అన్వేషించండి

Bramayugam: ‘భ్రమయుగం’లో విల‌న్ లేడు, హీరో లేడు - ఆసక్తికర విషయాలు చెప్పిన మెగాస్టార్

Bramayugam: ‘భ్రమయుగం’ పేరుతో స‌రికొత్త‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు మమ్ముట్టి. ఈ నెల 15న సినిమా రిలీజ్ అవుతుండ‌గా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు ఆయ‌న‌.

Mammootty about Bramayugam Movie: మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి.. ఎన్నో హిట్ సినిమాలు తీసి కోట్లాది మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. డ‌బ్బింగ్ సినిమాలు, కొన్ని డైరెక్ట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు కూడా ద‌గ్గ‌ర‌య్యారు. 70+ ఏజ్‌లో కూడా సినిమాలు తీస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన సినిమా ‘భ్రమయుగం’ ఫిబ్ర‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హారర్‌ థ్రిల్లర్‌‌తో ఆడియన్స్ ను భయపెట్టడానికి రెడీ అయ్యారు మ‌మ్ముట్టి. ఈ సినిమాకి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు ఆయ‌న‌. 

హీరో లేడు, విల‌నూ.. లేడు 

సినిమా అంటే.. హీరో, హీరోయిన్, విల‌న్, సైడ్ క్యారెక్ట‌ర్లు అంద‌రూ ఉంటారు. నిజానికి ప్రేక్ష‌కుల దృష్టిలో సినిమా అంటేనే అది. అయితే, ఈ సినిమాలో మాత్రం విలన్, హీరో ఎవ్వ‌రూ లేర‌ట‌. అంద‌రూ క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే అంటున్నారు మమ్ముట్టి. “ఇది పీరియాడిక్ సినిమా.. ఆ టైంలో విల‌న్ లు, హీరోలు లాంటి వారు లేరు. ఇక ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ చాలా మిస్ట‌రీగా ఉంటుంది. చాలా ఇంట్ర‌స్ట్రింగ్ గా కూడా ఉంటుంది. ఇంత‌కు మించి నేను ఏమీ చెప్ప‌ను. మీరు డైరెక్ట్ గా ఎక్స్ పీరియెన్స్ చేయండి. ఇలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలో పార్ట్ అవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఫ్లాష్ బ్యాక్ ని బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తారు. కానీ, ఈ సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్. నేటి యువ‌త‌కి చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని ట్రైల‌ర్ చూసి ఆ ప్రీ - క‌న్సీవ్డ్ నోట్స్ తో వెళ్లొద్దు. ఓపెన్ మైండ్ తో చూడండి” అని సూచించారు మ‌మ్ముట్టి. 

బ్లాక్ అండ్ వైట్ సినిమా

ప్ర‌స్తుతం వ‌స్తున్న సినిమాలు అన్నీ.. క‌ల‌ర్ లోనే చూస్తున్నాం. హెచ్ డీ క్వాలిటీలో చూస్తున్నాం. అలాంటిది ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆస‌క్తి పెరిగిపోయింది. ఇక ఈసినిమాని రాహుల్ సదాశివన్ తెర‌కెక్కించారు. 'భ్రమయుగం'. 'ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇక ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్, ట్రైల‌ర్ పిచ్చెక్కించాయి. చాలా స్పెష‌ల్ గా అనిపించాయి. దీంతో ఈసినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. 

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 

ఇదిలా ఉంటే మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషించిన 'యాత్ర 2' సినిమా కూడా ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యింది. ఆ సినిమాలో మమ్ముట్టి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర పోషించారు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్. దీనికి మహి వి రాఘవ్ దర్శకత్వంలో వహించారు. ఇక వారం రోజుల గ్యాప్ లో 'భ్రమయుగం' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: నారా లోకేష్‌కు ఆర్జీవీ ఫ్లయింగ్ కిస్ - ఎన్టీఆర్ కంటే జూనియ‌ర్ ఎన్టీఆరే గొప్ప‌ అంటూ స్టేట్‌మెంట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget