అన్వేషించండి

Krithi Shetty: భలే ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ - ఆ తమిళ్ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా కృతి శెట్టి!

కృతి శెటశెట్టి ప్రస్తుతం మలయాళంలో టొవినో థామస్ సినిమాలో నటిస్తుండగా తాజాగా తమిళ స్టార్ హీరో జయం రవి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

Krithi Shetty: టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కృతి ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఫ్లాప్ లను చవిచూస్తోంది. రామ్ తో నటించిన ‘వారియర్’ సినిమాతో కృతి ఫ్లాప్ లు మొదలైయ్యాయి. తెలుగులో అమ్మడుకి ఇప్పుడు సరైన ఆఫర్లేవీ రావట్లేదని టాక్. అందుకే ఇతర భాషల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది ఈ బ్యూటీ. ఇప్పటికే మలయాళంలో టొవినో థామస్ సినిమాలో నటిస్తుండగా తాజాగా తమిళ స్టార్ హీరో జయం రవి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కృతి శెట్టి చీరకట్టులో మెరిసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కృతి..

కెరీర్ ప్రారంభంలో వరుస హిట్ లతో దూసుకుపోయింది కృతి శెట్టి. తర్వాత హీరో రామ్ తో ‘వారియర్’ సినిమాలో నటించింది. ఈ మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘కస్టడీ’ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో టాలీవుడ్ కి పులిస్టాప్ పెట్టి ఇతర భాషల్లో నటిస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో మలయాళ సినిమా ఒక్కటే ఉంది. మొన్నామధ్య తమిళ్ లో ఓ సినిమాలో సెలెక్ట్ అయినా తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.  అయితే ఇప్పుడు తమిళ్ స్టార్ నటుడు జయం రవి సినిమాలో చాన్స్ కొట్టేసింది బేబమ్మ. ఇటీవలే ఈ సినిమా లంఛనంగా ప్రారంభం అయింది. ప్రస్తుతం కృతి ఆశలు అన్నీ ఈ సినిమాల మీదే ఉన్నాయి. తమిళ్, మలయాళం లో హిట్ అందుకుంటేనే మళ్లీ టాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలతో అయినా బేబమ్మ ఫేట్ మారుతుందో లేదో చూడాలి. 

పాన్ ఇండియా సినిమాగా ‘జీని’..

‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో అరుళ్ మొళిగా టైటిల్ పాత్రను పోషించాడు జయం రవి. ఆయనకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. జయం రవి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నిటినీ రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు. దానితో పాటు మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమాకు ‘జీని’ అనే టైటిల్  దీనికి జీనీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ మూవీతో జేఆర్ అర్జున్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టితో పాటు కల్యాణి ప్రియదర్శన్, వామిక కబి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ యాక్టర్ దేవయాని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఏఆర్ రెహ్మాన్ ఈ పిక్చర్ కు సంగీతం అందిస్తున్నారు. మహేశ్ ముత్తుసామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ సహా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

Also Read: మేమిద్దరం ప్రేమ కంటే ముందు శారీరకంగానే ఆకర్షితులయ్యాం - తమ లస్ట్ స్టోరీ చెప్పిన విద్యాబాలన్

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget