు ఏడ్చిన ఆయేషా ఖాన్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

సోనీలివ్ ఓటీటీలోకి మలయాళీ మెడికో థ్రిల్లర్
Baby Girl OTT Release Date SonyLiv: జియో హాట్‌స్టార్ ఓటీటీలో నివిన్ పౌలి హీరోగా నటించిన 'సర్వం మాయ' స్ట్రీమింగ్ అవుతోంది. వీక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు నివిన్ పౌలీ ఓ ప్రత్యేక పాత్ర చేసిన మలయాళ సినిమా 'బేబీ గర్ల్' సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీ నుంచి వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. సంగీత ప్రతాప్, లిజి మోల్ జోస్, రుద్ర నటించిన ఈ సినిమాను తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానుంది.

Also ReadBarabar Premistha Controversy: బూతు పాటపై విమర్శలు... వెనక్కి తగ్గని యాటిట్యూడ్ స్టార్... అసలు ఏంటీ బరాబర్ కాంట్రవర్సీ?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony LIV (@sonylivindia)

సోనీలివ్‌లో సౌబిన్ షాహిర్ కొత్త సినిమా కూడా
Pathirathri OTT Release Date: 'మంజుమ్మల్ బాయ్స్', రజనీకాంత్ 'కూలీ'తో మన తెలుగు ప్రేక్షకుల్లోనూ పాపులరైన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. ఆయన ఓ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా 'పాతి రాత్రి'. సోనీలివ్ ఓటీటీలో ఫిబ్రవరి 13వ తేదీ నుంచి స్టీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తమిళ్, హిందీ, తెలుగు భాషల్లోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సన్ నెక్స్ట్ ఓటీటీలో 'నీలకంఠ' సైతం ఈ వారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also ReadWith Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

రెండు హాలీవుడ్ సినిమాలు, ఇటాలియన్ సిరీస్
ఓటీటీల్లోకి ఈ వారం వస్తున్న సినిమాల్లో రెండు హాలీవుడ్ హిట్స్ ఉన్నాయి. హారర్ థ్రిల్లర్ 'ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్' జియో హాట్ స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దానికి ఒక్క రోజు ముందు ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అదే ఓటీటీలో మరొక హాలీవుడ్ ఫిల్మ్ 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఇటాలియన్ డ్రామా సిరీస్ 'మోటార్ వ్యాలీ' స్ట్రీమింగ్ కానుంది.

Also Read: Renu Desai: ఏడేళ్ల వయసులో జరిగిన ఘటన... రేణూ దేశాయ్‌ నాన్ వెజ్ మానేయడానికి కారణం ఇదే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Oscars 2026 : ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Thaai Kizhavi OTT : ఓటీటీలోకి 50 కోట్ల 'తాయి కిళవి' - రాధిక డిఫరెంట్ రోల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి 50 కోట్ల 'తాయి కిళవి' - రాధిక డిఫరెంట్ రోల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Embed widget