అన్వేషించండి

Arun Vijay's Mission Teaser : గ్యాంగ్‌స్టరా? స్మగ్లరా? టెర్రరిస్టా? యాక్షన్‌తో కుమ్మేసిన అరుణ్ విజయ్ & అమీ

అరుణ్ విజయ్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మిషన్ : చాప్టర్ 1'. ఈ రోజు నాలుగు భాషల్లో టీజర్ విడుదల చేశారు.

తమిళ కథానాయకుడు అరుణ్ విజయ్ (Arun Vijay) నటించిన తాజా సినిమా 'మిషన్ చాప్టర్ 1'. అమీ జాక్సన్ జైలు అధికారి పాత్ర చేశారు. దీనికి ఏఎల్ విజయ్ (AL Vijay) దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ రోజు నాలుగు భాషల్లో టీజర్ విడుదల చేశారు. 

'మిషన్' కథేంటి?
హీరో నేపథ్యం ఏమిటి?
Mission Chapter 1 Movie Teaser Review : 'మిషన్' టీజర్ చూస్తే... కథ ఏంటనేది చాలా క్లారిటీగా చెప్పేశారు. అనగనగా ఓ జైలు! దాని పేరు వాండ్స్ వర్త్ ప్రిజన్! అది  సెంట్రల్ లండన్ నుంచి ఆరు మైళ్ళ దూరంలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలకు చెందిన ఖైదీలు ఆ జైలులో ఉన్నారు. అందులో హీరో అరుణ్ విజయ్ ఒకరు. 

వాండ్స్ వర్త్ జైలులో హీరోయిన్ అమీ జాక్సన్ జైలు అధికారిగా కనిపించారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ చేశారని టీజర్ చూస్తే అర్థం అయ్యింది. జైల్లో ఖైదీలు తప్పించుకోవాలని చూస్తే... లాఠీ ఛార్జ్ చేయమని, జైలుకు సీల్ వేయమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాదు, రంగంలోకి దిగి ఖైదీలను కొట్టారు కూడా! పోలీస్ మీద చెయ్యి చేసుకోవడం ద్వారా అరుణ్ విజయ్ ఆ జైలుకు వస్తారు. అంతే కాదు... ఎవరో ఓ ఖైదీ జైలు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే పట్టుకుంటారు.  ఎందుకు అలా చేశారు? హీరో ఎవరు? అనేది సినిమా చూస్తే గానీ తెలియదు. హీరో కూడా యాక్షన్ ఇరగదీసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

'పోలీస్‌ను కొడతావా? నువ్వు గ్యాంగ్‌స్టరా? స్మగ్లరా? టెర్రరిస్టా?' అని అమీ జాక్సన్ ప్రశ్నిస్తే... 'నా బిడ్డ ఆస్పత్రిలో ఉంది. మేం ఇండియా నుంచి వచ్చాం. రెండు రోజుల్లో తనకు సర్జరీ. దయచేసి అర్థం చేసుకోండి' అని హీరో ఆన్సర్ ఇస్తారు. ఆ సమాధానం అమీకి నచ్చదు. అదొక కథ అనుకుంటుంది. టీజర్ చివర్లో అమ్మాయి డైలాగ్స్ వింటే సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉందని అర్థమైంది. యాక్షన్ అండ్ ఎమోషన్ మేళవించి తీసిన ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తామని లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలిపింది.

Also Read : బాలకృష్ణతో సినిమా నా కోరిక, చిరుతో పూనకాలు లోడింగ్ - స్టార్స్‌తో సినిమాలపై 'దిల్' రాజు క్రేజీ అప్డేట్స్

లైకా ప్రొడక్షన్స్ ద్వారా విడుదల!
'మిషన్ చాప్టర్ 1' రషెష్ చూసిన లైకా ప్రతినిథులు... తమ సంస్థ ద్వారా సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. టోటల్ నెగిటివ్ రైట్స్ కొనేశారు. నిర్మాతలు ఎం. రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌. స్వాతితో కలిసి దక్షిణాది భాషలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల లైకా ప్రొడక్షన్స్ సంస్థ 'మిషన్' సినిమాను విడుదల చేయనుంది. 

డూప్ లేకుండా స్టంట్స్ చేసిన అరుణ్ విజయ్!
'మిషన్ చాప్టర్' కోసం లండ‌న్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖ‌ర్చుతో ఓ జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీలో భారీ ఫైట్స్ తీశారు. డూప్ లేకుండా రిస్కీ యాక్ష‌న్ స‌న్నివేశాలను హీరో అరుణ్ విజ‌య్ చేశారని యూనిట్ సభ్యులు చెప్పారు. ఐదేళ్ల తర్వాత... '2.0' తర్వాత అమీ జాక్సన్ నటించిన తెలుగు చిత్రమిది. 'మదరాసు పట్టణం' సినిమాతో భారతీయ తెరకు ఆమెను పరిచయం చేసిన ఏఎల్ విజయ్... ఆమె రీ ఎంట్రీ సినిమాకు దర్శకుడు కావడం విశేషం.  నిమిషా స‌జ‌య‌న్‌, అబి హాస‌న్‌, భ‌ర‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌, విరాజ్ ఎస్‌, జాస‌న్ షా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. 

Also Read : మళ్ళీ చిక్కుల్లో 'ఆదిపురుష్' - శ్రీరామనవమి పోస్టర్ మీద ముంబైలో కంప్లైంట్

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget