Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Funky Movie Pre Release Business: 'మెకానిక్ రాకీ', 'లైలా' ఆశించిన విజయాలు సాధించలేదని విశ్వక్ సేన్ అంగీకరించాడు. ఆ రెండు ఫ్లాప్స్ తర్వాత 'ఫంకీ'తో కెరీర్ బెస్ట్ బిజినెస్ సాధించడం గ్రేట్.

యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ (Vishwak Sen)ది సపరేట్ స్టైల్. 'ఈ నగరానికి ఏమైంది' వంటి కల్ట్ హిట్‌లో నటించాడు. 'ఫలక్ నుమా దాస్' అంటూ మాస్ మూవీ చేసి హిట్ కొట్టాడు. దానికి డైరెక్షన్ కూడా చేశాడు. యంగ్ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ సొంతం చేసుకుని ప్రామిసింగ్ స్టార్ అనిపించుకున్నాడు. అయితే... 'మెకానిక్ రాకీ', 'లైలా' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ తగిలాయి. అవి ఆశించిన విజయాలు సాధించలేదని, ఫ్లాప్స్ అని విశ్వక్ సేన్ అంగీకరించాడు. రెండు డిజాస్టర్ మూవీస్ తర్వాత 'ఫంకీ'తో కెరీర్ బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించాడు.
ఎన్ని కోట్లకు 'ఫంకీ' రైట్స్ అమ్మారంటే?
Funky Pre Release Business: 'ఫంకీ' ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ... 13 కోట్లు. ఇది విశ్వక్ సేన్ కెరీర్ హయ్యస్ట్ బిజినెస్. అదీ బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ తర్వాత ఈ అమౌంట్ రావడం అంటే విశేషమే.
'ఫంకీ' బిజినెస్ బాగా జరగడం వెనుక విశ్వక్ సేన్ కాకుండా మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు నిర్మాత నాగవంశీ. సంక్రాంతికి 'అనగనగా ఒక రాజు'తో ఆయన హిట్ కొట్టారు. ఆ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కామెడీ జానర్ 'ఫంకీ'తో మరోసారి వస్తుండటం ట్రేడ్ సర్కిళ్లలో బజ్ నెలకొంది. అలాగే, దర్శకుడు కేవీ అనుదీప్ కూడా బిజినెస్ బాగా జరగడంలో కొంత హెల్ప్ అయ్యారు. శివకార్తికేయన్ 'ప్రిన్స్' యావరేజ్ అయ్యింది కానీ దానికి ముందు 'జాతి రత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ ఆయన ఖాతాలో ఉంది.
'ఫంకీ' వర్సెస్ 'లైలా' వర్సెస్ 'మెకానిక్ రాకీ'
Pre release business comparison of Funky Vs Laila Vs Mechanic Rocky: 'ఫంకీ'కి ముందు విశ్వక్ సేన్ నటించిన సినిమా 'లైలా'. అందులో లేడీ గెటప్ వేశాడీ యంగ్ హీరో. ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 8.20 కోట్లు మాత్రమే. దానికి ముందు విశ్వక్ సేన్ నుంచి వచ్చిన సినిమా 'మెకానిక్ రాకీ'. ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 8.50 కోట్లు.
'లైలా', 'మెకానిక్ రాకీ' సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో కంపేర్ చేస్తే... 'ఫంకీ' మంచి అమౌంట్ రాబట్టినట్టే లెక్క. ఆ రెండిటి కంటే తాజా సినిమా 5 కోట్లు ఎక్స్ట్రా బిజినెస్ చేసింది మరి. విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ కలిసి చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ బిజినెస్ (రూ. 10.30 కోట్లు)ను సైతం ఈ మూవీ బీట్ చేసింది.
'ఫంకీ'కి ముందు బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విశ్వక్ సేన్ కమర్షియల్ సినిమాల్లో 'దాస్ కా ధమ్కీ' నిలిచింది. ఆ మూవీ థియేట్రికల్ / డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను రూ. 11.76 కోట్లకు అమ్మారు. ఇప్పుడీ 'ఫంకీ' ఆ మూవీని బీట్ చేసింది. 'గామి' రూ. 11.82 కోట్లు బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల టాక్. అది ప్రయోగాత్మక సినిమా. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా రూ. 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దానికి ముందు 'ఓరి దేవుడా' (రూ. 5.72 కోట్లు), 'అశోక వనంలో అర్జున కళ్యాణం' (రూ. 4.83 కోట్లు), 'పాగల్' (రూ. 5.45 కోట్లు) సినిమాలతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.























