హాలీవుడ్‌లో ఉండి ఉంటే ఎక్కడో ఉండేదాన్ని, నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు: మంచు లక్ష్మి!
ప్రముఖ నటి, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో ఉన్న తెలుగు హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో నటిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది మంచు లక్ష్మి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు లక్ష్మి చేసింది తక్కువ సినిమాలే అయినా వాటితో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కేవలం సినిమాలే కాకుండా అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. దీంతో సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతోపాటు అప్పుడప్పుడు పలు బుల్లితెర టీవీ షోలలో కూడా మెరుస్తోంది. అయితే తాజాగా మంచు లక్ష్మి టాలీవుడ్ లో ఉన్న తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ మేరకు మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను తెలుగు ఇండస్ట్రీకి రాకముందు కొన్ని హాలీవుడ్ సినిమాలకు పనిచేసినట్లు చెప్పింది. అక్కడే ఉండుంటే ఈ పదేళ్లలో తాను ఎక్కడో ఉండేదాన్ని అని, అప్పుడప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో అని అనిపిస్తుంది అని పేర్కొంది. ఆ దేవుడు మళ్ళీ అవకాశం కల్పిస్తే మళ్ళీ హాలీవుడ్ కి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని, ఇక్కడి తెలుగు ప్రేక్షకులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఇష్టపడతారు.. కానీ వాళ్ళ సొంత రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లను మాత్రం ఆదరించరని మంచు లక్ష్మి చెప్పింది. ప్రేక్షకులు ఇక్కడి వాళ్లను ఒక్క శాతం ప్రేమించినా, వాళ్ళు ఎక్కడో ఉంటారని తెలిపింది.
ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు? టాప్ హీరోయిన్లతో పాటు ఆమెకు సినిమా అవకాశాలే రావడం లేదు. తెలుగు అమ్మాయి బిందు మాధవి ఎందుకు సినిమాలు చేయట్లేదు? మధుశాలినీతోపాటు శివాని, శివాత్మిక.. వీళ్లంతా తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు? అంటూ మంచు లక్ష్మి ప్రశ్నించింది. వీళ్లంతా దేనిలో తక్కువ? అందంతో పాటు టాలెంట్ ఉన్న వాళ్లే కదా! అంటూ ఒకింత ఫైర్ అయింది. ఇక్కడి ప్రేక్షకులకే కాదు మూవీ మేకర్స్ కి కూడా ముంబై, తమిళ్, పంజాబీ, కేరళ, కన్నడ వంటి రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లే కావాలి. కానీ తెలుగు వాళ్ళను మాత్రం అస్సలు వద్దంటారు" అంటూ మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక తాజాగా మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. నెటిజన్స్ కూడా ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ 'మంచు లక్ష్మి చెప్పింది నిజమే కదా' అంటూ ఆమెకు సపోర్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు తెలుగు నటులను ప్రోత్సహించాలని సీనియర్ నటులైన కోట శ్రీనివాసరావు ఎన్నో ఇంటర్వ్యూల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యద్భుతమైన నటీనటులు ఉన్నప్పుడు ఇతర భాషల నుంచి నటులను ఎందుకు తీసుకొస్తున్నారు? అంటూ పలు సందర్భాల్లో కోటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : భలే ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ - ఆ తమిళ్ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా కృతి శెట్టి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial