Thiruveer Marriage: సైలెంట్‌గా ‘మసూద’ నటుడి పెళ్లి - సోషల్ మీడియాలో ఫోటోలు షేర్!
Thiruveer Marriage: ‘మసూద’తో హీరోగా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు తిరువీర్. తాజాగా సైలెంట్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Masooda Hero Thiruveer Marriage: టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ నుండి మరో హీరో తప్పుకున్నాడు. అతనే ‘మసూద’ ఫేమ్ తిరువీర్. ఇటీవల పెళ్లి పీటలెక్కిన తిరువీర్.. తన హల్దీ, మెహందీ, పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కల్పన రావు అనే అమ్మాయితో తిరువీర్ వివాహం జరిగింది. కానీ అసలు కల్పన రావు ఎవరు? వీరిద్దరిదీ లవ్ మ్యారేజా కాదా లాంటి వివరాలు తెలియలేదు. ‘ఒక కొత్త ప్రారంభం’ అంటూ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సంతోషంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు తిరువీర్. ‘మసూద’తో హీరోగా గుర్తింపు సాధించిన తిరువీర్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
A new beginning….❤️❤️❤️ pic.twitter.com/ws3NgbprQ2
— Thiruveer (@iamThiruveeR) April 21, 2024
క్యారెక్టర్ ఆర్టిస్టుగా..
ముందుగా ‘బొమ్మల రామారం’ అనే సినిమాతో యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు తిరువీర్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమయ్యాడు కాబట్టి తనకు వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలే వచ్చాయి. ఎన్నో హిట్ సినిమాల్లో తను కీలక పాత్రల్లో కూడా కనిపించాడు. అప్పుడప్పుడు విలన్‌గా కూడా చేశాడు. రానా హీరోగా తెరకెక్కిన ‘ఘాజీ’ అనే చిత్రంతో తనకు కాస్త గుర్తింపు లభించింది. దాని తర్వాత కూడా ఒకట్రెండు చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్‌లో నటించాడు తిరువీర్. మొదటిసారి ‘జార్జ్ రెడ్డి’ అనే మూవీతో విలన్‌గా మారాడు. ఇందులో తను చూపించిన విలనిజంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో తనకు విలన్‌గా కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది.
కెరీర్‌లో టర్నింగ్ పాయింట్..
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’లో కూడా తిరువీర్ విలన్‌గా కనిపించాడు. దీని ద్వారా తిరువీర్‌పై మేకర్స్ దృష్టిపడింది. అందుకే తనకు ‘మసూద’లో హీరోగా ఛాన్స్ వచ్చింది. ప్రతీ భాషలో హారర్ కామెడీ చిత్రాలు చాలానే తెరకెక్కుతున్నాయి. కానీ ఒక ఔట్ అండ్ ఔట్ హారర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు చూసి చాలాకాలమే అయ్యింది. అలా పూర్తిస్థాయి హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘మసూద’ సైలెంట్‌గా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. ఈ మూవీ తిరువీర్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. దీంతో తను పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిపోయాడు. ‘మసూద’ తర్వాత వచ్చిన ‘పరేషాన్’తో పూర్తిగా తిరువీర్.. పక్కింటబ్బాయి పాత్రలకు పర్ఫెక్ట్ అని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు.
రెండు సినిమాలతో..
ప్రస్తుతం తిరువీర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు చిత్రాలు ‘పారాహుషార్’, ‘మోక్షపఠం’.. 2024లోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రొఫెషనల్ లైఫ్‌లో హ్యాపీగా ముందుకెళ్తున్న తిరువీర్.. పర్సనల్ లైఫ్‌లో పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. ఇలాగే తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటూ మంచి సినిమాలతో ప్రేక్షకులను దగ్గరయితే తిరువీర్ కూడా మినిమమ్ గ్యారెంటీ హీరో అవుతాడని మూవీ లవర్స్ భావిస్తున్నారు. సినిమాల్లో మాత్రమే కాకుండా ఓటీటీల్లో వెబ్ సిరీస్‌ల విషయంలో కూడా తిరువీర్ ఎక్కువశాతం యాక్టివ్‌గానే ఉంటాడు.
Also Read: 'యానిమల్'కు రోలెక్స్ బెస్ట్ - 'యానిమల్ 2' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా