Mani Ratnam: విక్రమ్ కొడుకుతో మణిరత్నం నెక్స్ట్ మూవీ - హీరోయిన్ ఎవరో తెలుసా?
Mani Ratnam Dhruv Vikram: 'థగ్ లైఫ్' రిజల్ట్ తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నం నెక్స్ట్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తమిళ స్టార్ హీరో కుమారునితో ఆయన తన తర్వాత మూవీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.

Mani Ratnam New Movie With Dhruv Vikram: ఇండస్ట్రీకి ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ అందించి తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు లెజెండరీ డైరెక్టర్ 'మణిరత్నం'. ఆయన పేరు చెబితేనే ఓ ఎమోషన్, లవ్ స్టోరీతో కూడిన ఎంటర్‌టైనర్స్ గుర్తొస్తాయి. రీసెంట్‌గా యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో థగ్ లైఫ్ మూవీని తెరకెక్కించారు మణిరత్నం.
వీరిద్దరి కాంబోలో 1987లో వచ్చిన 'నాయకుడు' మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఇదే కాంబోలో వచ్చిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్'పై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇటీవల మణిరత్నం మూవీస్ అప్పటి రేంజ్ విజయాన్ని సాధించడం లేదు. 'థగ్ లైఫ్' తర్వాత ఆయన చేయబోయే మూవీపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది.
స్టార్ హీరో కొడుకుతో...
తమిళ స్టార్ శింబుతో మణిరత్నం తన తర్వాత మూవీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. లేటెస్ట్ బజ్ ప్రకారం... ఆయన తన నెక్స్ట్ మూవీని తమిళ స్టార్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ వినిపించారని... అందుకు ధ్రువ్ విక్రమ్ ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
స్టోరీ లైన్ అదేనా?
చెన్నైలోని ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ స్టోరీ జరగనున్నట్లు తెలుస్తుండగా దీనికి ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని సైతం యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సిటీ అమ్మాయికి, ఓ పోలీస్ అధికారికి మధ్య జరిగే లవ్ స్టోరీనే ప్రధానాంశం అని తెలుస్తోంది. అయితే, ఇది పాన్ ఇండియా స్థాయిలో కాకుండా కేవలం తమిళంలోనే తెరకెక్కించాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
షూటింగ్ ఎప్పుడంటే?
ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కేవలం 2 నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి 2026, ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది.



















