అన్వేషించండి

Mr Reddy Teaser: ప్రేమ, పెళ్లికి అర్థం చెప్పే 'మిస్టర్ రెడ్డి'... రూరల్ లవ్ యాక్షన్ డ్రామాగా టీఎన్ఆర్ సినిమా

TNR's Mr Reddy Movie Update: టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ పతాకం మీద గోల్డ్ మ్యాన్ రాజా నటించి, నిర్మించిన సినిమా 'మిస్టర్ రెడ్డి'. ప్రేమ, పెళ్లికి అర్థం చెప్పే కథతో రూపొందిన ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

'మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదు... జీవితాన్ని చివరి వరకు పంచుకోవడం' - ఇదీ 'మిస్టర్ రెడ్డి' టీజర్‌ ఎండింగ్‌లో హీరో రాజా చెప్పే డైలాగ్. మాటల్లో మాత్రమే కాదు, సినిమాలోనూ పెళ్లి, ప్రేమ గొప్పదనం చెప్పామని చిత్ర బృందం అంటోంది. ఇటీవల తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సినిమా టీజర్ విడుదల చేశారు. పట్నం సునీతారెడ్డి, నల్గొండ గద్దర్ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. 

మనసే లేని డాక్టర్...
రౌడీతో ప్రేమలో పడితే?
గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహా రావు - టీఎన్ఆర్) హీరోగా నటించడంతో పాటు  స్వయంగా ప్రొడ్యూస్ చేసిన సినిమా 'మిస్టర్ రెడ్డి'. వెంకట్ వోలాద్రి దర్శకుడు. టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ పతాకం మీద రూపొందిన ఈ సినిమాలో మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి ఇతర ప్రధాన తారాగణం.

'మిస్టర్ రెడ్డి' టీజర్ చేస్తే... హీరోయిన్ డాక్టర్ రోల్ చేశారు. హీరో ఏమో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్, దండాలు చేసే వ్యక్తి అని అర్థం అవుతోంది. కథానాయికతో 'నువ్వు మనసే లేని డాక్టర్' అని బామ్మ ఎందుకు చెప్పింది? రౌడీ లాంటి వ్యక్తితో ఆమె ఎందుకు స్నేహం చేసింది? అతను ప్రపోజ్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేసింది? హీరో బాల్యంలో అతను ప్రేమించిన అమ్మాయి, ఇప్పుడీ డాక్టర్ ఒక్కరేనా? హీరో గతం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Read: 'జీ తెలుగు'ను డామినేట్ చేసిన 'స్టార్ మా'... మళ్లీ కార్తీక దీపమే టాప్.. టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... ఈ వారం లిస్టులో టాప్ 10 సీరియల్స్ ఏవో చూడండి

హీరో గోల్డ్ మ్యాన్ రాజా మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్, సునీత, నల్లగొండ గద్దర్ గార్లకు థాంక్స్. అందరికీ టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్లమంతా కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. త్వరలో సినిమాను విడుదల చేస్తాం'' అని అన్నారు. దర్శకుడు వెంకట్ వోలాద్రి ''మా సినిమాకు పని చేసిన వాళ్లంతా సినిమా ఇండస్ట్రీకి కొత్త. కష్టపడి చేసిన మా ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవ్, అనుపమ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 

Also Read: ఒరిస్సాలో అడుగు పెట్టిన మహేష్... రాజమౌళి సినిమా కోసం, ఆయనతో వెళ్లిందెవరో గుర్తు పట్టారా?

Mr Reddy Movie Cast And Crew: టీఎన్ఆర్, మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి తదితరులు నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్: గోవింద్, ఫైట్స్:యాక్షన్ గౌరీ, ఛాయాగ్రహణం: కెఎన్ భూషణ్, సంగీతం: కేఎస్ఆర్ మ్యూజికల్, నిర్మాత : టీఎన్ఆర్, రచన - దర్శకత్వం : వెంకట్ రెడ్డి వోలాద్రి.

Also Readమా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె

టాప్ హెడ్ లైన్స్

Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget