అన్వేషించండి

Tollywood: ఈ హిట్ చిత్రాలన్నీ మన సొంత కథలే - ఇకనైనా రీ‘మేకు’లు దించడం ఆపుతారా..?

ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలను ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. ఒరిజినల్ కంటెంట్ సినిమాలపైనే హిట్ చేస్తున్నారు. సొంత కథలతో తీసిన 'బలగం' 'దసరా' 'విరూపాక్ష' లాంటి మూవీస్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి

కరోనా పాండమిక్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారింది. ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్ కు అలవాటు పడిపోయిన సినీ ప్రియులు.. ఇప్పుడు వరల్డ్ సినిమా గురించి బాగా తెలుసుకుంటున్నారు. ఎలాంటి చిత్రాలను థియేటర్ లో చూడాలి.. ఏ సినిమాలను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్‌లో చూడాలనే దానిపై ఫుల్ క్లారిటీగా ఉన్నారు. కేవలం ఒరిజినల్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలనే థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. ఈ మధ్య వచ్చిన చిత్రాల రిజల్ట్స్ ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 

⦿ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

⦿ అదే బ్యానర్ లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీ కూడా మంచి విజయం సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఈ సినిమా రూపొందింది. ఇది వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

⦿ కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తీసిన సినిమా 'సార్'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ బైలింగ్విల్ మూవీ ఘన విజయం సాధించింది. ఫైనల్ రన్ లో రూ.110 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

⦿ చిన్న సినిమాగా వచ్చిన 'బలగం' మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ.. రూ.27 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది. దీనికి ఓటీటీలోనూ విశేష స్పందన లభించింది. కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ లో నిర్మించారు.

⦿ నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'దసరా'. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ రూరల్ మాస్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది.

⦿ కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు కథ'.. సుహాస్ 'రైటర్ పద్మభూషణ్' సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి.

⦿ రీసెంట్ గా వచ్చిన 'విరూపాక్ష' చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మిస్టిక్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పటికే రూ.50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. 

ఇకపై వచ్చేవన్నీ రీమేకులే - స్టార్ హీరోల సేఫ్ జర్నీ

ఇలా ఇటీవల కాలంలో సొంత కథలతో తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్స్ సాధించాయి. అదే సమయంలో గత ఏడాది కాలంలో వచ్చిన రీమేక్ చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన 'భీమ్లా నాయక్', 'గాడ్ ఫాదర్' వంటి రీమేక్ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. పాజిటివ్ రివ్యూస్ అందుకున్నాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. ఈ ఓటీటీ యుగంలో కూడా మన స్టార్ హీరోలు రీమేకులతోనే సేఫ్ జర్నీ చేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

⦿ 'ఓరి దేవుడా', 'ఊర్వశివో రాక్షసివో', 'బుట్టబొమ్మ' లాంటి రీమేక్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి అరువు తెచ్చుకున్న కథలను ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. 

⦿ టాలీవుడ్ లో ఇప్పుడప్పుడే రీమేక్స్ కు బ్రేక్ పడేలా లేదు. తమిళ హిట్ మూవీ 'వేదలమ్' ను చిరంజీవి 'భోళా శంకర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇది ఆగస్టు 11న విడుదల కానుంది.

⦿ అలానే 'వినోదం సీతమ్' సినిమాను మామా అల్లుళ్ళు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి రీమేక్ చేస్తున్నారు. PKSDT చిత్రం జూలై 28న థియేటర్లలోకి వస్తుంది.

⦿ హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేస్తున్నాడు. ఇది 'తేరి' రీమేక్.

⦿ ఇక కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఒక మలయాళ రీమేక్ అనే టాక్ ఉంది.

⦿ ఎవరు చేస్తారో తెలియదు కానీ.. 'మానాడు' 'కర్ణన్' రీమేక్స్ కూడా లైన్ లో ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మరికొన్ని రీమేక్ స్టోరీలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.

Also Read : 'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
PMKVY: సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
Sai Pallavi as Ramayan Sita: సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌
సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌
Kalki Movie: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
Embed widget