X

Tattoo: బాలీవుడ్ హీరో భార్య ఒంటిపై టాటూ... దాని అర్థమేంటి?

షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ బయటికి కనిపించని చోట ఓ టాటూ వేయించుకుంది. ఆ టాటూ అర్దమేంటో తెలుసా?

FOLLOW US: 

షాహిద్ కపూర్ భార్యగా బాలీవుడ్ కుటుంబంలోకి అడుగు పెట్టింది మీరా రాజ్ పుత్. కేవలం 21 ఏళ్ల వయసుకే పెళ్లి చేసుకుంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుందంటూ అప్పట్లో నెటిజన్లు బాగా  ట్రోల్ చేశారు. కానీ మీరా వాటినెప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు షాహిద్-మీరా జంటకు ఇద్దరు ముద్దులొలికే పిల్లలు. బాలీవుడ్ హీరోలే కాదు, వారి భార్యలు ఏం చేసినా కూడా అభిమానులకు ఆసక్తిగానే ఉంటుంది. మీరా రాజ్ పుత్ కొన్నేళ్ల క్రితం ఓ టాటూ వేయించుకుంది. అది కనిపించని చోట వేసుకోవడంతో ఆమె టాటూ వేసుకున్న సంగతి షాహిద్ అభిమానులకు తెలియలేదు. ఇప్పుడు కొన్ని ఫోటోల ద్వారా ఆ టాటూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు  నెటిజన్లు. 

మీరా తన ఎడమ భుజానికి దగ్గరగా ఉన్న వీపు భాగంపై టాటూ వేయించుకుంది. అది ఒక కలువ పువ్వు. కలువ పువ్వు స్వచ్ఛతను, ఆధ్యాత్మిక భావనను, శాంతిని సూచిస్తుంది. అమ్మాయిలకు  కచ్చితంగా ఈ టాటూ నచ్చుతుంది. జీవితంలో శాంతంగా, స్వచ్ఛంగా ఉండాలనే గాఢమైన కోరిక కలవారు ఇలాంటి టాటూలు వేయించుకుంటారని అంటున్నారు టాటూయిస్టులు. అమ్మాయిలు వేసుకునే డిజైన్లలో సీతాకోకచిలుకలు, రకరకాలపూలు, డాడ్ అనే పేరు, లవ్ సింబల్స్, తమ పేరుతోని మొదటి అక్షరం... ఇలాంటివి ముందు స్థానాల్లో ఉంటాయని తెలిపారు. ఆధునిక యువత టాటూ వేయించుకోవడాన్ని ట్రెండీగా భావిస్తున్నారు. 

మీరా- షాహిద్ జంటకు 2015లో పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలైనా హీరోయిన్లను తలదన్నే అందం మీరా సొంతం. ఇప్పటివరకు వెండితెరపై ఒక్కసారి కూడా కనిపించకపోయినా ఆమె ఫేమ్ మామూలుగా లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు 28 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. ఆమె ఒక్క పోస్టు పెడితే గంటల్లో వైరల్ గా మారిపోతుంది. ఆమె అప్పుడప్పుడు మోడలింగ్ కూడా చేస్తుంది. బికినీ నుంచి లెహెంగా వరకు అనేక రకాల డ్రెస్సుల్లోని ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేస్తుంటుంది. షాహిద్- మీరా దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు. 

Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...
Also read:మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...
Also read: ఈ టీ తాగితే .. అందం అమాంతం పెరిగిపోతుందా!

Also read: విఘ్నాధిపతికి గోధుమ కుడుముల నైవేద్యం..

Also read: పవర్ హౌస్‌లో అడుగుపెట్టిన హమీద ఎవరి పేరు చెప్పనుంది..బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్ అయ్యే ఛాన్స్ కోల్పోదెవరు..!

Also read:అదిరే అందంతో ఫిదా చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్

Tags: Meera rajputh shahid kapoor Tattoo bollywood news

సంబంధిత కథనాలు

Varudu Kaavalenu: రీతూవర్మలో ఆ క్వాలిటీ బాగా నచ్చిందన్న అల్లు అర్జున్

Varudu Kaavalenu: రీతూవర్మలో ఆ క్వాలిటీ బాగా నచ్చిందన్న అల్లు అర్జున్

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Annaatthe trailer: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..

Annaatthe trailer: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..

Aryan Khan Bail Hearing: ఆర్యన్ ఖాన్‌కు మరో 'సారీ'.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Aryan Khan Bail Hearing: ఆర్యన్ ఖాన్‌కు మరో 'సారీ'.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Akkineni Nagarjuna: 'ఆర్ఆర్ఆర్'తో పోటీ అంటే.. రిస్క్ ఏమో బంగార్రాజూ.. 

Akkineni Nagarjuna: 'ఆర్ఆర్ఆర్'తో పోటీ అంటే.. రిస్క్ ఏమో బంగార్రాజూ.. 
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..