By: ABP Desam | Updated at : 10 Apr 2023 03:14 PM (IST)
తిరువీర్ (Image Credits: Thiruveer/Twitter)
Thiruveer : 'మసూద' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తిరువీర్.. తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస నిర్మాతగా, గోపీ విహారి (జి.జి.) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ 'వినోదాత్మక పీరియాడికల్ డ్రామా'లో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ తిరువీర్ హర్షం వ్యక్తం చేశారు.
నాటకరంగ అనుభవంతో 'జార్జిరెడ్డి', 'పలాస', 'మల్లేశం' లాంటి చిత్రాలలో నటుడిగా నటించిన తెలంగాణ పాలమూరు బిడ్డ 'తిరువీర్'. ఆ తర్వాత 'మసూద' సినిమాతో హీరోగా ఎంట్రీ తన టాలెంట్ ను ఇండస్ట్రీకి మరోసారి పరిచయం చేశారు. థ్రిల్లర్ సన్నివేశాలతో రూపుదిద్దుకున్నఈ సినిమాకు మంచి విజయం రావడంతో తిరువీర్‌కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ గా మారింది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. సినీ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ యంగ్ హీరో.. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ.. కేవలం ఒక్క పాత్రకే పరిమితమైపోకుండా తన సత్తా చూపిస్తున్నారు. విభిన్న పాత్రలతో ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు పొందిన తిరువీర్.. తాజాగా తన కొత్త సినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక పిరియడ్ ఫిల్మ్ రూపొందుతోందని తిరువీర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జీజీ ఈ సినిమాకు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతుండగా.. ప్రముఖ వ్యాపార వేత్త రవికుమార్ పనస సైతం ఈ సినిమాతో నిర్మాతగా మారారు. ఈ ఎంటర్ టైనింగ్ పిరియడిక్ డ్రామా ఫిల్మ్‌లో తానూ భాగమైనందుకు ఆనందంగా ఉందంటూ తిరువీర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తన ఫొటోతో పాటు డైరెక్టర్ గోపి విహారి, నిర్మాత రవికుమార్ పనస ఫొటోలను కూడా ఆయన ఈ పోస్టుకు జత చేశారు. దీంతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తిరువీర్ కు నెటిజన్లతో పాటు ఆయన ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్టు కామెంట్లు పెడుతున్నారు.
విభిన్న కథాంశంతో నూతన దర్శకుడు జి.జి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'ప్రొడక్షన్ నెంబర్:1' చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్టు సమాచారం. మేకర్స్ ఇప్పటివరకూ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ను వెల్లడించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికైతే ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ గా పరిగణిస్తున్నారు. రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా, అత్యున్నత సాంకేతిక నిపుణులతో రూపుదిద్దుకుంటోందని నిర్మాత రవి కుమార్ పనస వెల్లడించారు. మునుపెన్నడూ చూడని కథాంశంతో, ప్రతిభావంతులైన నటులతో, దర్శకుడితో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏషియన్ ఫిలింస్ సమర్పణలో ఈ సినిమాని తీస్తుండడం మరింత సంతోషదాయకమన్నారు. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా జానర్ లో రూపొందుతోందని రవి కుమార్ తెలిపారు.
Also Read : ఎన్టీఆర్ సాంగులో హుక్ లైన్ టైటిల్ గా, సింగిల్ క్యారెక్టర్ తో సినిమా
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి